Mathews
-
స్కాట్లాండ్ యువకుడితో తెలుగమ్మాయి ప్రేమ
రాజంపేట: స్కాట్లాండ్ దేశానికి చెందిన మాథ్యూస్, అన్నమయ్య జిల్లా కారంపల్లెకు చెందిన నీమకల్లు సోనియారెడ్డి ప్రేమించుకున్నారు. త్వరలో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వివరాల్లోకి వెళితే...కారంపల్లె గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమార్తె నీమకల్లు కౌసల్యరెడ్డి యూకేలో స్థిరపడ్డారు. ఆమె కుమార్తె సోనియారెడ్డి యూకేలోనే మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ జనరల్ ప్రాక్టీషనర్ విద్య పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో మాథ్యూస్ అనే వ్యక్తితో ఆమెకు స్నేహం ఏర్పడింది. ఆయన కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపార రంగంలో ఉన్నారు. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరువురు పెద్దలు అంగీకరించారు. ఈ నెల 7న సంప్రదాయబద్ధంగా హైదరాబాద్‌లో వీరు పెళ్లి చేసుకోనున్నారు. వివాహానికి ఇరుకుటుంబాలు కారంపల్లికి చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విదేశీయులతో స్థానికులు ముచ్చటించడం ఆకట్టుకుంది. తెలుగువారి సంప్రదాయాలు తమకు నచ్చాయని వారు చెబుతున్నారు. -
‘కొడనాడు’ దోపిడీ వెనుక పళనిస్వామి!
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ దోపిడీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎస్టేట్‌లోని కీలక పత్రాలు, వీడియోల కోసమే ఈ దోపిడీ, హత్యలు జరిగాయని తెహల్కా పత్రిక మాజీ సంపాదకుడు మాథ్యూస్ ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారని బాంబు పేల్చారు. జయలలిత విశ్రాంతి కోసం తరచూ ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అలాంటి సందర్భాల్లో కొడనాడు ఎస్టేట్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేవారు. అయితే జయలలిత చనిపోయాక 2017 ఏప్రిల్ 24న ఇక్కడ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో వాచ్మెన్ ఓం బహదూర్ దారుణ హత్యకు గురికాగా, కృష్ణబహదూర్ అనే మరో వాచ్మెన్ గాయాలతో బయటపడ్డాడు. అప్పట్లో నగల కోసమే దొంగతనం జరిగిందని వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పే వీడియోలు.. అన్నాడీఎంకే వర్గాలను తన గుప్పెట్లో ఉంచుకునే రీతిలో జయలలిత కొన్ని కీలక రికార్డులను ఆ ఎస్టేట్‌లో దాచి ఉంచారని, తప్పు చేసిన పార్టీ నేతలు జయలలిత కాళ్లపై పడి క్షమించమని వేడుకునే వీడియోలు ఎస్టేట్‌లో ఉండేవని మాథ్యూస్ తెలిపారు. ఈ వీడియోలతో పాటు మరికొన్ని రికార్డుల కోసమే దోపిడీ జరిగిందని ఈ కేసులో నిందితుడు షయాన్ చెప్పాడు. జయలలిత ఆసుపత్రిలో ఉండగానే దోపిడీకి ప్రణాళిక రచించామనీ, పళనిస్వామి సీఎం అయ్యాక అది వీలైందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే నాటకం: సీఎం జయ పేరుకు కళంకం తీసుకురావడమే కాకుండా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాటకం మొదలైందని సీఎం ఆరోపించారు. ఈ విషయాన్ని ఇన్నిరోజులు నిందితులు కోర్టుకు ఎందుకు చెప్పలేదని పళనిస్వామి ప్రశ్నించారు. -
తాప్సీకి నిశ్చితార్థం అయ్యిందా?
తమిళసినిమా: సినిమా వాళ్లు, ముఖ్యంగా హీరోయిన్లు చెప్పేది నమ్మాలో, కూడదో ఇదిమిద్దంగా తేల్చుకోలేని పరిస్థితి. ప్రేమ, పెళ్లి విషయాల్లో వారి మాటలకు, చేతలకు అసలు పొంతన ఉండదు. అందుకే అన్నారో మహాకవి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. ఆ మధ్య నటి శ్రియ గప్‌చుప్‌గా పెళ్లి చేసేసుకుని కొన్ని రోజుల తరువాత నా పెళ్లైపోయింది అంటూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా నటి తాప్సీ గురించి ఇలాంటి ప్రచారమే సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ధనుష్‌తో రొమాన్స్ చేసిన ఆ చిత్రం సక్సెస్ అయినా, ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఎందుకనో తాప్సీ కోలీవుడ్‌లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ఈ అమ్మడికి టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే బాలీవుడ్ మాత్రం తాప్సీని అక్కున చేర్చుకుంది. అక్కడిప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. ఈ అమ్మడు వదంతులకు బాగానే తావిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తాప్సీ ప్రేమ వ్యవహారం గురించి వార్తలు ఎక్కువగానే ప్రచారం అవుతున్నాయి. అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోని ఈ జాణ తాజాగా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. అందుకు కారణం ఆమె పెళ్లికి సిద్ధం అయ్యిందని, ఇటీవలే రహస్యంగా వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే ప్రచారం హల్చల్ చేయడమే. తాప్సీ మ్యాథ్యూస్ అనే ఒలింపిక్ పోటీల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విషయం గురించి మీడియా ప్రచారం చేస్తున్నా, పట్టించుకోని తాప్సీ ఇటీవల ముంబైలోని ఒక నక్షత్ర హోటల్ నుంచి చేయిచేయి కలుపుకుని బయటకు రావడం మీడియా దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే వారి బంధం గురించి మీడియా వాళ్లు ప్రశ్నించగా వ్యక్తిగత విషయాల గురించి నో కామెంట్ అంటూ అక్కడ నుంచి జారుకుంది. దీంతో తాప్సీ రహస్య వివాహ నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం జోరందుకుంది. సమీప కాలంలో తాప్సీ కుటుంబసభ్యులతో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడికి మ్యాథ్యూస్ కూడా వచ్చాడు. అక్కడ మ్యాథ్యూస్‌కు తాప్సీకి కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తాప్సీ ఖండించింది. తాను కుటుంబ సభ్యులతో కలిసి వేసవి విడిదికి గోవా వెళ్లానని, అంతేకానీ, తనకు వివాహనిశ్చితార్థం లాంటిదేమీ జరగలేదని అంటోంది. -
వైజాగ్ వన్డేకు మాథ్యూస్ ఫిట్
విశాఖ స్పోర్ట్స్: శ్రీలంక జట్టుకు నిజంగానే ఇది ఊరటనిచ్చే వార్త. సీనియర్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ నిర్ణాయక మూడో వన్డే కోసం ఫిట్‌గా ఉన్నాడు. ఆదివారం అతను బరిలోకి దిగుతాడని లంక టీమ్ మేనేజర్ అసంక గురుసిన్హా తెలిపారు. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో మాథ్యూస్ అజేయ సెంచరీ సాధించాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ శుక్రవారం అతను ప్రాక్టీస్ సెషన్లో ఇబ్బంది లేకుండా పాల్గొన్నాడు. ‘మాథ్యూస్ కండరాల నొప్పి నుంచి కోలుకున్నాడు. నెట్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతనే కాదు... మా ఆటగాళ్లందరూ ఫిట్‌గానే ఉన్నారు’ అని గురుసిన్హా అన్నారు. ప్రాక్టీస్‌కు భారత్ ఆటగాళ్లు దూరం సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేకు ముందు శ్రీలంక ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. మరోవైపు భారత ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్ చేయలేదు. పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ఆటగాళ్లెవరూ నెట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. శనివారం మాత్రం ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతారని జట్టు వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం భారత ఆటగాళ్లను చూసేందుకు వైజాగ్ వాసులు స్టేడియానికి పోటెత్తారు. అయితే టీమిండియా ఆటగాళ్లెవరూ హోటల్ గదుల నుంచి ప్రాక్టీస్‌కు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో కాసేపు లంక ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను తిలకించి నిష్క్రమించారు. ఆల్‌రౌండర్ మాథ్యూస్, కెప్టెన్ పెరీరా నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన చివరి వన్డే ఆదివారం ఉక్కునగరంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగనుంది. -
శ్రీలంక ఘోర పరాజయం
-
మాథ్యూస్ సెంచరీ వృథా.. తప్పని ఓటమి
మొహాలి: తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. రెండో వన్డేలో శ్రీలంకను చిత్తుగా ఓడించి విజయబావుటా ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని చిత్తు చేసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో లంకను 141 పరుగుల తేడాతో ఓడించింది. రోహిత్ సేన నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు సాధించింది. సీనియర్ ఆటగాడు మాథ్యూస్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా లంకను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. ఏ ఒక్కరూ అతడికి తోడుగా నిలబడలేకపోయారు. 122 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. వన్డేల్లో అతడికిది రెండో సెంచరీ. 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో చాహల్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 392 పరుగులు చేసింది. రోహిత్ శర్మ చెలరేగి ఆడి అజేయ డబుల్ సెంచరీ(208) సాధించాడు. శ్రేయస్ అయ్యర్(88), శిఖర్ ధవన్(68) అర్ధసెంచరీలు చేశారు. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. -
విఫలమైన భారత్ ఓపెనర్లు
-
స్కోరు 2, వికెట్లు 2
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా శిఖర్ ధావన్ డకౌట్ కాగా రెండో వికెట్ రోహిత్ క్యాచ్ అవుటయ్యాడు. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నౌటౌట్ ప్రకటించగా..లంక కెప్టెన్ పెరీరా రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలకపోవడం, బంతి మిడిల్ స్టంప్‌వైపు దూసుకుపోవడంతో థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. దీంతో భారత్ పరుగులు చేయకుండానే వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్.. లక్మల్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ కూడా శ్రీలంక రివ్యూతో సాధించడం విశేషం. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటంతో లంక బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి ఐదు ఓవర్లు నాలుగు మేడిన్ కాగా భారత్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. -
అర్ధసెంచరీతో ఆదుకున్న మాథ్యూస్
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ మరోసారి తడబడ్డారు. మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కరుణరత్నే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో లంక పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డిసిల్వా కూడా ఎక్కుసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఇషాంత్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్, మరో ఓపెనర్ పెరెరాతో ఆచితూచి ఆడాడు. 61 పరుగుల జోడించిన ఈ జంటను జడేజా విడగొట్టాడు. పెరెరా(42)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన చండిమాల్‌తో మాథ్యూస్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ దశలో 89 బంతుల్లో మాథ్యూస్ అర్ధశతకం సాధించాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన 28వ ఓవర్లో రెండు, మూడు బంతుల్లో వరుస సిక్సర్లు బాది అర్ధశతకం పూర్తిచేశాడు. చాన్నాళ్ల తర్వాత క్రీజులో నిలిచి స్థాయికి తగ్గ ప్రదర్శనతో లంకకు అండగా నిలిచాడు. కెప్టెన్ దినేశ్ చండిమాల్ (25; 81 బంతుల్లో 3ఫోర్లు) అతడికి సహకారం అందించాడు. దీంతో మరో వికెట్ కోల్పోకుండా ఈ ఇద్దరు జాగ్రత్తగా ఆడారు. ఇక ఆటముగిసే సమయానికి లంక మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. షమీ, ఇషాంత్, జడేజాలు తలో వికెట్ తీశారు. మరో వైపు భారత్ మిస్ ఫీల్డింగ్ లంకకు కలిసొచ్చింది. అంతకుముందు కాలుష్య ప్రభావంతో ఫీల్డింగ్ చేయలేకపోతున్నామని లంక ఆటగాళ్లు పదే పదే అంపైర్‌కు ఫిర్యాదు చేయడంతో విసుగెత్తిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చాడు. దీంతో ఇంకా లంక 405 పరుగుల వెనుకంజలో ఉంది. -
కుప్పకూలిన శ్రీలంక.. భారత్‌కు భారీ ఆధిక్యం
శ్రీలంక 291 ఆలౌట్ గాలె: భారత్-శ్రీలంక తొలి టెస్టులో మూడో రోజు ఆటలో లంక 291 పరుగులకే కుప్పకూలింది. లంచ్ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసిన లంక బ్యాట్స్‌మెన్ మరో రెండు పరుగులు జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో కుమారా(2) క్లీన్ బౌల్డ్ కావడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డ అసేల గుణరత్నే మ్యాచ్‌కు దూరం కావడంతో లంక 10 మందితోనే బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. ఇక ఒంటరి పోరాటం చేసిన పెరీరా (92 నాటౌట్) శతకం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 154/5తో లంక బ్యాట్స్‌మెన్ మాథ్యూస్(54 బ్యాటింగ్), దిల్రువన్ పెరీరా(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆచితూచి ఆడిన వీరిద్దరు జట్టు స్కోరు రెండు వందలు దాటించారు. అనంతరం జడేజా బౌలింగ్‌లో సెంచరీ దిశగా దూసుకెళ్లున్న మాథ్యూస్ (89) స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. జడ్డూ వేసిన 59 ఓవర్లో మాథ్యూస్ విరాట్ కోహ్లీకి చిక్కి పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ 6 వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లంక కెప్టెన్ హెరాత్ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకో లేకపోయాడు జడేజా వేసిన 66 ఓవర్లో రహానే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ప్రదీప్ కూడా పాండ్యా బౌలింగ్‌లో బౌల్డ్ అవ్వడంతో శ్రీలంక 280 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మరో 11 పరుగుల వ్యవధిలోనే చివరి వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ 309 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత బౌలర్లలో జడేజా(3), షమీ(2), పాండ్యా, ఉమేశ్, అశ్విన్ తలో వికెట్ దక్కిచ్చుకున్నారు. -
గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్
లండన్: భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చేసిన సూచనలే గెలుపుకు కారణమయ్యాయని ఆ జట్టు కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మాథ్యూస్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఒత్తిడిలో ఉన్న మేము భారత్‌తో మ్యాచ్ గెలుస్తామనుకోలేదన్నాడు. కానీ సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్ తెలిపాడు. గత కొద్దీ కాలముగా విజయాలు లేని మాకు ఈ విజయం ఊరటనిచ్చిందన్నాడు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్ తెలిపాడు. కుసాల్ మెండీస్(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్ సూచనలే కారణమన్నాడు. మెండీస్, గుణతిలకాల 159 పరుగుల భాగస్వామ్యం కీలకమని ఈ యువ ఆటగాళ్లను కొనియాడాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే గెలిపించిందని అభిప్రాయపడ్డాడు. తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్ పెరారా(47)ను కెప్టెన్‌గా రిటైర్డ్ హాట్‌గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదన్నాడు. ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపుతో సెమీస్ రేసులో ఉన్నామని, తర్వాతి మ్యాచ్‌కు కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్ పేర్కొన్నాడు. -
శ్రీలంకకు ఎదురు దెబ్బ
లండన్: చాంపియన్స్ ట్రోఫి బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. శనివారం (జూన్ 3) జరిగే శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు మాథ్యూస్ అందుబాటులో ఉండని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో వైస్ కెప్టెన్ ఉపుల్ తరంగ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. గతంలో తొడ కండరాలు పట్టేయడంతో జింబాంబ్వే సిరీస్‌కు దూరమైన మాథ్యూస్ మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫి తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మాథ్యూస్ చివరి వన్డే మ్యాచ్ శ్రీలంకలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడాడు. భారత్, సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్లతో శ్రీలంక గ్రూప్ బిలో ఉంది. -
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మలింగ
టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు షాక్ తగిలింది. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు లసిత్ మలింగ బోర్డుకు లేఖ రాశాడు. మోకాలి గాయం కారణంగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేదీ లేనిదీ తెలియనందున, కెప్టెన్ విషయంలో స్పష్టత ఉండాలని భావించి మలింగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంకకు మ్యాథ్యూస్ సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది. -
కోహ్లి నాయకత్వానికి పరీక్ష
♦ నేటినుంచి భారత్, శ్రీలంక తొలి టెస్టు ♦ రెండూ యువ జట్లే భారత జట్టు ఉపఖండంలో అద్భుతంగా ఆడుతుంది కానీ బయట రికార్డు గొప్పగా లేదు అనేది తరచుగా వినిపించే మాట. కానీ ఉపఖండంలో కూడా శ్రీలంకలో టీమిండియా ప్రదర్శన పేలవమే. 22 ఏళ్లుగా అక్కడ భారత్ సిరీస్ గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాసేందుకు కోహ్లి సేన సన్నద్ధమైంది. ఇరు జట్లలో ఎక్కువ భాగం యువ ఆటగాళ్లే ఉండగా... ఇటీవలి ప్రదర్శనతో మొగ్గు మన వైపే కనిపిస్తోంది. టెస్టు కెప్టెన్‌గా కోహ్లి తన ముద్ర వేయగలడా అనేది కూడా ఆసక్తికరం. గాలే : కొంత విశ్రాంతి తర్వాత సుదీర్ఘ సీజన్‌కు భారత క్రికెట్ జట్టు సిద్ధమైంది. శ్రీలంక రూపంలో జట్టుకు తొలి సవాల్ ఎదురు కానుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, లంక మధ్య నేటినుంచి (బుధవారం) మొదటి టెస్టు జరుగుతుంది. కెప్టెన్‌గా కోహ్లి తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఇటీవల అనూహ్యంగా పాకిస్తాన్ చేతిలో ఓడిన లంక కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఆటగాళ్ల ఫామ్, ఓవరాల్‌గా జట్టు ప్రదర్శన చూస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే సొంతగడ్డపై బలమైన జట్టయిన లంక తమ దిగ్గజం సంగక్కర వీడ్కోలు సిరీస్‌ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. ఐదుగురు బౌలర్లతోనే కెప్టెన్ అయిననాటినుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహానికే కట్టుబడ్డానని పదే పదే చెబుతున్న విరాట్ కోహ్లి మరోసారి దానినే అమలు చేసే అవకాశం ఉంది. పేసర్లుగా ఇషాంత్, ఉమేశ్... ముగ్గురు స్పిన్నర్లుగా హర్భజన్, అశ్విన్, మిశ్రా తుది జట్టులో ఉండొచ్చు. గాయంతో విజయ్ దూరం కావడంతో జట్టుకు ఓపెనింగ్ సమస్య తొలగిపోయింది. ధావన్, రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. రాహుల్‌కు జట్టులో అందరికంటే తక్కువ అనుభవం ఉన్నా... అతనూ ఇప్పటికే ఆస్ట్రేలియాలో సెంచరీ చేసేశాడు. కోహ్లి, రహానేలు మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పుజారాను కాదని తనపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత రోహిత్ శర్మపై ఉంది. మూడో స్థానంలో అతను ఇప్పటికైనా రాణిస్తేనే టెస్టుల్లో భవిష్యత్తు ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్ తగ్గడంతో కీపర్ సాహా కూడా బాగా ఆడితే భారీస్కోరు సాధ్యమవుతుంది. పేరుకు యువ జట్టుగా కనిపిస్తున్నా ఇందులో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఆడి చాలా మంది ఆటగాళ్లు రాటుదేలారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తాత్కాలికంగా రెండు మ్యాచ్‌లు, బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు కెప్టెన్సీ చేసిన కోహ్లి తన సామర్థ్యం నిరూపించుకునేందుకు ఇది తగిన అవకాశంగా భావిస్తున్నాడు. భారత టాప్-6 ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు శ్రీలంకలో ఆడలేదు. మ్యాథ్యూస్‌పై ఒత్తిడి టెస్టుల్లో నిలకడ లేని జట్టు పాకిస్తాన్ చేతిలో కూడా సిరీస్ పరాజయం, భవిష్యత్తులో ఎక్కువ మంది కుర్రాళ్లతో నిండిన జట్టును నడిపించాల్సిన బాధ్యత వల్ల లంక కెప్టెన్ మ్యాథ్యూస్ ఒత్తిడిలో ఉన్నాడు. వెటరన్ సంగక్కర మార్గనిర్దేశనంలో తొలి రెండు టెస్టుల్లోనే సిరీస్ ఫలితాన్ని తేల్చాలని అతను భావిస్తున్నాడు. అయితే ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగతా వారంతా అనుభవశూన్యుల కిందే లెక్క! కౌశల్ సిల్వ, కరుణరత్నే ఇటీవల మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించారు. వారిపైనే జట్టు మరోసారి ఆధారపడుతోంది. దమ్మిక ప్రసాద్, ప్రదీప్‌లు పేస్ భారం మోస్తున్నారు. స్పిన్‌లో ఆ జట్టు విజయావకాశాలు రంగన హెరాత్‌పైనే ఆధారపడి ఉన్నాయి. మరో స్పిన్నర్‌గా కౌశల్ ఉంటాడు. జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, రోహిత్, రహానే, సాహా, అశ్విన్, హర్భజన్, ఇషాంత్, ఉమేశ్, మిశ్రా. శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), కౌశల్, కరుణరత్నే, సంగక్కర, తరంగ, చండీమల్, ముబారక్, దమ్మిక ప్రసాద్, తరిందు, హెరాత్, ప్రదీప్. -
మాథ్యూస్ అజేయ సెంచరీ
అబుదాబి: రోజంతా ఆడి ఒక్క వికెట్ మాత్రమే చేజార్చుకున్న శ్రీలంక.. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోలుకుంది. కెప్టెన్ మాథ్యూస్ (282 బంతుల్లో 116 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 420 పరుగులు చేసింది. మాథ్యూస్‌తో పాటు ప్రసన్న జయవర్ధనే (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఓవరాల్‌గా లంక 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 186/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక జట్టులో చండిమాల్ (166 బంతుల్లో 89; 12 ఫోర్లు), మాథ్యూస్ నిలకడగా ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. ఈ దశలో జునైద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చండిమాల్ అవుటయ్యాడు. కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్ ఆరో వికెట్‌కు ప్రసన్నతో కలిసి అజేయంగా 96 పరుగులు జోడించి రోజును ముగించాడు.