
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ గురించి పరిచయం అక్కర్లేదు. దశాబ్దన్నర పాటు క్రికెట్‌లో తన కళ్లు చెదిరే యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించిన యార్కర్ కింగ్ మళ్లీ యాక్టీవ్ అయ్యారు. సింగర్‌గా సరికొత్త అవతారం ఎత్తారు. సాంగ్ రైటర్‌గా ఇప్పటికే ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ స్పీడ్ స్టర్ ఈసారి మరో సాంగ్‌తో అభిమానుల ముందుకు వచ్చారు.
గతంలో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శ్రీలంక సింగర్‌లతో గొంతు కలిపారు. ఆయన పాడిన పాటలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. ఈ తరుణంలో తాజాగా ఓ సాంగ్‌ను పాడారు. ఇప్పుడా ఆ సాంగ్ సంగీత ప్రియుల్ని అలరిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట ఎలా ఉందో మీరూ వినేయండి.
From Slinga Malinga to Singer Malinga!
One of the all time greats, Lasith Malinga 😍🥰 pic.twitter.com/98sxoaAAoc— Dr. Jo (@ERDrJo) December 25, 2024