Telugu Girl
-
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్‌పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్‌లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్‌లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్‌ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్‌ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్‌లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
నేషనల్ అమెరికా మిస్ హన్సిక
బంజారాహిల్స్: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో నగరానికి చెందిన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి సత్తాచాటి విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. హన్సిక రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యా్రక్టెస్ పోటీల్లో సైతం విజేతగా నిలిచారు. అదేవిధంగా అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ నాలుగుసార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూ.మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తాచాటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. -
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
స్కాట్లాండ్ యువకుడితో తెలుగమ్మాయి ప్రేమ
రాజంపేట: స్కాట్లాండ్ దేశానికి చెందిన మాథ్యూస్, అన్నమయ్య జిల్లా కారంపల్లెకు చెందిన నీమకల్లు సోనియారెడ్డి ప్రేమించుకున్నారు. త్వరలో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వివరాల్లోకి వెళితే...కారంపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమార్తె నీమకల్లు కౌసల్యరెడ్డి యూకేలో స్థిరపడ్డారు. ఆమె కుమార్తె సోనియారెడ్డి యూకేలోనే మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ జనరల్ ప్రాక్టీషనర్ విద్య పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో మాథ్యూస్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆయన కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార రంగంలో ఉన్నారు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించారు. ఈ నెల 7న సంప్రదాయబద్ధంగా హైదరాబాద్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు. వివాహానికి ఇరుకుటుంబాలు కారంపల్లికి చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విదేశీయులతో స్థానికులు ముచ్చటించడం ఆకట్టుకుంది. తెలుగువారి సంప్రదాయాలు తమకు నచ్చాయని వారు చెబుతున్నారు. -
ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం
టెక్సాస్ అలెన్ ప్రీమియం ఔట్లెట్ మాల్లో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య(26) మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఆమె కుటుంబానికి సహకరిస్తున్నామని అమెరికాలోని ఇండియన్ కాన్సులేట్ తెలియజేసింది. శనివారం టెక్సాస్ మాల్ కాల్పుల్లో మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐశ్వర్య మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చడానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి తమ వంతు సాయం అందిస్తున్నామని హూస్టన్‌లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అసీమ్ మహాజన్ చెప్పారు. కాల్పుల్లో ఐశ్వర్య మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య పార్థివ దేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతినిధి అశోక్ కోళ్ల కృషి చేస్తున్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
ఫిలిప్పీన్స్ లో తెలుగు యువతి తిప్పలు
-
Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి..
-
పులకించిన కిలిమంజారో
కిలిమంజారో పర్వతం. ఓ దశాబ్దంగా వార్తల్లో తరచూ కనిపిస్తున్న ఈ పర్వతం మీదనున్న ఉహురు శిఖరం ఎత్తు 5895 మీటర్లు. ఆఫ్రికా ఖండంలో ఎల్తైన పర్వతం ఇది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఎల్తైన ఏడు పర్వతశిఖరాల్లో నాలుగవది. ఈ శిఖరం మీద అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు మన భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంటనియర్ పదమూడేళ్ల పులకిత హస్వి మన తెలుగమ్మాయి. ఆఫ్రికా ఖండం, టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో అధిరోహించాలనే కోరిక ఇంత చిన్న వయసులో ఎందుకు కలిగి ఉంటుంది... అనే సందేహం రావడం సహజమే. ఇది హస్వికి కోవిడ్ కాలంలో రేకెత్తిన ఆలోచన. లాక్డౌన్ కారణంగా స్కూళ్లు లేవు. పులకిత హస్వి ఇష్టంగా నేర్చుకుంటున్న బ్యాడ్మింటన్‌ను కూడా విరామం తప్పలేదు. ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలు చూడడమే పనిగా ఉన్న సమయం అది. ఆ చూడడంలో ఎవరెస్ట్ అనే ఇంగ్లిష్ సినిమాను చూడడం కాకతాళీయమే. కానీ ఆ చూడడం ఈ అమ్మాయి అభిరుచిని, గమనాన్ని మార్చేసింది. ఏకంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిపించింది. ఆ తర్వాత కిలిమంజారో శిఖరానికి చేర్చింది. ఇదంతా ఈ ఏడాదిలో జరిగిన పురోగతి మాత్రమే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా చూసింది, ఎవరెస్ట్ అధిరోహిస్తానని అమ్మానాన్నలను అడిగింది. ఏప్రిల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రోజు రాత్రి అమ్మానాన్నలతో ‘సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేస్తాన’ని తన తర్వాతి లక్ష్యాన్ని బయటపెట్టింది పులకిత హస్వి. అలాగే కిలిమంజారో పర్వతారోహణ పూర్వాపరాలను సాక్షితో పంచుకుంది. తొలి ఘట్టం ఎవరెస్ట్ బేస్ క్యాంపు ‘‘మా నాన్నది మంచిర్యాల, అమ్మ వాళ్ల ఊరు కర్నూలు జిల్లా నంద్యాల. ఇద్దరూ ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నా చిన్నప్పుడు వెస్ట్ మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కి అవకాశం బాగా ఉండేది. అన్నయ్య, నేను ఇద్దరం ఎప్పుడూ ఏదో ఒక కోచింగ్ లో ఉండేవాళ్లం. కీబోర్డ్, గిటార్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆర్కిస్టిక్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి నేషనల్స్‌కు వెళ్లాను. నాకు బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. సీరియెస్‌గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. కానీ కోవిడ్‌తో ప్రాక్టీస్ ఆగిపోయింది. మౌంటనియరింగ్ వైపు దృష్టి మళ్లింది. ఎవరెస్ట్ అధిరోహించడానికి ముందు బేస్‌క్యాంప్ ట్రెక్ పూర్తి చేసి ఉండాలి. అందుకే తొలి ప్రయత్నంగా బేస్ క్యాంపు ట్రెక్ పూర్తి చేశాను. 2024–2025 కి సెవెన్ సమ్మిట్స్ పూర్తి చేయాలనేది నా టార్గెట్. ఆ తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ వైపు వెళ్లాలనేది ఇప్పటి నా ఆలోచన. సెవెన్ సమ్మిట్స్ పూర్తయిన తర్వాత అప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను’’ అంటూ భుజాలు ఎగరేస్తూ నవ్వింది పులకిత హస్వి. గడ్డకట్టిన నీళ్లు ‘కిలిమంజారో సమ్మిట్ పూర్తి చేయడం చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇక్కడితో సంతృప్తి చెందితే మిగిలిన సమ్మిట్స్ పూర్తి చేయలేనని కూడా ఆ క్షణంలోనే గుర్తు వచ్చింది’ అంటూ కిలిమంజారో అధిరోహణ అనుభవాలను చెప్పింది పులకిత హస్వి. ‘‘సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఎనిమిది వరకు సాగిన ట్రిప్‌లో యాక్చువల్ పర్వతారోహణ మొత్తం ఐదు రోజులే. నాలుగో రోజు శిఖరాన్ని చేరతాం. ఐదవ రోజు కిందకు దిగుతాం. శిఖరాన్ని చేరే లోపు నాలుగు రోజుల్లో ఏడెనిమిది రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాం. మంచు దట్టంగా పొగలా కమ్మేసి ఉంటుంది. ముందు ఏముందనేది స్పష్టంగా కనిపించదు. నాలుగో రోజు ఆహారం కూడా ఉండదు. రెండు చాక్లెట్లు, ప్రొటీన్ బార్ మాత్రమే ఆహారం. అంతకు మించి ఏమీ తినాలనిపించదు కూడా. మైనస్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మాతో తీసుకువెళ్లిన బాటిల్లోని నార్మల్ వాటర్ గడ్డకట్టిపోయాయి. ఫ్లాస్క్‌లో తీసుకువెళ్లిన వేడినీటిని కలుపుకుని తాగాను. స్నోఫాల్ని దగ్గరగా చూడగలిగాను. కిలిమంజారో పర్వతం మీద మంచు కురుస్తుంటే పక్కనే మరో పర్వతం మీద సూర్యుడి కిరణాలు కాంతులీనుతున్నాయి. ప్రకృతి చేసే ఇలాంటి అద్భుతమైన విన్యాసాలను బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్వతారోహణ వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. స్పాట్ డెసిషన్ తీసుకోవడం అనేది ప్రాక్టికల్‌గా తెలిసి వచ్చింది. ఐదవరోజు పర్వతాన్ని దిగేటప్పుడు చాలాసార్లు పల్టీలు కొట్టుకుంటూ పడిపోయాను. ‘అయ్యో పడిపోయావా’ అంటూ లేవదీయడానికి ఎవరూ ఉండరు. మనకు మనమే సంభాళించుకుని లేచి ప్రయాణాన్ని కొనసాగించాలి. అలాగే ఒకటి– రెండు సార్లు పడిన తర్వాత ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత పడకుండా సాగిన ప్రయాణమే పెద్ద విజయంగా అనిపిస్తుంది. కిలిమంజారో ఎక్స్‌పెడిషన్‌కు వెళ్లడానికి ముందు మూడు నెలలపాటు ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాను. ఫిట్నెస్ క్లాసులు కూడా డిజిటల్ మీడియా ద్వారానే. మా కోచ్ వాట్సాప్‌లో ఏరోజుకారోజు టాస్క్ ఇస్తారు. హైట్స్‌కి వెళ్లకుండా ప్రాక్టీస్ మొత్తం నేల మీదనే కావడంతో శిఖరం మీదకు వెళ్లినప్పుడు వామిటింగ్ ఫీలింగ్ కలిగింది. అంతకు మించి ఎక్కడా ఇబ్బంది పడలేదు. మా టీమ్‌లో మొత్తం ఏడుగురున్నారు. నేనే చిన్నదాన్ని. అరవై ఏళ్ల మౌంటనియర్ కూడా ఉన్నారు. మాలో శిఖరాన్ని చేరింది నలుగురే. కిలిమంజారో పర్వతారోహణ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందనేది నాకే స్పష్టంగా తెలుస్తోంది. ఏడు సమ్మిట్స్‌ని పూర్తి చేసి తీరుతాను’’ అన్నది హస్వి. సెవెన్ సమ్మిట్స్ ఎవరెస్ట్ (8,849 మీటర్లు)– ఆసియా, అకాంగువా (6,961 మీటర్లు) – సౌత్ అమెరికా, దేనాలి (6,194 మీటర్లు)– నార్త్ అమెరకా, కిలిమంజారో (5,895 మీటర్లు)– ఆఫ్రికా, ఎల్బ్రస్ (5,642 మీటర్లు)– యూరప్, విన్సాన్ మాసిఫ్ (4,892 మీటర్లు)– అంటార్కిటికా, కోస్కియుజ్కో (2,228 మీటర్లు) – ఆస్ట్రేలియా. పులకిత సాధించిన పతకాలు; కిలిమంజారో నేషనల్ పార్క్ వద్ద పులకిత -
అంతరిక్షంలోకి పయనమైన తొలి తెలుగు మహిళ
-
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
హూస్టన్: వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్ చేశారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్ చేసింది. శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ అంతరిక్ష యాత్రను విజయవంతం చేసుకున్న శిరీషకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం రాష్ట్రానికి గర్వించదగ్గ క్షణమని సీఎం జగన్ పేర్కొన్నారు. Hon'ble CM Sri @ysjagan conveyed his best wishes to Guntur born aeronautical engineer Bandla Sirisha, flying on space flight Virgin Gailactic Unity 22. The CM said that it is a proud moment for the state and wished her good luck for the success of space mission. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 11, 2021 -
ఇతడిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అనుకున్నా..
ఇది ఐపీఎల్ సీజన్. ఓ అమ్మాయి కామెంటరీ ఇస్తోంది. ‘అరే! తెలుగమ్మాయి. చక్కగా మాట్లాడుతోంది. బాడీ లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా ఉంది. ఏ ముంబయి అమ్మాయో అనుకునేటట్లు ఉంది’ అని టీవీక్షకుల కళ్లను ఆకర్షిస్తోన్న ఆ అమ్మాయి పేరు వింధ్య విశాఖ మేడపాటి. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా మగవాళ్లను మాత్రమే చూసిన తెలుగు తెరకు పరిచయమైన తొలి తెలుగమ్మాయి. వింధ్య ఇప్పుడు ముంబయిలో ఉన్న మాట నిజమే. కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది ఘట్కేసర్, హైస్కూల్ నుంచి సికింద్రాబాద్‌లోని అమ్మమ్మగారింట్లో పెరిగింది. నాన్న గుర్రపు స్వారీ చేసేవాడు, జీవితంలో రాజీ పడాల్సిన అవసరం లేని జీవితం ఆయనది. అమ్మ మాత్రం తనను క్రీడాకారిణి కానివ్వకుండా ఆపిన సంప్రదాయపు ఇనుప కచ్చడాన్ని తలచుకుంటూ బాధపడుతుండేది. ‘ఆడపిల్లలు ప్యాంటులేసుకుని ఆటలాడడం ఏంటి’ అని తాతయ్య మొండిపట్టు పట్టకుండా ఉండి ఉంటే మా ఇంట్లో గడచిన తరంలోనే ఓ మహిళావిజయం నమోదై ఉండేది’ అంటోంది వింధ్య. ‘ఆడపిల్ల’ ఈ ఆటలే ఆడాలి, ఈ దుస్తులే ధరించాలి... అని సూత్రీకరించిన ‘సంప్రదాయం’ మా అమ్మకు ఒక జీవితకాలపు అసంతృప్తిని మిగిల్చింది. ఆమె కల నెరవేరలేదు. ‘‘నేను కోరుకున్నట్లుగా నేను ఏదీ సాధించలేకపోయాను. నువ్వు అలా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఈ సమాజం నిర్దేశించిన అడ్డంకులు నిన్ను అడ్డుకోకుండా నేను అడ్డుపడతాను. నువ్వు కావాలనుకున్న రంగంలో నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధించు’’ అని చెప్పేది అమ్మ. ఆశ్చర్యంగా మా అమ్మమ్మ, నాన్నమ్మ కూడా ఎప్పుడూ అమ్మ అభిప్రాయంతో ఏకీభవించేవారు. నేను స్కూల్లో కబడీ ఆడేటప్పుడు ఇంట్లో వాళ్లు అడ్డుచెప్పలేదు. నాలుగేళ్ల కిందట ప్రో కబడ్డీ ప్రజెంటర్‌గా అవకాశం వచ్చినప్పుడు కూడా ఇంట్లో అందరూ సంతోషించారు. ఆ ప్రజెంటేషనే నాకు ఐపీఎల్లో ప్రజెంటర్ అవకాశాన్ని తెచ్చింది. ఇంగ్లిష్‌లో మందిరాబేడీ, మయంతి లాంగర్ ఉన్నారు. కానీ తెలుగులో లేరు. తెలుగులో తొలి ఉమన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలనుకోవడం లేదు. బెస్ట్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్. నా కెరీర్ విషయంలో అమ్మ ఒకే ఒక్క షరతు పెట్టింది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు న్యూస్ ప్రజెంటర్‌గా, మోడల్‌గా అవకాశాలు ఎక్కువగా వస్తున్నప్పుడు ‘చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పనిసరిగా పీజీ చేయాల్సిందే’నని చెప్పింది. అమ్మ చెప్పినట్లే ఎం.ఏ ఇంగ్లీష్ చేశాను. తోడుగా అమ్మ వచ్చేది స్టార్ స్పోర్ట్స్‌లో ఉద్యోగం వచ్చిన తర్వాత ముంబయిలో ఉద్యోగం చేయడానికి భయపడలేదు. కానీ హైదరాబాద్ వదలడం బాధనిపించింది. నా లైఫ్‌లో తొలిసారి హోమ్‌సిక్ అయింది ముంబయిలోనే. ఆ సంగతి తెలిసి అమ్మ మరునాడే ముంబయికి వచ్చింది. నా పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువగా అమ్మనే తోడు తీసుకెళ్లేదాన్ని. మా వాళ్లు ఎవరూ లేకుండా ముంబయిలో ఇన్ని రోజులు ఉండడం ఇదే మొదటిసారి. ఈ దఫా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముంబయిలోనే ఉన్నాను. రెండు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నాం. వర్క్ నుంచి నేరుగా మేము బస చేసిన హోటల్‌కి వచ్చేయాలి. క్వారంటైన్లో ఉంటూ పని చేయడమన్నమాట. హైదరాబాద్‌కి వచ్చేది ఐపీఎల్ పూర్తయిన తర్వాతే’’ అంటూ నవ్వారు వింధ్య విశాఖ. అవకాశం గొప్పది మా హజ్బెండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. చాలా ఏళ్లుగా తెలిసిన కుటుంబమే. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. అర్ధరాత్రయినా సరే మ్యాచ్ చూడాల్సిందే. టెస్ట్‌మ్యాచ్‌లు కూడా పూర్తిగా చూస్తారు. మరీ ఇంత పిచ్చేంటి? ఇతడిని పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా అనుకున్నాను. అయితే కబడ్డీ ప్రజెంటర్ నుంచి క్రికెట్ వైపు రావడానికి ప్రోత్సాహం, ట్రైనింగ్ ఇచ్చింది కూడా ఆయనే. ఈ తరం యువతులు తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... వినూత్నమైన కెరీర్‌ని ఎంచుకునేటప్పుడు పెళ్లయితే అవకాశాలు ఉండవేమోనని చాలామంది భయపడుతుంటారు. అది కేవలం అపోహ మాత్రమేనని చెప్పడానికి నిదర్శనం నేనే. అలాగే నేను తెలుసుకున్న సత్యం మరొకటుంది. టాలెంట్ చాలామందిలో ఉంటుంది. అవకాశాలు కొందరికే వస్తాయి. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. – వింధ్య విశాఖ మేడపాటి, స్పోర్ట్స్ ప్రజెంటర్ తల్లి మమతా చక్రవర్తితో వింధ్య – వాకా మంజులారెడ్డి -
కోవిడ్-19 : తెలుగమ్మాయి నూతన ఆవిష్కరణ
వాషింగ్టన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఉపకరించే ఆవిష్కరణపై పనిచేసిన 14 ఏళ్ల టెక్సాస్ (ఫ్రిస్కో) బాలిక జాతీయ అవార్డును గెలుపొందారు. తెలుగమ్మాయి అనిక చేబ్రోలు ఇండిపెండెన్స్ హైస్కూల్లో చదువుతూ ఇటీవల 3ఎం యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌లోనూ గెలుపొంది 25,000 డాలర్లను సొంతం చేసుకున్నారు. "తాను అభివృద్ధి చేసిన ఈ అణువు సార్స్ కోవిడ్-2 వైరస్‌పై ఒక నిర్దిష్ట ప్రోటీన్‌ను నిలువరిస్తుంద"ని తన ఆవిష్కరణపై అనిక చేబ్రోలు చెప్పుకొచ్చారు. ఈ ప్రొటీన్‌ను బంధించడం ద్వారా ఇది వైరస్ ప్రోటీన్ పనితీరును ఆపివేస్తుందని, దీన్ని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్‌తో ప్రారంభించానని బాలిక వివరించారు. కొద్ది నెలల కిందట ఈ పోటీలో ఆమె పొల్గొన్న సమయంలో ఆమె మిడిల్ స్కూల్లో ఉన్నారు. తొలుత స్వైన్ ఫ్లూపై తన ప్రాజెక్టును రూపొందించుకోగా ఆపై కోవిడ్-19పై పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వైరస్ బారినపడటంతో తన ప్రాజెక్టు విస్తృతి దృష్ట్యా కరోనా వైరస్‌పై పరిశోధనను ఎంపిక చేసుకున్నానని అనిక చెప్పారు. తాను స్కూల్ విద్యను ముగించిన తర్వాత వైద్య పరిశోధకురాలిగా కెరీర్‌ను ఎంచుకుంటానని తెలిపారు. కెమిస్ర్టీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తాత ప్రోత్సాహంతో తనకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని తెలిపారు. ఇక అనిక చేబ్రోలు తండ్రి వైద్య వృత్తిలో ఉన్నారు. చదవండి : డొనాల్డ్ ట్రంప్ కుమారుడికి కరోనా.. -
తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేళ్ల తెలుగు బాలిక శ్రావ్య శ్రావ్య అన్నపరెడ్డిని సత్కరించారు. గర్ల్స్ స్కౌట్ మెంబర్‌గా ఉన్న శ్రావ్య.. యూఎస్‌లో కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ, వారిలో ఉత్సహం నింపేలా వ్యక్తిగత కార్డులను పంపించారు. దీనిని గుర్తించిన డోనాల్డ్ ట్రంప్.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో శ్రావ్యను ప్రశంసించారు. ఆమెతో పాటుగా లైలా ఖాన్, లారెన్ మాట్నీ అనే మరో ఇద్దరు బాలికలను కూడా ట్రంప్ సత్కరించారు. మేరీల్యాండ్ ఎల్క్‌రిడ్జ్‌లోని ట్రూప్ 744 కు చెందిన ఈ ముగ్గురు బాలికలు 100 బాక్స్‌ల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి విరాళంగా ఇచ్చారు. శ్రావ్య విషయానికి వస్తే.. హనోవర్‌లో నివాసం ఉంటున్న ఆమె ప్రస్తుతం నాలుగో గ్రేడ్ చదువుతున్నారు. తనకు దక్కిన గౌరవంపై శ్రావ్య స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు నన్ను భారతీయ పద్దతి ప్రకారం పెంచారు. నేను వసుధైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతాను’ అని చెప్పారు.(చదవండి : ట్రంప్‌పై ఒబామా సంచలన వ్యాఖ్యలు) శ్రావ్య తల్లిదండ్రుల విషయానికి వస్తే.. ఆమె తండ్రి విజయ్‌రెడ్డి అన్నపరెడ్డి ఫార్మాసిస్ట్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం గుంటూరు టౌన్. శ్రావ్య తల్లి సీత కల్లం విశాఖపట్నం ఆంధ్ర మెడికల్‌లో మెడికల్ డిగ్రీ పూర్తిచేశారు. ఆమెది బాపట్ల సమీపంలోని నరసయ్య పాలెం స్వస్థలం. ట్రంప్ చేతుల మీదుగా శ్రావ్య సత్కారం అందుకోవడంపై విజయ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రావ్యకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. -
త్వరలో పెళ్లి.. ఇంతలో చైనాకు వెళ్లి
బండిఆత్మకూరు/కోవెలకుంట్ల/మహానంది: కర్నూలు జిల్లాకు చెందిన అన్నెం జ్యోతి చైనాలోని వుహాన్‌లో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పాటు వచ్చే నెలలో ఆమె వివాహం ఉండడంతో వారి ఆందోళన రెట్టింపవుతోంది. కోవెలకుంట్ల మండలం బిజినవేములకు చెందిన జ్యోతి తల్లి ప్రమీల, తండ్రి అన్నెం మహేశ్వరరెడ్డి. తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. బీటెక్ పూర్తిచేసిన జ్యోతి టీసీఎల్‌లో ఉద్యోగం సాధించి శిక్షణ నిమిత్తం గత ఆగస్టు 23న 58 మంది కంపెనీ ఉద్యోగులతో కలిసి వుహాన్‌కు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభించడంతో.. అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జ్యోతి, ఆమె సహచరులు వుహాన్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. జ్యోతితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడికి జ్వరం కొంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా వారిని ఇండియాకు పంపేందుకు నిరాకరించారు. తాను పడుతున్న అవస్థలను జ్యోతి వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఇప్పటికే జ్యోతి కుటుంబ సభ్యులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డిలను కలిసి సమస్యను వివరించారు. వారు ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదివారం ప్రమీలకు ఫోన్ చేసి.. త్వరలోనే దేశానికి వస్తుందని ధైర్యం చెప్పారు. జ్యోతికి మహానంది మండలం తమడపల్లెకు చెందిన అమర్నాథరెడ్డితో ఇటీవల వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం. జ్యోతిని త్వరగా దేశానికి రప్పించాలని ప్రమీల, అమర్నాథరెడ్డి మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: కరోనా డేంజర్ బెల్స్) -
భివండీలో తెలుగు యువతి ఆత్మహత్య
సాక్షి, భివండీ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తెలుగు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని భివండీలో జరిగింది. వివరాలు.. కామత్‌ఘర్‌కు చెందిన స్వాతి వేముల (21), బాలాజి నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచెర్ల (25) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని స్వాతి చెప్పడంతో సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదుచేసి సాయిచంద్రని అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి
సాక్షి, గన్నవరం(కృష్ణా జిల్లా): ప్రేమకు కులం, మతం, భాష, ప్రాంతం, రంగు ఇలాంటి బేధాలేవి లేవని నిరూపించారు ఓ జంట. అమెరికాకు చెందిన అబ్బాయి, ఆంధ్రాకు చెందిన అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ ఖండాతరాలను దాటుకుని ఇద్దరిని ఒక్కరిని చేసింది. వివరాల్లోకి వెళితే విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతికుమారిల దంపతుల కుమార్తె నాగసంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్డీ చదివింది. ప్రస్తుతం ఒరెగాన్లోని ఇంటెల్ కార్పొరేషన్లో టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఆడం బ్యాంగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను అర్ధం చేసుకున్న ఇరువైపుల తల్లిదండ్రులు పెద్ద మనసుతో వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక ఏబీ కన్వెన్షన్ సెంటర్లో వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ఆ జంట ఒక్కటయ్యింది. ఈ వివాహానికి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయక్త యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన జంటను ఆశీర్వదించారు. చూడముచ్చటగా ఉన్న జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు పోటీపడ్డారు. -
తమిళనాడులో దారుణం: తెలుగు టెకీపై అత్యాచారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగురోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగమ్మాయి లావణ్య చెన్నైలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణానికి చెందిన లావణ్య (26) చెన్నై నావలూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈనెల 13న తెల్లవారుజామున విధులు ముగించుకుని నుంగంపాళయంలోని సోదరి ఇంటికి బైక్‌పై బయలుదేరారు. అరసన్‌కళని రోడ్డులో వెళుతుండగా దారిదోపిడీ ముఠా ఆమె తలపై ఇనుపరాడ్‌తో మోదడంతో కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె తల రోడ్డుపై ఉన్న ఒక బండరాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి స్పృహకోల్పోయారు. దుండగలు ఆమె మెడలోని నగలు, డబ్బు, సెల్‌ఫోన్, బైక్ దోచుకెళ్లారు. స్పృహలేని స్థితిలో పడిఉన్న లావణ్యను కొందరు స్థానికులు గుర్తించి పల్లికరణై పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ప్రయివేటు ఆస్పత్రి చేర్పించి విచారణ చేపట్టారు. ఈనెల 14న సెంమ్మంజేరీలోని ఒక మద్యం దుకాణం ముందు లావణ్య బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెమ్మంజేరీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి మోపెడ్ అక్కడే వదిలివెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించగా ప్రధాన నిందితుడు సూర్య సహా నలుగురు పట్టుబడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య బుధవారం సాయంత్రం స్పృహలోకి వచ్చింది. అయితే ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీస్ సహాయ కమిషనర్ ముత్తుస్వామి గురువారం సాయంత్రం మరోసారి లావణ్యను కలుసుకోగా తనను కాపాడినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా తన రెండుచేతులూ జోడించి పోలీసులకు నమస్కరించింది. సంఘటన జరిగిన రోజున ఐదు కిలోమీటర్లు తనను వెంబడించి దాడిచేసిన నిందితులను గుర్తుపట్టే ఆనవాళ్లను పోలీసులకు వివరించినట్లు సమాచారం. తలపై శస్త్రచికిత్స చేసినందున ఎక్కువసేపు మాట్లాడరాదని వైద్యులు అభ్యంతరం చెప్పపడంతో పోలీసుల తిరిగి వెళ్లిపోయారని సమాచారం. -
చెన్నైలో దారుణం: తెలుగు టెకీపై అత్యాచారం
-
అమెరికాలో ప్రమాదం.. గాయపడ్డ తెలుగు విద్యార్థిని
మధిర(ఖమ్మం జిల్లా): మధిర పట్టణం ఆజాద్ రోడ్డులో నివాసముంటున్న కొల్లూరు సురేష్, సుమతీ దంపతుల కుమార్తె శ్రీలేఖ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంఎస్ చదివేందుకు శ్రీలేఖ 3 నెలల క్రితం అక్కడకు వెళ్ళింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శస్త్ర చికిత్స అనంతరం ఐసీయూలో ఉంచారని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. గాయపడిన యువతికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఒక్కగానొక్క కూతురు దేశం కానీ దేశంలో ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
తెలంగాణ అమ్మాయికి అరుదైన గౌరవం
ముషీరాబాద్: కృషి, పట్టుదల, లక్ష్యం ఉంటే జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎస్.సృజన నిరూపించింది. ప్రపంచంలోని పది ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి నేత్ర వైద్యంలో డాక్టరేట్ పట్టా పొందిన సృజన ప్రస్తుతం కెరటోకోనస్పై డాక్టరేట్ అనంతర విశిష్ట పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపక దంపతులైన ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ భారతిల కుమార్తె. ఇప్పటికే అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందిన సృజన నిర్విరామ సామాజిక సేవ-నేత్ర చైతన్య కృషి’కి గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని నేత్ర పరిశోధనా కేంద్రం సెరా (సెంటర్ ఫర్ ఐ రీసెర్చ్ ఆస్ట్రేలియా) వారు డాక్టర్ సృజనకు ప్రతిష్టాత్మకమైన సెరా-2016 అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. సెరా ద్విదశాబ్థి ఉత్సవాల సందర్భంగా గురువారం జరిగిన వేడుక వేదికపై ఆమెకు ఈ అరుదైన అవార్డును బహూకరించారు. -
స్వాతికి అశ్రు నివాళి
యూనికీ క్యాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పుణే సిటీ: మురుడ్ తీరం వద్ద సముద్రంలో మునిగి వృతిచెందిన తెలుగమ్మాయి స్వాతి ఆత్మకు శాంతి చేకూరాలని యూనికీ క్లాసెక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎల్లో బ్లోసం సొసైటీ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన ర్యాలీ రామ్‌నగర్ వరకు సాగింది. దాదాపు 300 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతి తల్లి హైమావతి, యూనికీ క్లాసెస్ వ్యవస్థాపకుడు మన్సూర్ అలీ ఖాన్, పుణే పట్టణ నేషనల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవి దాండేలి, సాధన సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ చంద్రకాంత్ కవడే, ముండువ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ జేఎస్ పఠాన్, కమతం హరిబాబు, కమతం మల్యాద్రి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన రమణయ్య, హైమావతి దంపతులకు స్వాతి రెండవ సంతానం. 35 ఏళ్లుగా పుణేలో నివాసం ఉంటున్నారు. తండ్రి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఉద్యోగి. గతేడాది అనారోగ్యంతో తండ్రి రమణయ్య మరణించారు. ఇనాందార్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వాతి సాయంత్రం యూనిక్ క్లాసెస్‌లో విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ వచ్చే వేతనంతో అమ్మకు చేదోడువాదోడుగా నిలిచేది. స్వాతి మరణంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. -
విహార యాత్ర మృతుల్లో తెలుగమ్మాయి
సాక్షి ప్రతినిధి, కడప: మహారాష్ట్రలో విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన 14 మంది విద్యార్థుల్లో ఓ తెలుగమ్మాయి ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరుకు చెందిన పండుగాయల వెంకటరమణయ్య(50) కొన్నేళ్ల కిందట తల్లితో కలసి పుణేకు వెళ్లి స్థిరపడ్డాడు. ఏడాది కిందట ఈయన మృతి చెందాడు. ఇతని కుమార్తె రాజ్యలక్ష్మి(21) అలియాస్ స్వాతి పుణేలోని ఓ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం రాయగఢ్‌కు సమీపంలోని అరేబియా సముద్రంలో దిగి అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఈమె కూడా ఉన్నట్లు చెన్నూరులో ఉంటున్న ఆమె తాత పండుగాయల రామకృష్ణయ్య తెలిపారు. సెల్ఫీ మోజు వల్లే.. రాయ్‌గఢ్ జిల్లా మురూడ్-జంజీరా తీరంలో సముద్రంలో మునిగి 14 మంది మరణించడానికి కారణం సెల్ఫీలేనని తెలుస్తోంది. అందరు కలసి సముద్రంలోకి దిగి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటం ఎగసిపడటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారని, ప్రాణాలతో బయటపడిన కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 8 గంటలవరకు హెలీకాప్టర్లు, కోస్టల్‌గార్డు నౌకలతో చేపట్టిన గాలింపు చర్యల్లో 13 మంది మృతదేహాలు లభించగా, మంగళవారం ఉదయం మరో మృతదేహం లభించింది. -
అల్లరి రాక్షసి
మీ..స్రవంతి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్! ఇదిగో ఇలా చిలిపి నవ్వులు రువ్వుతూ.. సోగ కళ్లతో ఓ లుక్కేస్తున్న ఈ అల్లరి పిల్ల కూడా అంతే! గుడివాడలో పుట్టి..నెల్లూరులో చదివినా.. సిటీలో ‘కిర్రాక్’ పుట్టిస్తోంది. వరుస టీవీ షోలతో యాంకర్‌గా అదరగొట్టేస్తున్న ఈ అచ్చ తెలుగు అమ్మాయి పేరు స్రవంతి. మాటల మ్యాజిక్‌తో ఇంటింటికీచేరువైన అమ్మడు ‘సిటీప్లస్’తో కాసేపు ‘ప్లే బ్యాక్’కు వెళ్లింది. అది ఆమె మాటల్లోనే... - శిరిష చల్లపల్లి ఇంట్లో మగ పిల్లలు ఎవరూ లేరు. నేను.. చెల్లి! సో.. మనకు పూర్తి స్వేచ్ఛ. అమ్మాయినే అయినా.. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోని అల్లరి. చిన్నప్పుడైతే డ్రెస్సులు కూడా ప్యాంటులు, షర్ట్లే! హెయిరూ షార్ట్ కటింగే. అమ్మానాన్నలూ నన్ను అబ్బాయిలానే చూసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మా నానమ్మ గొడవ మొదలు పెట్టింది.. మగాడిలా ఆ గెటప్ ఏమిటని! తన పోరు భరించలేక చివరకు ఇదిగో ఇలా లాంగ్ హెయిర్ పెంచాల్సి వచ్చింది. నేను పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. స్కూలింగ్ అంతా నెల్లూరులో. నాన్న ఆస్ట్రాలజర్. అమ్మ హౌస్‌వైఫ్. ఇంటర్లో సిటీకి షిఫ్ట్ అయ్యాం. నాటి నుంచి సనత్‌నగర్‌లోనే మకాం. ఇక్కడి హిందూ జూనియర్ అండ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశా. కాలేజీ దగ్గరే ఇల్లు. ఒక్కోసారి లంచ్ బ్రేక్‌లో ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవారు. అమ్మ అందరికీ వండి పెట్టేది. ప్లేసు మారినా... నా అల్లరి తగ్గలేదు. నన్ను భరించలేక ఇంటి నుంచి కాలేజీ వరకూ అందరూ ‘అల్లరి రాక్షసి’ అని పిలిచేవారు. మా కాలేజీ ఫంక్షన్‌కు ఓసారి ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ వచ్చారు. వివిధ అంశాల్లో నా పెర్ఫార్మెన్స్ నచ్చి.. యాంకరింగ్ చేస్తావా అన్నారు. అలా అనుకోకుండా యాంకర్నయ్యా. తరువాత హాబీగా, ఇప్పుడు ప్రొఫెషన్‌గా మారిపోయింది. నా తొలి ప్రోగ్రామ్ ‘హ్యాపీ డేస్ జాలీ డేస్’. ఇక అక్కడి నుంచి లైవ్ షోస్, సెలబ్రిటీలు, పొలిటికల్ పర్సనాల్టీలతో ఇంటర్వ్యూలు. వాటిల్లో మొదటిది కేసీఆర్ గారితో చేశాను. ‘కిర్రాక్ విత్ క్యాండీ’తో మంచి క్రేజ్ వచ్చింది. మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ‘పిల్లా నువ్వు లేని జీవితం, ఒక లైలా కోసం’ సినిమాల్లో చేశా. టెన్షన్స్ ఎన్ని ఉన్నా కెమెరా ముందుకెళ్లానంటే ప్రపంచాన్నే మర్చిపోతా. -
తెలుగమ్మాయి నిజాయితీ...!
సాక్షి, ముంబై: ఖరీదైన మొబైల్ దొరికిందని తీసుకెళ్లకుండా తిరిగి ఇచ్చిన తెలుగమ్మాయిని పోలీసులు అభినందించారు. వివరాల్లోకెళితే.. మాటుంగాలో నివాసం ఉన్న మానవ హక్కుల సంఘం సభ్యుడు సురేశ్‌కుమార్ కూతురు విశాల గురువారం మాహిలో కాలిబాటన వెళుతుండగా రూ.40 వేలు విలువ చేసే ఫోన్ దొరికింది. అందులో ఉన్న నంబరు ఆధారంగా యజమాని అశీశ్కు ఫోన్ చేసి, స్థానిక బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫోన్ తీసుకెళ్లాలని తెలిపింది. ఫోన్ తీసుకున్న ఆశీశ్... ఆమె నిజాయితీకి మెచ్చి రూ.500 బహుమతిగా ఇచ్చాడు. ఆ నగదును విశాల స్వీకరించలేదు. ఆమె సంస్కారాన్ని, నిజాయితీని చూసి పోలీసులు అభినందించారు. -
బ్రిటన్ యువకుడితో తెలుగమ్మాయి పెళ్లి
విశాఖపట్నం: దేశాలు వేరు.. ఖండాలు వేరు.. సంప్రదాయాలు వేరు.. అయినా వారి మధ్య స్నేహం కుదిరింది.. ప్రేమగా మారింది.. పెద్దల అంగీకారంతో వారికి కనులపండువగా పెళ్లయింది. రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్ అందుకు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన మోరిస్ విలియం డీన్‌కు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి నేహకు తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో ఆదివారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి బ్రిటన్ నుంచి మోరిస్ విలియం తల్లిదండ్రులు, చెల్లి, బావ, బంధువులు హాజరయ్యారు. కొబ్బరి బోండం పట్టుకొని నూతన దంపతులను కల్యాణ మండపం వద్దకు ఆహ్వానించడం, కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, వధూవరుల తలపై జీలకర్ర, బెల్లం పెట్టడం, కంకణాల తంతు, వేద మంత్రాలతో పూజలు అన్నీ తెలుగువారి పద్ధతిలోనే జరిపారు. ఇదీ నేపథ్యం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి రామ్‌ప్రసాద్, రాధిక దంపతుల కుమార్తె నేహ. రాంప్రసాద్, రాధిక వత్తిరీత్యా ముంబైలో బ్యాంక్ ఉద్యోగులు. నేహ యూకేలో ఎంఎస్ (ఎకనామిక్స్) చదివింది. అక్కడ తనతో చదువుతున్న మోరిస్ విలియం డీన్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించారు. పెద్దలు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. ప్రస్తుతం నేహ జర్మనీలో ఉద్యోగం చేస్తోంది. మోరిస్ విలియం యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. తన తమ్ముళ్లు విశాఖలో ఉండటం, పీజీ ఇక్కడే ఏయూలో చదువుకోవడం వల్ల విశాఖపై అభిమానంతో ఇక్కడ ఉన్న స్నేహితులు, గురువులు, బంధువుల మధ్య ఈ వివాహం జరిపించినట్లు రాంప్రసాద్ తెలిపారు. తెలుగు సంప్రదాయం నచ్చింది.. ఈ పెళ్లి అంతా కొత్తగా ఉంది. మా దేశంలో ఇలాంటి విధానం లేదు. చర్చిలో అరగంటలో వివాహం జరిగిపోతుంది. రెండు, మూడు గంటలు ఇక్కడ పండితులు మంత్రాలతో పెళ్లి జరిపించారు. ఇది మాకు వింతగా అనిపించింది. నేహ మా ఫ్యామిలీలో మెంబరు అయినందుకు హ్యాపీగా ఉంది. ఇక్కడ సంప్రదాయాలు మాకు బాగా నచ్చాయి.. - రాస్ డీన్, రోజర్ డీన్ (పెండ్లి కుమారుడు మోరిస్ విలియం తల్లిదండ్రులు) -
బ్రిటన్ యువకుడితో తెలుగమ్మాయి పెళ్లి
-
ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి సారి ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె బరిలోకి దిగుతోంది. ఈ విభాగం ‘డ్రా’ శుక్రవారం విడుదలైంది. శనివారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రాంజల... దక్షిణాఫ్రికాకు చెందిన కేటీ పొలూటాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆమె రెండో రౌండ్లో టాప్ సీడ్ షిలిన్ గ్జు (చైనా) లేదా కేలా మెక్ఫీ (ఆస్ట్రేలియా)లలో ఒకరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
‘తెలుగు అమ్మాయి’ల అదుర్స్!
జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డులో ఉన్న వేదిక ఫంక్షన్ హాల్లో ఆదివారం సిటీ కేబుల్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు అమ్మాయి పోటీలకు విశేష స్పందన లభించింది. ఉత్తరాంధ్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా మొదట ప్రాథమిక ఎంపికలు నిర్వహించారు. యువతలు తెలుగుదనం ఉట్టిపడేలా వస్త్రధారణ చేసుకుని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోహిత్, శైలజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కల్చరల్ -
తెలుగు అమ్మాయిలంటే అంత చులకనా
కంచిలోని కళాశాల హాస్టల్లో వీడీయోలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలి కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి బెంగళూరు: తమిళనాడులోని కంచిలోని చంద్రశేఖర్ జయేంద్ర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో తెలుగు అమ్మాయిలను చులకనగా చూస్తున్నారని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సదరు కళాశాలలోని లేడీస్ హాస్టల్లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన దుండుగలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన యువతి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు తెలుగు అమ్మాయి అని తెలుసుకొని అక్కడి నుంచి తరిమి వేసి కళాశాలకు పది రోజులపాటు సెలవు ప్రకటించారన్నారు. తెలుగు అమ్మాయిలు చదువు కోసం పోరుగు రాష్ట్రానికి వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ విభజనే కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సరైన సమయంలో కౌన్సిలింగ్ జరగలేదని, ఆలస్యం కావడం వలనే అమ్మాయిలు పోరుగు రాష్ట్రానికి వెళ్లారని గుర్తు చేశారు. తెలుగు విద్యార్థినిలకు న్యాయం జరిగేలా భారతదేశంలోని అన్ని తెలుగు సంఘాలు, మహిళ సంఘాలు ఉద్యమించాలన్నారు. ఈ విషయంపై కర్ణాటక తెలుగు ప్రజా సమితి తరుపున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులకు లేఖలు రాస్తున్నట్లు బొందు రామస్వామి చెప్పారు. తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా తాము పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కేటీపీఎస్ పాయకులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!
సంభాషణం: అందమైన స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. ఆ వరం పర్ణికకు దక్కింది. బాడీగార్డ్, తెలుగమ్మాయి, నిప్పు, గ్రీకువీరుడు, దేనికైనా రెడీ తదితర చిత్రాల్లో తన పాటతో శ్రోతల మనసులను దోచుకుందామె. పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనివ్వని ఈ గాయనీమణి తన కెరీర్ గురించి చెబుతోన్న కబుర్లు... మావారి పేరు నిఖిలేశ్వర్... మెరైన్ ఇంజినీర్. నాకెప్పుడూ ఒక భయం ఉండేది... నన్ను అర్థం చేసుకోనివాడు భర్తగా వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ అదృష్టం కొద్దీ చాలా మంచి వ్యక్తి దొరికారు. మా ఇంట్లోవాళ్లు, మా అన్నయ్య నన్ను ఎంత ప్రోత్సహించేవారో, అంతకంటే ఎక్కువగా ప్రోత్సహిస్తారు మావారు. అలాంటి జీవిత భాగస్వామి ఉంటే ఏదైనా సాధించగలం! ఎంతైనా ఎదగగలం! కెరీర్ ఎలా ఉంది? బాగుంది. ఇటీవలే ‘రభస’ చిత్రంలో పాడాను. మరికొన్నిటికి పాడుతున్నాను. - ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడారు? తెలుగు, తమిళం, హిందీ, భోజ్‌పురి, లంబాడీ భాషల్లో కలిపి నలభై వరకూ పాడాను. - మీలో ఓ గాయని ఉందని ఎప్పుడు తెలిసింది? మా నాన్నమ్మ లక్ష్మీసుబ్రహ్మణ్యం కర్ణాటక సంగీత విద్వాంసురాలు. దాంతో మూడో తరగతిలోనే ఆవిడ దగ్గర స్వర సాధన మొదలుపెట్టాను. అయితే సరదాగానే నేర్చుకున్నాను తప్ప సింగర్ అయిపోవాలన్న లక్ష్యంతో కాదు. కానీ పదో తరగతిలో రామాచారి గారి దగ్గర చేరాక నా ఆలోచనలు మారిపోయాయి. ఆయన శిష్యులు కొందరు సినిమాల్లో ట్రాకులవీ పాడటం చూసి నాకూ అలా పాడాలన్న కోరిక కలిగింది. దాంతో పాటని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. - తొలిసారి గుర్తింపు ఎప్పుడు వచ్చింది? ‘జీ సరిగమప’లో పాల్గొనే అవకాశం వచ్చింది. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సూపర్ సింగర్స్ తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. - యాంకరింగ్ కూడా చేసినట్టున్నారు? అవును. అనుకోకుండా యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి. అన్నీ పాటలకు సంబంధించిన కార్యక్రమాలే కావడంతో ఒప్పుకునేదాన్ని. చాలా షోలు చేశాను. అయితే సింగర్‌ని కావాలన్న అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తున్నానేమోనని భయమేసి యాంకరింగ్‌కి కామా పెట్టాను. - టాలెంట్ షోల పుణ్యమా అని కోకొల్లలుగా సింగర్లు వస్తున్నారు. ఇలాంటప్పుడు సరిపడినన్ని అవకాశాలు వస్తాయంటారా? ఎందుకు రావు! శ్రీకృష్ణ, గీతామాధురి, దీపు, రేవంత్, నేను.... మా అందరికీ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అవకాశాలు ఇవ్వగలదు మన ఇండస్ట్రీ. లేదంటే నేనివాళ ఇక్కడ ఉండేదాన్నే కాదు. - కానీ బాలు, చిత్రల మాదిరిగా సింగిల్ కార్డులు పడే చాన్స్ లేదు కదా? కావచ్చు. కానీ అవకాశాలైతే ఉన్నాయి కదా! సినిమాకి ఒక్క పాట పాడినా కెరీర్‌కు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. అందరికీ చాన్సులు రావాలి. అందరూ బాగుండాలి. - అవకాశాలు మిస్సై బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మొదట్లో నేను పాడిన కొన్ని పాటల్ని చివరి నిమిషంలో తీసేసేవారు. బాగా పాడానే, ఎందుకిలా చేశారు అని బాధపడేదాన్ని. అయితే దానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అప్పట్లో ఇన్లే కార్డు మీద పడే పేరుకి వాల్యూ ఎక్కువ ఉండేది. ఓ పెద్ద సింగరో లేక ముంబై సింగరో పాడితే క్రేజ్ ఏర్పడుతుందని అనుకునేవారు. దాంతో అలా జరిగేది. ఇప్పుడలా లేదు. బయటి వాళ్లకు చాన్స్ ఇచ్చినా, తెలుగువాళ్లతో కూడా బాగానే పాడిస్తున్నారు. బలంగా ఉన్న కోరిక...? ఏ సింగర్‌కైనా తప్పక ఉండే కోరిక... ఇళయరాజా గారి దగ్గర పాడాలని. అయితే అంతకంటే ముందు ఆయన్ని చూడాలని ఉంది. రెండు మూడుసార్లు కలిసే అవకాశం వచ్చినా వేరే షోలు ఉండటం వల్ల మిస్ అయ్యాను. అప్పట్నుంచీ ఆ వెలితి అలానే ఉండిపోయింది. భవిష్యత్ ప్రణాళికలు? నాలెడ్జబుల్ గాయనిగా పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మంచి మనిషి అనిపించుకోవాలి. ఎదగాలంటే టాలెంట్ ఒక్కటీ చాలదు. మంచి ప్రవర్తన కూడా ఉండాలి. నా వరకూ నేను ఎప్పుడూ నా ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాను. దేవుడి దయ వల్ల ఎప్పుడూ ఏ రిమార్కూ తెచ్చుకోలేదు. అది చాలు నాకు. - సమీర నేలపూడి -
తిరగడమే నా పని..
కష్టాల్లో ఉన్న వారు అవెప్పుడు తీరుతాయా అని బాధపడుతుంటారు. ఇతరుల కష్టాలు చూసిన వారు కొందరు మనకెందుకులే అని ఊరుకుంటారు. ఇంకొందరు అవి తీర్చే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. గరీబుల నసీబు మార్చాలని తాపత్రయపడతారు. బానిసత్వం కోరల నుంచి అమాయకులను రక్షించాలని తపనపడతారు. ముప్పైమూడేళ్ల వయసులోనే 80 దేశాలు తిరిగిన ప్రియాంక మొటపర్తి అదే ప్రయత్నంలో ఉంది. కఫాల సిస్టం.., గల్ఫ్ దేశాల్లో కనిపిస్తున్న ఆధునిక బానిసత్వం. దీన్ని రూపుమార్చడానికి అమెరికా హ్యూమన్ రైట్స్ వాచ్ అనే సంస్థను స్థాపించింది. అందులో పని చేస్తున్న వందలాది మంది ఔత్సాహికుల్లో ప్రియాంక ఒకరు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. వలస కార్మికుల సమస్యలను అక్షరబద్ధం చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయాణంలో హైదరాబాద్ చేరుకుని ‘సిటీప్లస్’కు ఈనాటి అతిథి అయ్యింది. - ప్రియాంక మొటపర్తి, సామాజికవేత్త ఒంట్లో ఓపిక ఉన్నా.. పని చేసే మనసున్నా.. ఉపాధి లేక వలస బాట పడుతున్న కార్మికుల మీదే నా రీసెర్చ్. హ్యూమన్ రైట్స్ వాచ్ నాకిచ్చిన అవకాశం ఇది. ఇంతకీ మా సొంతూరు ప్రకాశం జిల్లా దెందులూరు. వెంకట అమ్మానాన్నలు ల క్ష్మీకుమారి, సోమయ్య చౌదరి మేం పుట్టక ముందే అమెరికాలో స్థిరపడ్డారు. నాన్న యూఎస్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. అమ్మ హౌజ్‌వైఫ్. నాకో తమ్ముడు నీల్. కొలొంబియా యూనివర్సిటీలో ‘లా’ పూర్తవగానే హ్యూమన్‌రైట్స్ వాచ్‌లో జాబ్ వచ్చింది. మిడిల్ ఈస్ట్ విజన్ ప్రాజెక్ట్ వర్క్స్ చూసేదాన్ని. అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియాలన్నా.. అక్కడివాళ్లతో బాగా కనెక్ట్ కావాలన్నా ఆ భాష తెలుసుండాలి. అందుకే కష్టంతో, ఇష్టంతో అర బ్బీ నేర్చుకున్నాను. మొదటి ప్రాజెక్ట్ కార్మికులదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ కువైట్‌లోని డొమెస్టిక్ వర్కర్స్ మీద. అక్కడ వందల మంది కార్మికులను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ల పని, పరిస్థితులు, సౌకర్యాలు వంటి అంశాలమీద రీసెర్చ్ చేసి 2012లో కువైట్ ఎంబసీకి ఓ రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత యూఏఈ, ఖతర్ వెళ్లి అక్కడి లేబర్స్ మీద వర్క్ చేశాను. అలా 80 దేశాలు తిరిగి.. వేలాది మంది వలస కార్మికుల స్థితిగతులపై నివేదికలు ఇచ్చాను. చిన్నారుల హక్కుల కోసం.. కొద్ది కాలానికి ఈజిప్ట్‌లో చిల్డ్రన్స్ రైట్స్ విభాగంలో నాకు కొత్త ఉద్యోగం దొరికింది. అప్పటి నుంచి నా బస కైరోకి మారింది. ఈజిప్టే కాకుండా సిరియా, యెమెన్ లాంటి దేశాల్లోని పిల్లల మీదా చాలా వర్క్ చేశాను. ఈ ఐదేళ్ల అనుభవం నాకు ప్రపంచం ఇంకో అంచును పరిచయం చేసింది. నాలో ఓ కలను నిజం చేయాలన్న కసి రగిల్చింది. అందుకే కిందటేడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. దేశాలు తిరిగే జాబేంటి..? మా పేరెంట్స్‌ది డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను చేస్తున్న ఈ పని సహజంగానే వాళ్లకు అర్థం కాదు కదా..(నవ్వుతూ)! ‘హాయిగా ఆఫీస్‌లో కూర్చోనే పని చేసుకోక ఈ దేశాలు తిరిగే జాబేంటీ?’ అని అంటారు. నా పుస్తకం పూర్తయితే వాళ్లకు నా కష్టం తెలుస్తుంది. అనుభవాలే అక్షరాలుగా.. నేను చూసిన 80 దేశాలే నాకు ప్రేరణ. ఆయా దేశాల్లో నేను పలకరించిన వలస కూలీలు, వారి బాధలు, సంతోషాలే నాకు బలం. నా కథావస్తువు వారి జీవితాలే. పుస్తక రచనలో నేను చాలా ఎన్జీవోలు, యాక్టివిస్ట్‌ను కలిశాను. వారి సలహాలు, సూచనలు తీసుకున్నాను. అయితే అవన్నీ వలస కూలీలను ఒకే కోణంలో చూపిస్తాయి. నేను అన్ని కోణాలు స్పృశించాలని వాళ్ల జీవనంపై అధ్యయనం చేశాను. ముఖ్యంగా ఖతర్‌లోని వలస కూలీల జీవనంపైనే ఫోకస్ చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నాను. మొన్న కరీంనగర్ జిల్లా అంతా చుట్టొచ్చాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంతమంది గల్ఫ్‌కి వెళ్తున్నారు..? ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? ఏ లక్ష్యంతో వెళ్తున్నారు.., వెళ్లాక వారికి ఎదురవుతున్న పరిస్థితులేంటి..? ఇవీ నా ప్రశ్నలు. అవగాహన లేమితో గల్ఫ్ బాట పడుతున్న అమాయకులకు అక్కడ ఎదురవుతున్న బాధలు, కన్నీళ్లు తుడిచే చిన్న చిన్న సంతోషాలు.. తెలుసుకోవాలనుకుంటున్నాను. వీటన్నింటి సమాహారంగా నా పుస్తకం ఉంటుంది. అది వాస్తవానికి అద్దం పడుతుందన్న నమ్మకం నాకుంది. అందుకోసం కూలీల జీవనంపై వచ్చిన ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను. హైదరాబాద్ హోమ్ టౌన్.. ఇండియా అనగానే నాకు గుర్తొచ్చేది హైదరాబాదే. ఒకరకంగా చెప్పాలంటే ఇది నా హోమ్ టౌన్. ఇప్పటి వరకు నేనిక్కడికి ఓ పది సార్లు వచ్చుంటాను. మా పిన్ని వాళ్లు ఇక్కడే ఉంటారు. పదేళ్లలో హైదరాబాద్ చాలా మారింది. ట్రాఫిక్, వాతావరణం అన్నింట్లో మార్పులు కనిపిస్తున్నాయి. - సరస్వతి రమ -
తెలుగమ్మాయిని పట్టించుకోని టాలీవుడ్
-
వెలుగమ్మాయి
‘నాకు జీవితమంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తి కాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి లాంటిది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక’ అంటాడు జార్జి బెర్నార్డ్‌షా. మారిషస్‌లో పుట్టిన 'ఊర్మిళాదేవి' దీ అదే లక్ష్యం. 180 ఏళ్ల క్రితం... ఊర్మిళాదేవి పూర్వీకులు మారిషస్‌లో స్థిరపడ్డారు. అక్కడి సంస్కృతిలోనే మమేకమైపోయారు. ఆ కుటుంబంలోనే పాతిక సంవత్సరాల క్రితం ఊర్మిళాదేవి పుట్టింది. తెలుగు నేలతో ముడిపడిన తన మూలాలను తెలుసుకుంది. తెలుగు నుడికారంపై మమకారం పెంచుకుంది. తెలుగు నేలపై వాలిపోయింది. తెలుగమ్మాయి అనిపించుకుంది. ఆ రోజు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఫ్రెషర్స్‌డే ఉత్సాహంగా సాగుతోంది. విద్యార్థులంతా వారు తెలుగు ఎం.ఏ లో ఎందుకు చేరారో చెబుతున్నారు. అంతలో ఓ అమ్మాయి, ‘అందరికీ నమస్కారమండీ. తెలుగు భాషలో మంచి పట్టు సాధించేందుకే ఎం.ఏ తెలుగులో చేరాను. నా దేశంలో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగుదేశాన్ని త్రిలింగ దేశమంటారని పుస్తకాల్లో చదివి, త్రిలింగ క్షేత్రాల్ని దర్శించాలని ఉవ్విళ్లూరాను...’ అంటూ, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య శ్రీదేవిలా ముద్దుగా పలికింది. ఆ మాటలకు అంతా కరతాళ ధ్వనులు చేశారు. అరవయ్యేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం చరిత్రలో అదో అరుదైన ఘట్టంగా చెప్పుకున్నారు. మారిషస్ నుంచి తెలుగు చదువుకునేందుకు ఓ అమ్మాయి రావడం అపూర్వంగా భావించారు. అమ్మ ప్రోత్సాహంతోనే... ఊర్మిళ పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం. 1835లో బతుకు తెరువు కోసం మారిషస్ వలస వెళ్లిపోయారు. ఆ కుటుంబంలోని ప్రస్తుత తరానికి చెందిన దంపతులు నవీంద్, లక్ష్మి. వారి కవల కుమార్తెలు ఊర్మిళాదేవి, ఉష. ఊర్మిళ తల్లి తెలుగు ఉపాధ్యాయిని. తండ్రి ఆంగ్లం, సైన్స్, ఫ్రెంచ్ బోధించేవారు. ఆ కుటుంబ సభ్యులు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోవడం, ఊర్మిళ తల్లిని బాధించేది. తెలుగులో పట్టా సాధించాలని ఆసక్తి ఉన్నా అప్పట్లో కళాశాలలు లేక చదవలేక పోయారు. మారిషస్ ఆంధ్ర మహాసభ నిర్వహించిన తెలుగు ప్రవేశిక, ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. తెలుగు భాష విశిష్టత గురించి తల్లి తరచూ చెబుతుండటంతో ఊర్మిళకు ఆసక్తి పెరిగింది. అప్పటికే బి.ఎస్సి. పూర్తి చేసిన ఆమె బి.ఏ (తెలుగు) కూడా చదవాలని నిర్ణయించుకుంది. బ్యాంకు ఉద్యోగం వద్దు... తెలుగు చదువే ముద్దు... బ్యాంకు ఉద్యోగం సంపాదించిన ఊర్మిళ, సాయంత్రం కళాశాలలో బిఏ (తెలుగు) చదవాలని నిర్ణయించుకుంది. ‘‘కళాశాలకు కాస్త ముందుగా వెళ్లేందుకు అనుమతివ్వమని బ్యాంకు యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాను. వారు అంగీకరించలేదు. దాంతో చదువు కోసం ఉద్యోగాన్నే వదిలేశాను’’ అంటారు ఊర్మిళ. భారతీయ భాషలను ప్రోత్సహించడం కోసం మారిషస్ ప్రభుత్వం తెలుగు పాఠశాలలను కూడా స్థాపించింది. మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న తెలుగు (బి.ఏ) కోర్సులో చేరింది. అక్కడ తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సౌదామిని మూర్తి గారి శిష్యరికంలో తెలుగు పరిజ్ఞానం పెంచుకున్నారు ఊర్మిళ. ‘‘ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర రచనలు చదివాను. విశ్వనాథ సత్యనారాయణ నాకు ఇష్టమైన కవి. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ నాటకం స్ఫూర్తితో ‘మానవ స్వభావం, ‘ధన ప్రభావం’ అనే నాటకాలను రాసి ప్రదర్శించాను. ఈ రెండింటికీ పన్నెండు అవార్డులు లభించాయి. దాంతో మారిషస్ ఆంధ్ర మహాసభ ఉప కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు’’ అని ఊర్మిళ చెప్పారు. చదువుకున్న చోటే ఉపాధ్యాయినిగా... తాను చదువుకున్న మహాత్మాగాంధీ పాఠశాలలోనే తెలుగు ఉపాధ్యాయినిగా ఆమె చేరారు. ఇంతలో తెలుగు ఎం.ఏ. సీటు దొరికింది. స్టడీ లీవు తీసుకుని, విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్నారు. ‘‘నన్ను తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ మోహనరావు పరిచయం చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో బిడియంగా ఉండేదాన్ని. అక్కడి స్నేహితులు నన్ను అక్కున చేర్చుకున్నారు. తక్కువ కాలంలోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా ఎంతసేపైనా తెలుగు మాట్లాడగలుగుతు న్నాను’’ అంటారు ఊర్మిళ. ఆమెకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఎం.ఏ. తెలుగు చదువుతుండగానే గాత్ర సంగీతంలో సర్టిఫికెట్ కోర్సులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. తెలుగమ్మాయికి ఆత్మీయ వీడ్కోలు రెండేళ్లలో చదువు పూర్తయింది. పరీక్షలైపోగానే మారిషస్ బయలుదేరారు ఊర్మిళ. ఆమెను మిత్రులంతా ఘనంగా సన్మానించారు. ఆడపిల్లను పుట్టింటికి సాగనంపినట్టు చీర, జాకెట్టు, పూలు, పండ్లు అందజేశారు. ‘‘ఏయూ తెలుగు విభాగం చరిత్రలో ఎంఏ తెలుగు చదివేందుకు ఓ విదేశీ విద్యార్థి రావడం ఇదే ప్రథమం. ఊర్మిళ తెలుగు భాషను ఎంతో నిజాయితీగా అభ్యసించింది. ఆమె స్వచ్ఛమైన తెలుగులో సంభాషిస్తుంటే ముచ్చటేసేది. ఆమె పదహారణాల అచ్చ తెలుగు ఆడపిల్ల’’ అని ప్రశంసించారు ప్రొఫెసర్ మోహనరావు. తెలుగంటే ఎందుకింత మక్కువని ఊర్మిళను ప్రశ్నిస్తే... ‘‘అమ్మంటే ఎందుకిష్టం అంటే ఏం చెబుతాం? తెలుగులో పీహెచ్డీ చేస్తాను. మారిషస్‌లో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగు అధ్యాపకురాలిగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాను’’ అంటారు ఊర్మిళ. ఆమె.. తెలుగమ్మాయి... మన వెలుగమ్మాయి. - ఎ. సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
బహ్రెయిన్‌లో తెలుగు యువతి తెగువ
దుబాయి: వేధింపులకు గురిచేసిన బహ్రెయిన్ యజమాని నుంచి ఒక తెలుగు యువతి తప్పించుకుంది. మరో ఇద్దరు ఇండోనేసియన్ యువతులు కూడా ఆమె తరహాలోనే తమ యజమానుల నుంచి తప్పించుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డ ఈ ముగ్గురు యువతులూ ప్రస్తుతం బహ్రెయిన్ రాజ దాని మనామాలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స పొందుతున్నట్లు ‘గల్ఫ్ న్యూస్’ దినపత్రిక మంగళవారం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గతనెల బహ్రెయిన్‌లోని ఒక కుటుంబం వద్ద పనికి కుదిరిన అనూష అనే యువతి ఏజెంట్ల ద్వారా ఫోర్జరీ వీసాతో ఇక్కడకు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. తన వయసు 35 ఏళ్లు అని చెప్పుకొని ఆమె ఇక్కడకు వచ్చినా, ఆమె అసలు వయసు 19 ఏళ్లేనని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. తమ యజమానులు గొడ్డుచాకిరీ చేయించడంతో పాటు శారీరకంగా వేధించడంతో తాళలేక వారి నుంచి తప్పించుకున్నట్లు అనూషతో పాటు మిగిలిన ఇద్దరు ఇండోనేసియన్ యువతులు చెప్పారన్నారు. అనూషకు చెయ్యి, కాళ్లు ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స నిర్వహించినట్లు వలస కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షురాలు డయాస్ చెప్పారు.