balanagar
-
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి తరలిస్తుండగా కిందపడ్డ దరఖాస్తులు
-
హైదరాబాద్ బాలానగర్ లో అగ్నిప్రమాదం
-
బాలానగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. -
బాలానగర్‌లో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో మూడున్నర దశాబ్దాల అనుభవం కలిగిన రఘురామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో అద్బుతమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే బాలానగర్‌లో ఏ2ఏ లైఫ్ స్పేసెస్ అపార్ట్మెంట్, సెంటర్ మాల్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన సంస్థ.. తాజాగా ఏ2ఏ హోమ్ ల్యాండ్ ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. బాలానగర్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇదేనని కంపెనీ తెలిపింది. రఘురామ్ ఇన్ఫ్రా ఇప్పటివరకు 40 లక్షలకు పైగా చ.అ.లలో 38 పైగా ప్రాజెక్ట్‌లను నిర్మించింది. సుమారు 4 వేలకు పైగా కస్టమర్లున్నారు. ►ఫేజ్–1లో 12 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 7 బ్లాకులుంటాయి. మొత్తం 1,158 ఫ్లాట్లుంటాయి. అన్నీ త్రీ బీహెచ్‌కే ప్రీమియం ఫ్లాట్లే. 1,700 చ.అ. నుంచి 2,260 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. (ఈస్ట్ హైదరాబాద్ రయ్ రయ్! ఎందుకో తెలుసా?) ► ఈ ప్రాజెక్ట్‌లో 93 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు క్లబ్‌హౌస్‌లతో పాటు క్రచ్, ఇండోర్ గేమ్స్, లెర్నింగ్ సెంటర్, బిజినెస్ లాంజ్, గెస్ట్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, లైబ్రరీ, జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, యోగా సెంటర్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ► బాలానగర్ మెట్రో జంక్షన్, కూకట్పల్లి వై జంక్షన్లకు కూతవేటు దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రధాన నగరంలో ఉండటంతో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ వంటి వాటికి కొదవే లేదు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) మరిన్ని రియల్ ఎస్టేట్ వార్తలకు,బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షి బిజినెస్ -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో సూసైడ్ నోట్, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’ -
ఫార్మాలో భారత్ ‘విశ్వగురు’
బాలానగర్: ఫార్మసీ రంగంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం విశ్వగురువుగా కూడా మారిందని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి భగవత్ కూబా అన్నారు. శుక్రవారం బాలానగర్‌లోని నైపర్ 10వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల్లో పాలుపంచుకుని విజయం సాధించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా లాంటి కష్టకాలంలోనే మన ఫార్మసీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన నైపర్ కేవలం 16 సంవత్సరాల కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు, అభ్యాసానికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడటం మంచి పరిణామమన్నారు. ‘నా కెరీర్లో నాకెప్పుడూ గోల్డ్‌మెడల్ రాలేదు...కానీ నేను విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. లారస్ ల్యాబ్స్ చైర్మన్ చావా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మా రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారు. దేశ ఖ్యాతిని పెంచేలా విద్యార్థులు పనిచేయాలని కోరారు. అనంతరం స్నాతకోత్సవంలో 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 25 మంది పీహెచ్డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మ్), ఎంబీఏ(ఫార్మ్) విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డా.శశిబాలా సింగ్, డీన్ డా.ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ గణనాథం తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ బాలానగర్ లో దారుణం.. రూ.400 కోసం వ్యక్తి హత్య
-
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
Hyderabad: ఇద్దరు యువతుల అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: కిరాణాషాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. గురువారం సీఐ భాస్కర్ తెలిపిన మేరకు.. మహమ్మద్ కాజా పటేల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని చిన్న కుమార్తె సైదియా బేగం (20) ఈ నెల 15 సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు,స్నేహితుల ఇళ్లల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట సఫ్దార్‌నగర్‌లో అన్నీ బేగం తన కుమార్తెలతో కలిసి నివాసముంటోంది. పెద్ద కుమార్తె ముస్కాన్ ఇంటివద్దే ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున అన్నీ బేగం నిద్ర లేచేసరికి తన పెద్ద కుమార్తె ముష్కాన్ కనిపించలేదు. దీంతో కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
చదువుకునే సమయంలో రాజేష్‌తో ప్రేమ.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా..
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్‌లోని సాయినగర్‌కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు. అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్‌లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు.. -
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి
సాక్షి, బాలనగర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడిచేసిన ఓ యువకుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండి వాహుత్ దిన్ తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు బాలనగర్ లోని వినాయక్ నగర్ లో నివసిస్తున్నాడు. సొంతంగా వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆమెపై లైంగికదాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చదవండి: మహిళా ప్రొఫెసర్‌కు అశ్లీల వీడియోలు, అసభ్యకర మెసేజ్‌లు.. -
ఆలనాపాలనా చూడలేక..
బాలానగర్: బిడ్డ ఆలనా.. పాలనా చూడాల్సిన కన్న తల్లి చనిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కూతురిని పెంచడం భారంగా భావించి.. బాధ్యతలు విస్మరించిన ఆ తండ్రి చిన్నారిని నదిలోకి తోసేసి కడతేర్చిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూరారం గ్రామానికి చెందిన రావుల రాజుకు, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవల్లికి చెందిన మంజులతో వివాహమైంది. ఇద్దరూ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద కూతురు పూజ షాద్‌నగర్‌లో ఏడో తరగతి, చిన్న కూతురు రూప గ్రామంలోనే నాలుగో తరగతి చదువుతుండగా రాజు మధ్యలోనే వారి చదువు మాన్పించాడు. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తలు ఇంట్లో తరచూ గొడవ పడుతుండేవారు. చిన్నకూతురు స్నేహ పుట్టిన రెండు నెలలకే ఇంట్లో కింద పడి నడుము దెబ్బతినడంతో ఆరేళ్లు దాటినా ఇంకా నడవలేకపోతోంది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నడవలేని స్థితిలో ఉన్న స్నేహ తనకు భారంగా మారుతుందని భావించి.. మంగళవారం తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని తీసుకెళ్లి గ్రామ సమీపంలో ఉన్న దుందుభినదిలో తోసి వచ్చాడు. ఇంట్లో స్నేహ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారు రాజును నిలదీశారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో పాపను దుందుభినదిలో తోసి వేసినట్లు ఒప్పుకున్నాడు. జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా.. స్నేహ మృతదేహం తేలుతూ కనిపించింది. ఈ సంఘటనపై పాప బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లోని ఓ యువతితో ఆరు నెలల నుంచి వీరేందర్ (29) పరిచయం ఏర్పరుచుకొని పెళ్లి పేరుతో ఆమెను శారీరకంగా కలిసి పెళ్లి చేసుకోకుండా మోసగించాడు. చదవండి: (కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య!) వినాయక్‌నగర్‌లో ఉంటు వీరేందర్ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా వీరేందర్ మాటదాట వేస్తున్నాడు. పెళ్లి చేసుకోకుండా తనని వీరేందర్ మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి వీరేందర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు. చదవండి: (ప్రియురాల్ని స్నేహితులకు విందుగా మార్చిన ప్రియుడు..) -
‘అమ్మా ఫోన్ రిపేర్ చేయించుకుని వస్తా’..! యువతి అదృశ్యం..
బాలానగర్: మొబైల్ ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి రాని సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ ఎన్.డి.వాకింగ్ ఇన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్‌కు చెందిన ఎ.విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అతని కుమార్తె లావణ్య (20) ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ నెల 7న సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ రిపేర్ చేయించుకొని వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఐదేళ్ల పోరాటం: బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష! -
చీరకు నిప్పంటుకొని తొమ్మిది నెలల నిండు గర్భిణి మృతి
సాకక్షి, బాలానగర్: ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని ఓ గృహిణి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేసన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్‌లోని దాసరి బస్తీకి చెందిన శివరాణి, భర్త పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఈ నెల 7వ తేదీన భర్త ఊరికి వెళ్లగా 9 నెలల గర్భవతి అయిన శివరాణి తల్లిదండ్రులతో కలిసి ఉంది. చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె అదే రోజు ఉదయం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగి శివరాణి (23) కడుపు, కళ్లకు గాయాలయ్యాయి. కాలిన గాయాలతో ఉన్న ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్సీ ఆస్పత్రికి తరలించారు. గర్భంలో ఉన్న శిశువు మృతి చెందటంతో శివరాణికి ఆపరేషన్ చేస్తుండగా 23వ తేదీ ఉదయం ఆమె మృతి చెందింది. ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో? -
ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసి.. నగదు పోగొట్టుకున్న యువతి
సాక్షి, బాలానగర్: ఆన్లైన్లో ఫోన్‌ను బుక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. బాలానగర్ డివిజన్ ఫిరోజ్‌గూడకు చెందిన మౌనిక (24) ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 3న ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసి నగదు చెల్లించింది. కాగా ఆ నగదు జమ అయినట్లుగా ఫోన్‌కు సమాచారం రాలేదు. దీంతో ఆన్లైన్లో బజాజ్ ఫైనాన్స్ కస్టమర్ కేర్ నంబర్ గురించి సెర్చ్ చేస్తుండగా గుర్తు తెలియని నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. చదవండి: కూకట్పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు మెబిక్విక్ బజాజ్ ఫైనాన్స్ వ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసి అందులో నుంచి 5 రూపాయలు పంపిస్తే మీరు నగదు చెల్లించినట్లుగా మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆమె గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగా 5 రూపాయలు పంపించింది. ఆమెకు ఓటీపీ వచ్చింది. ఆ కొద్ది సేపటికే ఆమె అకౌంట్ నుంచి 23,154 రూపాయల నగదు డెబిట్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. ఆ నంబర్‌కు ఫోన్ చేయగా పని చేయడం లేదు. దీంతో మౌనిక బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎండీ వాహిదుద్దీన్ తెలిపారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పాలమూరు బుడ్డోడు
బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్ పురందాస్ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు
బాలానగర్: మరుగుదొడ్డిలో నివసిస్తున్న ఆ కుటుంబ కష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. సాక్షి కథనానికి స్పందించిన మానవతామూర్తులు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన సుజాతకు పక్కా ఇల్లు కట్టించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సుజాత భర్త ఆరేళ్ల కిందట మృతి చెందాడు. అయితే వారి ఇల్లు మూడేళ్ల కిందట కూలిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఇల్లు నిర్మించుకోవడం కష్టమవడంతో ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డిలోనే నివసిస్తున్నారు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు సుజాతతోపాటు తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి మరుగుదొడ్డిలో ఉంటున్నారు. వీరి కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన బంధువు రాఘవరెడ్డి, రత్నాకర్‌రెడ్డి ముందుకు వచ్చారు. తమ స్నేహితుల సహకారంతో సుజాతకు ఇల్లు కట్టించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన మోహన్‌నాయక్‌కు రూ.1.60 లక్షలు అందజేసి ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని వారు కోరారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
తిరుమలగిరి బాలానగర్‌లో బాత్రూమ్లో నివసిస్తున్న కుటుంబం.
-
టీవీ రీచార్జ్ : రూ. 1.18 లక్షలు హాంఫట్
బాలానగర్: బ్యాంకు అకౌంట్ల వివరాలు, పిన్ నెంబర్లు, పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పొద్దని ఎంత మొత్తుకుంటున్నా, వినియోగదారులు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బును క్షణాల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ ద్వారా టీవీ రీచార్జ్ చేసిన మహిళ రూ.1.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సంధ్య గత నెల 30న సన్ డైరెక్ట్ రీచార్జ్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. దీంతో ఆమె గూగూల్లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి కనిపించిన నంబర్‌కు ఫోన్ చేసింది. తమ సన్ డెరెక్ట్ రీచార్జ్ కావడం లేదని తెలుపగా టీమ్‌వీవర్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని చేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ రీచార్జ్ కావడం లేదని బాధితురాలు చెప్పగా మీ యూనో యాప్ పిన్ నెంబర్, పాస్వర్ట్ చెప్పండి, ఎలా చేయాలో చెబుతానని కోరగా ఆమె చెప్పడంతో ఐదు దఫాలుగా రూ. 1,18,000 ఆమె అకౌంట్లో నుంచి డెబిట్ అయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన మహిళ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏం ఐడియా రా బాబు.. వంటింటినే ల్యాబ్‌గా మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: బాలానగర్‌లో ఉన్న నివాస ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుధాకర్ అనే వ్యక్తి అందులో ఆల్ఫాజోలమ్ మాదకద్రవ్యం తయారు చేస్తున్నాడు. వంటింటినే ల్యాబ్‌గా మార్చి ఈ నిషేధిత డ్రగ్ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందాలు శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. సుధాకర్ సహా అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు 3.25 కేజీల మాదకద్రవ్యం, రూ.12.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి. తడవకు 5 కిలోల చొప్పున.. ► సుధాకర్ స్నేహితుడికి సాధారణ ఔషధాల తయారీకి సంబంధించిన లైసెన్స్ ఉంది. బాలానగర్‌కు చెందిన సుధాకర్‌తో కలిసి దీన్ని దుర్వినియోగం చేసిన ఇతగాడు తన కంపెనీ పేరుతో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లాస్క్, రియాక్టర్, డ్రయ్యర్ కొనుగోలు చేశాడు. వీటిని సుధాకర్ వంటింట్లో బిగించారు. ఆల్ఫాజోలమ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు వివిధ మార్గాల్లో సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని వినియోగించి ఒక్కో తడవకు 4 నుంచి 5 కేజీల ఆల్ఫాజోలమ్ తయారు చేస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ముఠాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు. ►ఇటీవలే 3.25 కేజీల డ్రగ్ ఉత్పత్తి చేసిన సుధాకర్ దాన్ని బెంగళూరుకు చెందిన నరేష్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. సరుకు తీసుకోవడానికి డబ్బు తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌కు రమ్మని సూచించాడు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ జోనల్ యూనిట్‌కు సమాచారం అందింది. అక్కడ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్ సబ్–జోనల్ యూనిట్ అధికారులూ హైదరాబాద్–మెదక్ రహదారిలోని గండి మైసమ్మ వద్ద ఉన్న ఉజ్వల గ్రాండ్ హోటల్ సమీపంలో కాపుకాశారు. ► సరుకు తీసుకుని ఓ కారులో వచ్చిన సుధాకర్‌తో పాటు మరో వ్యక్తిని, మరో కారులో వచ్చిన నరేష్ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే సుధాకర్ ఇంట్లో ఈ డ్రగ్ తయారవుతున్నట్లు వెలుగులోకి రావడంతో అక్కడా దాడి చేసి ఉపకరణాలు సీజ్ చేశారు. ఈ దందాను మరింత పెంచాలనే విస్తరించాలనే ఉద్దేశంతో సుధాకర్ ఇటీవలే తన పక్క ఇంటినీ అద్దెకు తీసుకున్నాడని, అందులో కొత్తగా రియాక్టర్, డ్రయ్యర్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటినీ సీజ్ చేసిన ఎన్సీబీ టీమ్ ఔషధాల తయారీ లైసెన్స్ కలిగిన సుధాకర్ స్నేహితుడినీ అరెస్టు చేసింది. బాలానగర్‌లోని ఇంటి కేంద్రంగా దాదాపు అయిదేళ్లుగా ఆల్ఫాజోలమ్ తయారీ చేస్తున్నట్లు తేల్చారు. -
దేశంలోనే మనది నెంబర్ వన్ సిటీ: కేటీఆర్
బాలానగర్: ‘దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎంసీహెచ్ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండేదని, జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్‌పూర్‌లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘మూసీ నదిని జీవనదిగా మార్చాలి. మన నగరాన్ని విశ్వనగరంగా మార్చాలి. ఇందుకు అందరూ సహకరించాలి’ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలు నాలాలు, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దని చెప్పారు. మనందరం కలిసి మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిద్దాం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని 9 చెరువులకు నిధులు మంజూరు చేశారని కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, శిరీష బాబురావు, సబిహా బేగం, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాలానగర్ వంతెనపై దారుణం