టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడగుపెట్టిన రిషబ్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన పంత్.. ఆ జట్టు తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ ఏడాది సీజన్‌లో ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పంత్‌కు టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో సైతం సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు.
ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైనమెట్.. వరల్డ్‌కప్‌నకు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిషబ్ పాల్గోనున్నాడు.
ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నాడు. తనను క్రికెటర్‌గా చూడాలన్న తన తండ్రి కలను నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల.
మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్‌ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ" పంత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment