పెళ్లిపీటలపై ఆడం బ్యాంగ్, నాగసంధ్య
సాక్షి, గన్నవరం(కృష్ణా జిల్లా): ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం, రంగు ఇలాంటి బేధాలేవి లేవని నిరూపించారు ఓ జంట. అమెరికాకు చెందిన అబ్బాయి, ఆంధ్రాకు చెందిన అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ ఖండాతరాలను దాటుకుని ఇద్దరిని ఒక్కరిని చేసింది. వివరాల్లోకి వెళితే విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారిల దంపతుల కుమార్తె నాగసంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదివింది. ప్రస్తుతం ఒరెగాన్‌లోని ఇంటెల్ కార్పొరేషన్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆడం బ్యాంగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
వీరి ప్రేమను అర్ధం చేసుకున్న ఇరువైపుల తల్లిదండ్రులు పెద్ద మనసుతో వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక ఏబీ కన్వెన్షన్ సెంటర్లో వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది. ఈ వివాహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయక్త యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. చూడముచ్చటగా ఉన్న జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు పోటీపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment