స్కోరు 2, వికెట్లు 2 | India loss first wicket | Sakshi
Sakshi News home page

స్కోరు 2, వికెట్లు 2

Published Sun, Dec 10 2017 11:59 AM | Last Updated on Sun, Dec 10 2017 12:22 PM

India loss first wicket - Sakshi

ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌ కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ డకౌట్‌ కాగా రెండో వికెట్‌ రోహిత్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. మాథ్యూస్‌ వేసిన రెండో ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. తొలుత అంపైర్‌ నౌటౌట్‌ ప్రకటించగా..లంక కెప్టెన్‌ పెరీరా రివ్యూ కోరాడు.

రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలకపోవడం, బంతి మిడిల్‌ స్టంప్‌వైపు దూసుకుపోవడంతో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించారు. దీంతో భారత్‌ పరుగులు చేయకుండానే వికెట్‌ కోల్పోయింది. అనంతరం రోహిత్‌.. లక్మల్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్‌ కూడా శ్రీలంక రివ్యూతో సాధించడం విశేషం.

పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుండటంతో లంక బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాట్స్‌మన్‌ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి ఐదు ఓవర్లు నాలుగు మేడిన్‌ కాగా భారత్‌ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement