Imtiaz collector
-
సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ
సాక్షి, విజయవాడ: సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్‌కేర్ సెంటర్ల ఏర్పాటు
సాక్షి, కృష్ణా : కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లోని చిన్నపిల్లల రక్షణ కోసం చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్.. కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలను తరలించేందుకు మూడు వాహనాలు సిద్ధం చేశామని, కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1098, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు కోలుకునే వరకు పిల్లలను సంరక్షిస్తామని అన్నారు. -
5 నుంచి ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఇంతియాజ్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియెట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మే 2021 నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1,12,154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయనున్నారని, వారిలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 54,171 మందికాగా రెండవ సంవత్సరం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 57,983 మంది ఉన్నారని కలెక్టరు అన్నారు. పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని, దీనిలో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 104 సెక్షన్ అమల్లో ఉంటుందని, 4 ఫయింగ్ స్క్వాడ్లను నియమించామని, 8 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, కోవిడ్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్‌ను నియమించామని, ఐసోలేషన్ గదిని కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రూట్ వివరాలను ఆర్టీసీ అధికారులకు అందించామని, పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టరు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, విజయవాడ నగరపాలక సంస్థ అడిషినల్ కమిషనరు మోహనరావు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ కన్వీనర్ ఆర్ఐఓ పి.రవికుమార్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్లు కె.యోహాన్, షేక్ అహ్మద్, బి.వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ షెడ్యూల్ మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు, పరీక్షల టైంటేబుల్‌ను వర్సిటీ వెబ్సైట్ నందు పొందుపరిచామన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించామన్నారు. తొలిసారిగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష ఫీజు, ఫలితాల ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. చదవండి: కోవిన్ పోర్టల్: టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి? -
డిసెంబర్ 31 నాటికి ఇన్పుట్ సబ్సిడీ..
సాక్షి, కృష్ణా జిల్లా: నివార్ తుపాన్ కారణంగా భారీగా పంటనష్టం సంభవించిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.41 లక్షల హెక్టార్లలో 16.12లక్షల టన్నుల వరి పండుతుందని ఆశించామని తెలిపారు. నాగాయలంక, మండవల్లి మండలాల్లో వరి పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1.08 వేల హెక్టార్లలో పంట నష్టానికి ఎన్యూమరేషన్ మొదలుపెట్టాం. క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతామన్నారు. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు) పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని, వ్యవసాయాధికారులకు ఎన్యూమరేషన్ ప్రధాన బాధ్యతగా చేయాలని ఆదేశించామని తెలిపారు. మంత్రులు, స్పెషల్ ఛీప్ సెక్రెటరీలు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారని తెలిపారు. డయల్ యువర్ జేసీ రేపు(శుక్రవారం) నిర్వహిస్తామని తెలిపారు. కౌలు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1800425440 కంట్రోల్ రూమ్ నంబరు రైతుల కోసం ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి, 50 రోజుల క్యాంపైన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు కలిసి ఈ క్యాంపైన్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8.4 లక్షల కోవిడ్ టెస్టులు జిల్లాలో జరిగాయని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?) -
కృష్ణా జిల్లాలో 519 కంటైన్మెంట్ జోన్లు: కలెక్టర్
సాక్షి, కృష్ణా: కొత్తగా కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లాలో 6 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహమ్మారి పట్ల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు అవుతున్నందున విజయవాడ రూరల్‌లోని కొత్తూరు, తాడేపల్లి గ్రామాలు, నూజివీడు మండలంలో యనమదల గ్రామం మోపిదేవి మండలంలో బొబ్బర్లంక, మొవ్వ మండలంలో పెదముక్టేవి, అవురుపూడి గ్రామాలను, ఘంటసాల మండలంలో వి.రుద్రవరం ప్రాంతాలలో కంటైన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 519 కంటైన్మెంట్ జోన్లో 2460 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కోరారు. 28 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాని 5 ప్రాంతాల్లో కంటైన్మేంట్ జోన్ల నిబంధనలను తొలగించామని చెప్పారు. అవి: జి.కొండూరు మండలంలో చెగిరెడ్డిపాడు గ్రామం, వీరుల్లపాడు మండలంలో చౌటపల్లి గ్రామం, మచిలీపట్నం మండలంలో నేలకుర్రు గ్రామం, పామర్రు మండలంలో జుజ్జవరం గ్రామం, కోడూరు మండలంలో లింగారెడ్డిపాలెం గ్రామంగా కలెక్టర్ పేర్కొన్నారు. -
కృష్ణానదికి పెరుగనున్న వరద ఉధృతి: కలెక్టర్
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతున్నందున ప్రకాశం బ్యారేజ్‌కు సుమారు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరనుందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వరద ఉధృతిపై అధికారులను మరింత అప్రమత్తం చేశామన్నారు. ఇవాళ ఉదయం పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ఉన్న 7.50 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. దీంతో నది పరివాహక ప్రజలు నివాస ప్రాంతాలు ఖాళీ చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజ్ ఇన్‌ఫ్లో 6,36,921 అవుట్ ఫ్లో 6,32,961 క్యూసెక్కులుగా ఉందని ఆయన తెలిపారు. దీంతో బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యలో వరద ముంపు ప్రాంతాలైన జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహిసీల్ధార్‌లను అప్రమత్తం చేశామన్నారు. చిన లంక, పెద్ద లంక ప్రాంతాల్లో పట్టిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించినట్లు చెప్పారు. అదే విధంగా కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని కలెక్టర్ హెచ్చరించారు. -
దసరా ఉత్సవాలు: రోజుకు 10వేల భక్తులు మాత్రమే!
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నవరాత్రులలో ప్రతి రోజు 10 వేల మంది ఆన్లైన్ టికెట్ తీసుకున్న భక్తులనే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని స్ఫష్టం చేశారు. మూల నక్షత్రం రోజు 13 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 10 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసు పైబడిన వారిని దర్శనానికి అనుమతించబోమన్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని, మూలనక్షత్రం రోజు ఉదయం 3 నుంచి రాత్రి 9 గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. (చదవండి: అలర్ట్ : ఈనెల 13 వరకు భారీ వర్షాలు) దేవస్థానంలోని అన్ని ప్రదేశాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో వచ్చే భక్తులు ఎవరికి వారు వాటర్ తెచ్చుకుంటే మంచిదని ఆయన భక్తులకు సూచించారు. కనకదుర్గ నగరం 6 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని, 450 మంది సిబ్బందిని శానిటైజేషన్‌కు ఉపయోగించినట్లు తెలిపారు. మహమ్మారి దృష్ట్యా నదిలో ఎలాంటి స్నానాలకు అనుమతి లేదని, కేశకండనశాల, అన్నదానం ఉండదు పేర్కొన్నారు. ఈసారి దేవస్థానం తరుపున భవాని మాలవిరమన ఏర్పాట్లు ఉండవని, భవానీలు అయిన సరే ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు ఒక లక్ష లడ్డులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, చెప్పుల స్టాండ్‌ను క్లాక్ రూమ్స్ వీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 93,000 వేల టికెట్స్‌ను ఆన్లైన్లో విడుదల చేస్తే ఇప్పటి వరకూ 65 వేల టికెట్లు బుక్ అయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. -
ప్రకాశం బ్యారెజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు గంటగంటకూ 7 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వరద పెరుగుతోంది. ఈస్టన్, వెస్టన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు సోమవారం 70 గేట్లను ఎత్తి సముద్రానికి నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహాం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి, రమేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు, వరదలు వస్తుండటంతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ అధికారుల శ్రమ మంత్రి అభినందనీయం అన్నారు. నీటి కొరత లేకపోవడంతో పంటలు సంవృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కానీ తెలుగు దేశం పార్టీ నేతలు వరదలని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. -
విజయవాడ లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు
సాక్షి, విజయవాడ : కరోనా వైద్యం పేరుతో పలు ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా లక్షల్లో ఫీజు వసూలు తన భర్త ప్రాణాలు పోగొట్టారని విజయవాడ లిబర్టీ ఆసుపత్రి యాజమాన్యంపై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. విజయవాడకు చెందిన లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ వైద్యం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.(చదవండి : పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్) రాజమండ్రికి చెందిన మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. లిబర్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. కమిటీ అందించిన నివేదికతో ఆటోనగర్‌లో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను వేరే చోటికి తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
సీఎం జగన్ కృషితో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్..
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న రన్ వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్,ఎయిర్ పోర్ట్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయంలో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.470 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. 3.5 లక్షల స్క్వేర్ ఫీట్స్ లో భవన నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. (చదవండి: కోవిడ్ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..) ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం జరిగితే ఆంధ్రరాష్ట్రానికే తలమానికంగా నిలువనుందన్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ మంజూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద
సాక్షి, కృష్ణా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ప్రకాశం బ్యాకేజ్కి వరద నీరు పోటెత్తుతోంది. వరదకు వర్షం తోడుకావటంతో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అరవై గెట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ సాయంత్రానికి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావచ్చని అంచానా వేస్తున్నారు. గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్ధితిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలిస్తూ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి... -
ఆ వార్తల్లో నిజం లేదు: కృష్ణా జిల్లా కలెక్టర్
సాక్షి, విజయవాడ: నగరంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని కలెక్టర్ తెలిపారు. కృష్ణా జిల్లాలో కరోనా ఉధృతి సాగుతూనే ఉంది. జిల్లాలో గురువారం మరో 230 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4482 కేసులు నమోదు కాగా, వారిలో 3260 మంది కోలుకుని ఆసుప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.(ఇంట్లోనే 16 గంటల పాటు మృతదేహం) -
కరోనా నివారణకు ఏపీలో ఐ మాస్క్ బస్సులు
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. కోవిడ్ టెస్టుల శాతాన్ని గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తోంది. త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐ మాస్క్ బస్సులను రంగంలోకి దించింది. విజయవాడ సిటీలో ఎనిమిది చోట్ల శ్వాబ్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు రెండు వేల మందికి టెస్టులు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. (అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..) ఐ మాస్క్ బస్సుల ద్వారా జరుగుతున్న కోవిడ్ టెస్టుల ప్రక్రియను కలెక్టర్ ఇంతియాజ్ శనివారం పరిశీలించారు. ప్రతీ అరగంటకు ఒకసారి హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. (బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్ !) -
ప్రతీరోజూ రెండు వేల కరోనా పరీక్షలు లక్ష్యం
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 54,385 కరోనా పరీక్షలు నిర్వహించామని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీరోజూ రెండు వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని తెలిపారు. విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు, గన్నవరం ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 20 వైద్య బృందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. (ఏపీ: వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఆదేశాలు) 600 పడకల నిమ్రా ఆసుపత్రిని మూడో కోవిడ్ సెంటర్‌గా గుర్తించామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు దాటి రావాలంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. త్వరితగతిన శాంపిల్స్ సేకరించేందుకు చెక్‌పోస్ట్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుల్లో ఐ మాస్క్ బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. (అక్రమ ఇసుక, మద్యం రవాణాపై కఠిన చర్యలు) -
కరోనా నియంత్రణకు కఠిన చర్యలు: కలెక్టర్
సాక్షి, విజయవాడ: జిల్లాలోని రెడ్ జోన్లలో ప్రతీ చోట జియోగ్రాఫికల్ క్వారంటైన్‌ను అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇంతీయాజ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక జిల్లా వ్యాప్తంగా 37 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని, ఒక్క విజవాడ సిటీలోనే 20 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నూజివీడు, జగ్గయ్య పేట, నందిగామ, పెనమలూరు, మచిలీపట్నాలలో కొన్ని క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. కంటైన్మెంట్ క్లస్టర్లలో ఎటువంటి వెసులుబాటులు లేవన్నారు. అదే విధంగా రెడ్ జోన్ ప్రాంతాలలో పూర్తిగా రాకపోకలు నిషేధించామని, గ్రీన్ జోన్లలో కూడా నిబంధనలకు లోబడే వెసులుబాటు కల్పించామని ఆయన అన్నారు. (సత్ఫలితాలిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారంటైన్..) నిబంధనలు ఉల్లంఘిస్తే ఆసుత్రిలోని క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చరించారు. కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పరిశ్రమల నిర్వహణ జరుగుతుందని, మిర్చి కోతకు వచ్చిన 3800 మంది వలసకూలీలను ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రకు తరలించామన్నారు. మరో 2200 మందిని బస్సుల ద్వారా స్వగ్రామాలకు చేర్చామని తెలిపారు. మిగిలిన వారిని కూడా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. (కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!) -
సత్ఫలితాలిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారంటైన్..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణకు అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రెడ్ జోన్లలో అవలంభిస్తోన్న జియోగ్రాఫికల్ క్వారెంటైన్ పద్ధతి సత్ఫలితాలను ఇస్తోంది. కృష్ణలంక, కార్మికనగర్, విద్యాధరపురం,అజిత్‌సింగ్‌నగర్, ఖుద్దూస్గర్లలో అమలు చేస్తున్నారు. ఈ పద్ధతి అమల్లో ఉన్న ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించామని.. అందరికీ పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ప్రభుత్వ శాఖల శ్రమతో కరోనా నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు. కోలుకునే వారి సంఖ్య పెరుగుతుంది.. రెడ్‌జోన్ లలో వైద్య శిబిరాలకు విశేష స్పందన వస్తోందన్నారు. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు. రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 8 వేల మందికి పరీక్షలు నిర్వహించామని.. ట్రూ నాట్, డిఆర్డీఎల్, ఇతర పద్దతుల ద్వారా మరో 12,000 మందికి టెస్టులు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పరీక్షల్లో 2.5 శాతం మందికే పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. మాంసం,చేపల విక్రయాలు నిషేధం: కమిషనర్ కరోనా కట్టడిలో భాగంగా మాంసం,చేపల విక్రయాలపై నిషేధం విధించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రేపు(ఆదివారం) చికెన్,మటన్,చేపల విక్రయాలు నిలిపివేస్తున్నామని వెల్లడించారు. కబేళా,చేపల మార్కెట్‌ను మూసేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా విక్రయాలు జరిపితే కఠినచర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. -
కరోనా: రోజుకు వెయ్యి పరీక్షలు!
సాక్షి, విజయవాడ: జిల్లాలో సోమవారం నుంచి రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఆదివారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆరు ట్రూనాట్ మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. వీటి ద్వారా రోజుకు ఎక్కువ మంది శాంపిల్స్ సేకరించవచ్చని తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా వస్తున్నాయన్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు ఒక్కో ప్రాంతంలో బూత్‌లు ఏర్పాటు చేసి ఈ శాంపిల్స్ తీసుకుంటామని చెప్పారు. శాంపిల్స్ పూలింగ్ కింద ఒకేసారి 16 మంది శాంపిల్స్‌ను పరీక్షించవచ్చని తెలిపారు. ఈ ఫలితాల్లో పాజిటివ్ వస్తే విడివిడిగా మళ్లీ టెస్టింగ్‌లు చేసి పాజిటివ్ వ్యక్తిని గుర్తిస్తామన్నారు. తొలుత కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో పరీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిన ప్రాంతాల్లో నిర్వహిస్తారని వివరించారు. వైద్య పరీక్షలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందో లేదో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తొలి రోజు విజయవాడ కొత్తపేట, రాణిగారితోట, జగ్గయ్యపేట, నందిగామ మండలంలోని రాఘవాపురం, చందర్లపాడు మండలంలోని ముప్పాళ్లలో శాంపిల్స్ సేకరిస్తారని వెల్లడించారు. రెండో రోజు మంగళవారం సీతారాంపురం, కుద్దూస్నగర్, మచిలీపట్నం, నూజీవీడులో శాంపిల్స్ తీసుకుంటారని తెలిపారు. ఆయా ప్రాంతాల వారు స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ పరీక్ష చేయించుకుంటే కరోనా ప్రభావం తమపై ఉందేమోనన్న అనుమానాలు తొలగిపోతాయని చెప్పారు. జిల్లాలో 50 వేల పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఓపీ విభాగం ప్రభుత్వాస్పత్రిని కోవిడ్–19 హాస్పిటల్‌గా మార్చినందున ఇక్కడ ఓపీ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్ పేషంట్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పిన్నమనేని హాస్పిటల్స్, జీజీహెచ్‌లో నిరంతరాయంగా వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారని, వారు ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా మారడంతో అక్కడే సమీపంలోని హోటళ్లలో వారికి వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆశా వర్కర్లు, వైద్యులు, నర్సులు, కాంపౌండర్లు ఈ కష్ట సమయంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. . కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ, వైరస్ బాధితులకు వైద్య సౌకర్యాలపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి ఆదివారం అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సిద్ధార్థ జైన్ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ వాట్సాప్ ద్వారా సమాచారం తెలుసుకోండి చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్, ఫేస్బుక్, మెసేంజర్, చాట్‌బాత్ ద్వారా కోవిడ్–19 సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదివారం తెలిపారు. వాట్సాప్, చాట్‌బాత్ నంబర్ 82971 04104, చాట్‌బాత్ లింక్https://wa.me/918297104104/918297104104 ద్వారా కోవిడ్–19 నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏర్పాట్లు చేసిందన్నారు. కరోనా వైరస్ గురించి ప్రాథమిక సమాచారం, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సేవలకు సంబంధించి తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారని తెలిపారు. ఫేస్బుక్లో ఆరోగ్య ఆంధ్రను ఫాలో అవ్వడం ద్వారా ప్రభుత్వ అధికార సమాచారం పొందవచ్చన్నారు. కరోనా వైరస్ గురించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ 104 లేదా 0866–2410978 నంబర్లు, covid&19info@ap.gov.inకు ఈమెయిల్ ద్వారా సమాచారం తెలియజేయవచ్చన్నారు -
‘ఆ మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు సూచనలను ఉల్లంఘిస్తే కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఈ నెల 21 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ వాల్యూషన్ తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. వాటిని ఈ నెల 31 తర్వాత ఇంటర్ బోర్డు వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఏలూరులో కరోనా హెచ్చరికలను ఖాతరు చేస్తూ పాఠశాల నిర్వహించిన నారాయణ, భారతి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. యజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు పాఠశాలలను సీజ్ చేశారు. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం) విజయవాడ: జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకొన్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. పదిహేను రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 900 మంది విదేశాల నుంచి వచ్చారని, వాళ్లందరినీ హౌస్ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. ఇప్పటి వరకు తీసిన మూడు శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయని, ఈ రోజు(శుక్రవారం) మరో శాంపిల్ టెస్టింగ్ కోసం పంపామని అన్నారు. యాభై ఆసుపత్రిలో 200 పడకలు ఏర్పాటు చేశామని, థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎయిర్ పోర్టు నుంచి అనుమతిస్తున్నామని తెలిపారు. నిన్న(గురువారం) ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన 18 మంది మెడికల్ విద్యార్థులను హౌస్ ఐసోలేషన్ లొ పెట్టామని, రాష్ట్రంలో కరోనా ప్రభావం భయపడే స్థాయిలో లేకపోయినా.. జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. జనంలో కరోనాపై అపోహలు పోగొట్టి అవగాహన పెంచాలని సీఎం సూచించారన్నారు.(కామసూత్ర నటికి కరోనా పాజిటివ్) -
జనవరి 31 డెడ్ లైన్
సాక్షి, భవానీపురం(విజయవాడ పశ్చిమ): ‘మీరు అడిగినవన్నీ ఇచ్చాం. మీరేం చేస్తారో నాకు తెలియదు.. జనవరి 31 నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.. దట్సాల్’.. అని కలెక్టర్ ఇంతియాజ్ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ సోమాను ఆదేశించారు. బుధవారం నేషనల్ హైవేస్ అధికారులు, సోమా కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆయన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరంఫ్లై ఓవర్ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తికాగా, మిగిలిన పనులు డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని చెప్పారు. జనవరి 31 నాటికి ఫినిషింగ్ పనులు పూర్తిచేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను, సోమా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. పనులు వేగవంతం.. నిర్మాణ పనులకు సంబంధించి 43 స్పాన్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 40 పూర్తయ్యాయని తెలిపారు. ఇటీవల దసరా ఉత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా నిలుపుదల చేసిన 3 స్పాన్స్ పనులను త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండు, మూడు ఏళ్ల నుంచి మందకొడిగా సాగిన పనులు గత ఆరు నెలల నుంచి వేగవంతమయ్యాయని చెప్పారు. విజయవాడ నగరానికి తలమానికంగా తయారవుతున్న ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. నేషనల్ హైవే సూపరింటెండెంట్ ఇంజినీర్ జాన్‌మోషే మాట్లాడుతూ రూ.320 కోట్లతో చేపట్టిన కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆరు లేన్ల ఈ ఫ్లై ఓవర్‌పై ఒక వైపు కొంత మేర బీటీ లేయర్ వేయడం జరిగిందని, త్వరలోనే రెండో వైపు కూడా మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరిశీలించారు. విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సచివాలయంలో ప్రభుత్వ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రభుత్వ పధకాలు, నవరత్నాల అమలు తీరును సీఎస్ నీలం సాహ్నికు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వివరించారు. ప్లాస్టిక్ నిషేధంపై చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు, పెన్షన్లు అమలు తీరును ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని అడిగి తెలుసుకున్నారు. అలానే రైతు భరోసా పథకం అర్హులందరికీ చేరిందా అని సీఎస్ రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్, రూరల్ ఎమ్మార్వో వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు శుభవార్త
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు ఒక చక్కని శుభవార్త అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్ చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణ తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేదలకు సూచించారు. దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరణకు రూ. 1 చెల్లించాలన్నారు. 300 చదరపు గజాల కంటే ఎక్కవ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్న వారికి తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలు వారి ఇంటి క్రమబద్దీకరణ కోసం తహసీల్దార్, గ్రామ సచివాలయాల్లో తమ దరఖాస్తులు దాఖలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈనెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ సదవకాశాన్ని పేదలందరు వినియోగించుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హత కల్గిన పేదల స్థలాలను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో 2,71లక్షల మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించామన్నారు. ఇందుకోసం 4,497 ఎకరాలు భూమి అవసరమని, ప్రస్తుతం 2,132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ప్రవేటు భూమిని త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల స్తలాల పంపిణీకి సంబందించి ఈనెల 16వ తేదీన అన్ని మండలాల్లోను సోషల్ అడిట్ నిర్వహించి లబి్ధదారుల జాబితాపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, సబ్–కలెక్టర్లు స్వప్నిల్ దినకర్, హెచ్.ఎం. ధ్యానచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఆర్డీఓలు ఖాజావలి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
పటేల్ కృషి మరువలేనిది: డీజీపీ సవాంగ్
సాక్షి, విజయవాడ: జాతీయ సమైఖ్యతా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీసీ ద్వారక తిరుమలరావుతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ హజరయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సందర్బంగా పోలీసుల చేత దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయండంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ కృషి మరువలేనిదని అన్నారు. పోలీసులు కుడా వివిధ విభాగాల్లో కలిసి పనిచేయడం వల్ల మంచి పురోగతి సాధిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేస్తే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా విద్యార్ధి దశ నుంచే ఐక్యతా భావం పెంపోందించాలని ఆయన సూచించారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి సీఏఆర్ గ్రౌండ్ వరకు సాగనున్న సమైక్యత పరుగుకు డీజీపీ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సమైక్యత పరుగులో పోలీసులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇక సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ‘ఏక్తా దినోత్సవం’ లో భాగంగా ‘రన్ ఫర్ యూనిట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి కోనేరు సెంటరు వరకు ఈ ఐక్యత పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. -
‘ఏపీ చరిత్రలో ఇదొక విశిష్టమైన రోజు’
సాక్షి, విజయవాడ : పామర్రులోని అసిస్సీ జెడ్పీ పాఠశాలలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ జిల్లాస్థాయి కార్యక్రమం మంగళవారం జరిగింది. మంత్రి పేర్నినాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీ, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకుంటూ వారి కళ్ళలో ఆనందాన్ని నింపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ రోజు విశిష్టమైందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక్క పంటకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం తరువాత సీఎం జగన్ పాలనలొనే డ్యామ్‌లు నిండు కుండల్లా మారాయని గుర్తు చేశారు. రెండో పంటకు సైతం నీరు ఇస్తామని తమ పార్టీ నాయకులు గర్వంగా చెప్పగలుగుతున్నారని బాలశౌరి వెల్లడించారు. సమస్యలు పరిష్కరిస్తాం.. పామర్రులో జిల్లా స్థాయి కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పామర్రు నియోజకవర్గంలో 30,707 వేల కుటుంబాలకు రూ.41 కోట్లు మంజూరు చేశామని , ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 చేరుతుందని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు లబ్ది పొందనున్నారని వెల్లడించారు. నవంబర్ 15 వరకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆధార్ సీడింగ్, వెబ్ లాండింగ్లో రైతుల పేర్లు సాధికారిక సర్వేలో నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని, గ్రామ సచివాలయ వలంటీర్ల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అక్కడ నుంచి ఇక్కడొచ్చి పడ్డారు.. టీడీపీ నాయకులు సీఎం జగన్మోహన్రెడ్డి పాలన చూసి ఓర్వలేక.. బరద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ‘పులివెందుల వరకు తరిమికొడతామని టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. టీడీపీ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమికొడితే ఇక్కడకొచ్చి పడ్డారు’ అని ఎద్దేవా చేశారు. -
‘జగన్ లాంటి సీఎం ఉంటే కళ్లజోడు వచ్చేది కాదు’
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం గిలకలదిండి మున్సిపల్ స్కూల్లో మంత్రి పేర్నినాని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. తన చినన్నప్పుడే వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉండి వుంటే ఇప్పుడు తనకు కళ్ళజోడు లేకపోయేదని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వ్యాఖ్యానించారు. అలాగే పామర్రు జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 'వైఎస్సార్ కంటివెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యక్రమంలో కాకర్ల వెంకటేశ్వరరావు, ఆరుమళ్ళ శ్రీనాధరెడ్డి, దేవిరెడ్డి బాలవెంటేశ్వరరెడ్డి, ఆరేపల్లి శ్రీనివాసరావు, కొచ్చెర్ల శ్రీనివాసరావు, పెయ్యేల రాజు, నవుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూలులో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యుడు కొలుసు పార్థసారధి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రారంభించారు. జడ్పీటిసి సభ్యురాలు తాతినేని పద్మావతి, స్థానిక ఎంపీటీసీ సభ్యులు ఛాన్ బాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. మైలవరం మండలం పొందుగల గ్రామం మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన గ్రామ సచివాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యేకు సన్మానం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కూచిపూడిలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ను ఆటో యూనియన్ వర్గాలు ఘనంగా సన్మానించాయి.