
మాథ్యూస్
అబుదాబి: రోజంతా ఆడి ఒక్క వికెట్ మాత్రమే చేజార్చుకున్న శ్రీలంక.. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోలుకుంది. కెప్టెన్ మాథ్యూస్ (282 బంతుల్లో 116 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 5 వికెట్లకు 420 పరుగులు చేసింది. మాథ్యూస్‌తో పాటు ప్రసన్న జయవర్ధనే (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఓవరాల్‌గా లంక 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 186/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక జట్టులో చండిమాల్ (166 బంతుల్లో 89; 12 ఫోర్లు), మాథ్యూస్ నిలకడగా ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. ఈ దశలో జునైద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి చండిమాల్ అవుటయ్యాడు. కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్ ఆరో వికెట్‌కు ప్రసన్నతో కలిసి అజేయంగా 96 పరుగులు జోడించి రోజును ముగించాడు.