కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మలింగ
టి20 ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు షాక్ తగిలింది. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు లసిత్ మలింగ బోర్డుకు లేఖ రాశాడు. మోకాలి గాయం కారణంగా అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేదీ లేనిదీ తెలియనందున, కెప్టెన్ విషయంలో స్పష్టత ఉండాలని భావించి మలింగ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచకప్‌లో శ్రీలంకకు మ్యాథ్యూస్ సారథిగా వ్యవహరించే అవకాశం ఉంది.