ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్‌ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు) ఉన్నారు.
స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్‌కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.
141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment