![Private Travels Bus Caught Fire At Balanagar Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/2/fireaccident4.jpg.webp?itok=IW_A7HW4)
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు.
క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment