వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేస్తున్న ప్రయోగాలపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. విండీస్‌తో రెండో వన్డేలో రోహిత్, విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చి ప్రయోగాలు చేసిన టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో భారత జట్టు మెనెజ్‌మెంట్ విఫలమైందని జోషి అన్నారు.
"విండీస్‌తో వన్డే సిరీస్‌లో యువ జట్టును ఆడించాలని సెలక్టర్లు భావించరా? అలా అయితే రోహిత్, కోహ్లి వంటి సీనియర్ ప్లేయర్స్‌ను ఎందుకు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు అర్హత సాధించని విండీస్‌పై సీనియర్ జట్టు ఎందుకు? ఆ విషయం పక్కన పెడితే.. యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది సరైన సిరీస్. సెలక్టర్లు తప్పు చేశారు. ఈ సిరీస్‌ను సెలక్టర్లు సరిగ్గా ఉపయోగించలేకపోయారు.
యువ జట్టును విండీస్‌కు పంపించి రుత్‌రాజ్ లేదా మరో ఆటగాడని కెప్టెన్‌గా నియమించాల్సింది. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని యువ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సింది. మరో యంగ్ కెప్టెన్ తయారు చేయడానికి కూడా ఇదే సరైన సమయమని" అయన పేర్కొన్నారు. అదే విధంగా వెటరన్ ఓపెనర్ ధావన్ గురించి జోషి మాట్లాడుతూ.. శిఖర్ ధావన్‌ను విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది.
వైట్‌బాల్ క్రికెట్‌లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ధావన్ భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అతడికి ఐసీసీ టోర్నీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. నేను జాతీయ సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న సమయంలో ధావన్‌ను ఎప్పుడూ బ్యాకప్ ఓపెనర్‌గా మద్దతు ఇచ్చేవాడని. ఈ క్రమంలో 2021లో శ్రీలంకలో పర్యటనలో భారత జట్టు పగ్గాలు అప్పగించామని" అయన పేర్కొన్నారు.
చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా
Comments
Please login to add a commentAdd a comment