శ్రీలంకకు ఎదురు దెబ్బ
శ్రీలంకకు ఎదురు దెబ్బ
Published Thu, Jun 1 2017 6:03 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
లండన్: చాంపియన్స్ ట్రోఫి బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. శనివారం (జూన్ 3) జరిగే శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు మాథ్యూస్ అందుబాటులో ఉండని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో వైస్ కెప్టెన్ ఉపుల్ తరంగ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
గతంలో తొడ కండరాలు పట్టేయడంతో జింబాంబ్వే సిరీస్‌కు దూరమైన మాథ్యూస్ మళ్లీ అదే గాయం తిరగబెట్టడంతో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫి తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. మాథ్యూస్ చివరి వన్డే మ్యాచ్ శ్రీలంకలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడాడు. భారత్, సౌత్ ఆఫ్రికా, పాకిస్థాన్‌లతో శ్రీలంక గ్రూప్ బిలో ఉంది.
Advertisement
Advertisement