PC: IN Side sport
ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న భారత్ మరో పోరుకు సిద్దమవుతోంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌కు టీమిండియా పయనమైంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు మాంచెస్టర్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు మంగళవారం చేరుకోనుంది. అదే విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బంది బుధవారం అక్కడికి చేరుకోనున్నారు.
ఇక వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో భారత జట్టు సారథిగా ధావన్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు కోహ్లి, బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఇక జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
— BCCI (@BCCI) July 18, 2022
Dressing room reactions & emotions after #TeamIndia's ODI series triumph against England at Manchester.👏 👏 - By @RajalArora
Watch this special feature 🎥 👇 #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు:
నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్
చదవండి: Ben Stokes: వన్డే క్రికెట్‌కు స్టోక్స్ గుడ్‌బై.. కారణాలు ఇవేనా..?
India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment