
రాజంపేట: స్కాట్లాండ్ దేశానికి చెందిన మాథ్యూస్, అన్నమయ్య జిల్లా కారంపల్లెకు చెందిన నీమకల్లు సోనియారెడ్డి ప్రేమించుకున్నారు. త్వరలో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వివరాల్లోకి వెళితే...కారంపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమార్తె నీమకల్లు కౌసల్యరెడ్డి యూకేలో స్థిరపడ్డారు.
ఆమె కుమార్తె సోనియారెడ్డి యూకేలోనే మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ జనరల్ ప్రాక్టీషనర్ విద్య పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో మాథ్యూస్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆయన కూడా హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార రంగంలో ఉన్నారు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించారు.
ఈ నెల 7న సంప్రదాయబద్ధంగా హైదరాబాద్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు. వివాహానికి ఇరుకుటుంబాలు కారంపల్లికి చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విదేశీయులతో స్థానికులు ముచ్చటించడం ఆకట్టుకుంది. తెలుగువారి సంప్రదాయాలు తమకు నచ్చాయని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment