టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది అగస్టులో అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు ధావన్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గబ్బర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కాగా ధావన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్(6769) రెండో స్ధానంలో ఉన్నాడు.
ఇక ఎన్‌పీఎల్ విషయానికి వస్తే.. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. కర్నాలీ యాక్స్‌తో పాటు బిరత్‌నగర్ కింగ్స్, చిత్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, ఖాట్మండు గూర్ఖాస్, లుంబినీ లయన్స్, పోఖరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్ మిగితా ఏడు జట్లగా ఉన్నాయి. ఈ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య
Comments
Please login to add a commentAdd a comment