ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్ | AP CS Checks The Implementation Of Govt Schemes | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్

Published Sat, Nov 16 2019 4:54 PM | Last Updated on Sat, Nov 16 2019 5:46 PM

AP CS Checks The Implementation Of Govt Schemes - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరిశీలించారు. విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సచివాలయంలో ప్రభుత్వ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రభుత్వ పధకాలు, నవరత్నాల అమలు తీరును  సీఎస్‌ నీలం సాహ్నికు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వివరించారు. ప్లాస్టిక్ నిషేధంపై చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు, పెన్షన్లు అమలు తీరును ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని అడిగి తెలుసుకున్నారు. అలానే రైతు భరోసా పథకం అర్హులందరికీ చేరిందా అని సీఎస్ రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్‌, రూరల్‌ ఎమ్మార్వో వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement