శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా శిఖర్ ధావన్ డకౌట్ కాగా రెండో వికెట్ రోహిత్ క్యాచ్ అవుటయ్యాడు. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ధావన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నౌటౌట్ ప్రకటించగా..లంక కెప్టెన్ పెరీరా రివ్యూ కోరాడు.