ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి..  నగదు పోగొట్టుకున్న యువతి  | Woman Booked Mobile In Online, Lost 23 Thousands In Balanagar | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి..  నగదు పోగొట్టుకున్న యువతి 

Published Sat, Nov 6 2021 2:59 PM | Last Updated on Sat, Nov 6 2021 3:06 PM

Woman Booked Mobile In Online, Lost 23 Thousands In Balanagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బాలానగర్‌: ఆన్‌లైన్‌లో ఫోన్‌ను బుక్‌ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. బాలానగర్‌ డివిజన్‌ ఫిరోజ్‌గూడకు చెందిన మౌనిక (24) ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేసి నగదు చెల్లించింది. కాగా ఆ నగదు జమ అయినట్లుగా ఫోన్‌కు సమాచారం రాలేదు. దీంతో ఆన్‌లైన్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ గురించి సెర్చ్‌ చేస్తుండగా గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది.
చదవండి: కూకట్‌పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు

మెబిక్విక్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ వ్యాలెట్‌ను డౌన్‌లోడ్‌ చేసి అందులో నుంచి 5 రూపాయలు పంపిస్తే మీరు నగదు చెల్లించినట్లుగా మెసేజ్‌ వస్తుందని చెప్పారు. ఆమె గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగా  5 రూపాయలు పంపించింది. ఆమెకు ఓటీపీ వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఆమె అకౌంట్‌ నుంచి 23,154 రూపాయల నగదు డెబిట్‌ అయినట్లుగా మెసేజ్‌ వచ్చింది. ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా పని చేయడం లేదు. దీంతో మౌనిక బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ వాహిదుద్దీన్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement