సాక్షి, కృష్ణా : కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లోని చిన్నపిల్లల రక్షణ కోసం చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్.. కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలను తరలించేందుకు మూడు వాహనాలు సిద్ధం చేశామని, కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1098, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు కోలుకునే వరకు పిల్లలను సంరక్షిస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment