gudavalli
-
ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు
సాక్షి, విజయవాడ: గూడవల్లి కోవిడ్ కేర్ సెంటర్‌ను స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మైల్డ్ సింటమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నామన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో, 5 వేల మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఫుడ్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని కృష్ణబాబు తెలిపారు. చదవండి: ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ కొడుకు ప్రాణం పోయింది.. తండ్రి గుండె ఆగింది.. -
ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించిన సీఎస్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరిశీలించారు. విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సచివాలయంలో ప్రభుత్వ శాఖల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రభుత్వ పధకాలు, నవరత్నాల అమలు తీరును సీఎస్ నీలం సాహ్నికు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వివరించారు. ప్లాస్టిక్ నిషేధంపై చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు, పెన్షన్లు అమలు తీరును ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్ని అడిగి తెలుసుకున్నారు. అలానే రైతు భరోసా పథకం అర్హులందరికీ చేరిందా అని సీఎస్ రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యాన్‌చంద్, రూరల్ ఎమ్మార్వో వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి
సాక్షి, గన్నవరం(కృష్ణా జిల్లా): ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం, రంగు ఇలాంటి బేధాలేవి లేవని నిరూపించారు ఓ జంట. అమెరికాకు చెందిన అబ్బాయి, ఆంధ్రాకు చెందిన అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ ఖండాతరాలను దాటుకుని ఇద్దరిని ఒక్కరిని చేసింది. వివరాల్లోకి వెళితే విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారిల దంపతుల కుమార్తె నాగసంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్డీ చదివింది. ప్రస్తుతం ఒరెగాన్లోని ఇంటెల్ కార్పొరేషన్లో టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆడం బ్యాంగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను అర్ధం చేసుకున్న ఇరువైపుల తల్లిదండ్రులు పెద్ద మనసుతో వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక ఏబీ కన్వెన్షన్ సెంటర్లో వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది. ఈ వివాహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయక్త యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. చూడముచ్చటగా ఉన్న జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు పోటీపడ్డారు. -
'శ్రీచైతన్య'లో ఉద్యోగిని ఆత్మహత్య
విజయవాడ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఉద్యోగిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.