తెలుగమ్మాయి నిజాయితీ...! | Telugu Girl ... honest! | Sakshi
Sakshi News home page

తెలుగమ్మాయి నిజాయితీ...!

Published Fri, Mar 6 2015 10:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Telugu Girl ... honest!

సాక్షి, ముంబై: ఖరీదైన మొబైల్ దొరికిందని తీసుకెళ్లకుండా తిరిగి ఇచ్చిన తెలుగమ్మాయిని పోలీసులు అభినందించారు. వివరాల్లోకెళితే.. మాటుంగాలో నివాసం ఉన్న మానవ హక్కుల సంఘం సభ్యుడు సురేశ్‌కుమార్ కూతురు విశాల గురువారం మాహిలో కాలిబాటన వెళుతుండగా రూ.40 వేలు విలువ చేసే ఫోన్ దొరికింది. అందులో ఉన్న నంబరు ఆధారంగా యజమాని అశీశ్‌కు ఫోన్ చేసి, స్థానిక బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫోన్ తీసుకెళ్లాలని తెలిపింది.

ఫోన్ తీసుకున్న ఆశీశ్... ఆమె నిజాయితీకి మెచ్చి రూ.500 బహుమతిగా ఇచ్చాడు. ఆ నగదును విశాల స్వీకరించలేదు. ఆమె సంస్కారాన్ని, నిజాయితీని చూసి పోలీసులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement