private travel bus
-
బస్సులో వెళ్తుండగా గుండెపోటు.. కనికరించని డ్రైవర్, కండెక్టర్
సాక్షి, చైన్నె: బస్సులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఓ వంట మాస్టరు పట్ల ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ నిర్దయగా వ్యవహరించారు. మార్గం మధ్యలో ఆసుపత్రులు ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద బస్సు ఆపి దించేసి వెళ్లిపోయారు. దీంతో సకాలంలో చికిత్స అందక, సాయం చేసే వారు లేక రోడ్డుపైనే వంట మాస్టర్ గుండె ఆగింది. కాగా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు నల్ల కుట్రాలం ప్రాంతానికి చెందిన జ్యోతి భాస్కర్(55) వంట మాస్టర్, శంకరన్ కోయిల్‌లోని ఓ హోటల్లో పనిచేస్తాడు. రోజూ శ్రీవిళ్లిపుత్తూరు – శంకరన్ కోయిల్ మధ్య బస్సు ప్రయాణంతో విధులకు వెళ్లేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటిలాగే వేకువజామున ఇంటి నుంచి శంకరన్ కోయిల్‌కు తిరునల్వేలి వైపుగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ మార్గంలో చైన్నె వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం సహజం. కనికరం లేకుండా.. ఈ బస్సులో ప్రయాణించే సమయంలో మార్గం మధ్యలో రాజ పాళయం వద్దకు జ్యోతి భాస్కర్‌కు ఛాతినొప్పి రావడంతో తల్లడిల్లిపోయారు. సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉన్నా, డ్రైవర్, కండెక్టర్ మహేశ్, గోపాల్ కనికరించ లేదు. మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కనీసం ప్రథమచికిత్స కూడా అందించకుండా శంకరన్ కోయిల్‌కు వెళ్లకుండా క్రాస్ రోడ్డులో బస్సును ఆపేశారు. ఛాతి నొప్పితో తల్లడిల్లుతున్న వంట మాస్టర్‌ను బలవంతంగా బస్సు నుంచి దించేశారు. రోడ్డు పక్కగా ఉన్న ఓ టీ దుకాణం వద్ద కూర్చోబెట్టి బస్సును లాగించేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు పెద్దగా ఎవ్వరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. అయితే, బస్సులో ఉన్న ఓ యువకుడు ఎవరినో బలంతంగా కిందకు దించుతుండడాన్ని గుర్తించాడు. అయితే, అతడికి ఛాతినొప్పి విషయం తెలియనట్లుంది. చివరకు ఆ టీ కొట్టు వద్ద గుండె నొప్పితో కొట్టుకుని వంట మాస్టారు మరణించాడు. కాసేపటికి ఈ సమాచారం శంకరన్ కోయిల్ పరిసరాల్లో వ్యాపించింది. ఈ సమాచారం విన్న శంకరన్ కోయిల్ వరకు బస్సులో ప్రయాణించిన ఓ యువకుడి ద్వారా డ్రైవర్, కండెక్టర్ల దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కగా భాస్కర్‌ను వదిలి పెట్టి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, కండెక్టర్, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవత్వం మరిచిన ఈ ఇద్దరిన కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లా మేడిపి వద్ద రోడ్డు ప్రమాదం
కర్నూలు (టౌన్)/త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా మేడిపి వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు త్రిపురాంతకం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులో నుంచి మార్కాపురానికి చెందిన భీమిశెట్టి మానస, కడపకు చెందిన శివలక్ష్మి, మరో మహిళ అటుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కారు. కర్నూలు నుంచి మెప్మా ట్రైనింగ్ కోసం 22 మంది ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ట్రావెల్స్ బస్సు త్రిపురాంతకం మండలం మేడపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో మార్కాపురం చెందిన భీమిశెట్టి మానస (22) అక్కడికక్కడే మృతిచెందగా, అదే ట్రావెల్స్ బస్సు రెండో డ్రైవర్ రాజేష్ రెండు కాళ్లు విరిగాయి. ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన బి. శానవ్, స్రవంతి, వెంకటేశ్వరమ్మ, హేమలతారెడ్డి, రామలక్ష్మి, షఫీ ఉన్నీస, జ్యోతి, శివగంగ, మరో ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్‌ల్లో పల్నాడు జిల్లా వినుకొండ, గుంటూరుకు మెరుగైన వైద్య సేవల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్, ఆర్ధ్రో అమరనాథ్, ఎంవీఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరామర్శించిన మెప్మా సిటీ మేనేజర్ ప్రమాదం విషయం తెలియగానే కర్నూలు మెప్మా ఆఫీసుకు చెందిన సిటీ మేనేజర్ మురళీ, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో కలిసి హుటాహుటిన వినుకొండకు బయలు దేరారు. పీడీ నాగశివలీల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన రీసోర్స్ పర్సన్లు, టీఎల్ఎఫ్ ఆఫీస్ బేరర్లు, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులను ఆయన పరామర్శించారు. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
విశాఖపట్నం: జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. డ్రైవరు అతి వేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం నుంచి గుంటూరు వెళ్తున్న సాయికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలలో బస్సు ఎక్కారు. బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నక్కపల్లి దాటిన తర్వాత కిలోమీటరు దూరంలో మనబానవానిపాలెం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న విజయవాడ సమీపంలో గొల్లపూడి గ్రామానికి చెందిన బైపాన రమేష్ (35) బస్సులోనే చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో ఆయన భార్య బైపాన కుమారి, కుమారుడు మోక్షిత్ (ఆరు నెలలు)తోపాటు 14మంది గాయపడ్డారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న రమేష్ సీట్లో ఇరుక్కొని అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం వారి ప్రాంతాలకు పంపించారు. ఆరు నెలల మోక్షిత్æ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. సంఘటన స్థలాన్ని నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, నక్కపల్లి సీఐ అప్పన్న పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలివి.. గొర్ల బలరామం (దేవరపల్లి, బొబ్బిలి), ఎ.గణే‹Ùకుమార్ (పార్వతీపురం), ఎస్.వెంకటవరప్రసాద్ (బొబ్బిలి), చిలకంట నరేంద్ర (బెంగళూరు), చంద్ర (బెంగళూరు), అల్లు శాంతారాం (పార్వతీపురం), గొల్ల శిరీష (పార్వతీపురం), ముప్పాల వర్షిత (బొబ్బిలి), మున్నం దేముడమ్మ (పెందుర్తి), ఆకోటి ధరణి (సాలూరు) అల్లు సావత్రిమ్మ (పార్వతీపురం), పి.కోటేశ్వరమ్మ (పార్వతీపురం) -
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు. -
బాలానగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. -
కావేరి ట్రావెల్స్ బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం
-
జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం
చిట్యాల: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలిపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. -
బస్సులో పొగలు, కిటికీలో నుంచి దూకేశారు..
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఎస్వీకేడీటీ (SVKDT ) ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి విజయవాడకు వస్తున్న బస్సు ప్రసాదంపాడులోని ఎస్వీఆర్ సెంటర్‌కు వచ్చేసరికి బస్సు టైర్ పగిలింది. టైర్ పగిలిన ధాటికి ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ఏమి జరిగిందో తెలియక అయోమయంలో బస్సు కిటికీ నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే బస్సు టైర్ పగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సిటీ బస్సును ఢీకొన్న మినీ వ్యాన్ మరోవైపు గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సిటీ బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
నల్లగొండ క్రైం: నల్లగొండ సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపాడు. అనంతరం బస్సు ఇంజెన్ వైర్ల షార్ట్ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు యత్నించాడు. ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా వస్తుండటంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక అధికారులు మంటలను చల్లార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్టీఎస్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (ఏఆర్ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్టీఎస్ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు. బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు. -
ఎల్"బీపీ".. నగర్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జంక్షన్ జనసంద్రంగా మారుతోంది. ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు.. ఇంకోవైపు ఇతర వాహనాలతో ఈ చౌరస్తా కిక్కిరిసిపోతోంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతిరోజు 800–900 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.ఇవికాకుండా మరో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ ప్రాంతమంతా రద్దీగా మారుతోంది. రోజూ సుమారు 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు 150, ఆంధ్రప్రదేశ్ బస్సులు 350, ప్రైవేట్ బస్సులు 400, కార్లు సహా ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వరుస సెలవులు వస్తే చాలు... ఇక్కడ నిల్చొనేందుకు కూడా చోటు దొరకడం లేదు. బస్సు ఆగేదెలా? ఈ చౌరస్తా నుంచి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా... వాటిని నిలిపేందుకు స్థలం కరువైంది. అధికారులు ఎక్కడా బస్‌బేలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే బస్సులను నిలపాల్సి వస్తోంది. ఇక ఇతర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ఇక్కడ అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణంతో రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. విస్తరణేదీ? ఎల్బీనగర్ నాలుగు రహదారులకు జంక్షన్. ఉప్పల్, బెంగళూర్ హైవే, సాగర్ రింగ్‌రోడ్డు, నగరానికి వెళ్లాలన్న ఈ చౌరస్తా దాటాల్సిందే. ఓవైపు రోడ్ల పనులు జరుగుతుండడం, మరోవైపు జంక్షన్ విస్తరించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు కనీసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్లపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోజూ గొడవలే.. ట్రాఫిక్ సమస్యతో ఈ రూట్లో రోజూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఒక్కోసారి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ఇతర వాహనదారులతో ఘర్షణలకు సైతం దిగుతున్నారు. పక్కపక్కనుంచే వాహనాలు వెళ్లాల్సి రావడం, ఒక దానికి మరోటి వాహనం తగులుతుండడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆగుతుందో? ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బస్సులు ఎక్కడ ఆగేది తెలియడంల లేదు. బస్సు వచ్చిందంటే చాలు అది ఎక్కడికి పోతుందోనని ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బస్టాప్ అనేది లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. – కుమార్, ప్రయాణికుడు రోజూ జంక్షన్ జామ్ ఇలా... బస్సులు 800-900 కార్లు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణికులు 2లక్షలు -
బస్సు బోల్తా, 25 మంది టురిస్ట్లకు గాయాలు
-
విజయనగరంలో బస్సు బోల్తా
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందినవారు కాశీయాత్ర ముంగించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. తోటపల్లి ఎడవకాలువ వద్దకు రాగానే వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 20 మంది యాత్రికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాజువాకకు చెందిన గౌరీశంకర్ ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదానికి గురైంది. ఆళ్ళగడ్డలో ఘోర రోడ్డుప్రమాదం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు విహారయాత్ర చేపడుతుండగా తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
పండుగ దోపిడీ!
సంక్రాంతి పండుగ అంటే ప్రైవేట్ ట్రావె ల్స్‌కు పండుగ. ఆర్టీసీకి ఆదాయం మెండుగ అన్నట్లు మారింది.పండుగ సందర్భంగా పది రోజులు సెలవులు దొరకడంతో అందరూ ఊరికి పయనమవ్వాలని ఉత్సాహం చూపుతన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దోపిడీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ కావడం, సీట్లుదొరక్క.. అడిగినంత ఇవ్వకతప్పడం లేదు. సాక్షి కడప :తెలుగువారి పెద్ద పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలనుంచి జిల్లా వాసులు తమ సొంతూళ్లకు రానున్నారు. వీరిని దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ రంగం సిద్ధం చేసుకున్నాయి. సాధారణ బస్సులను ప్రత్యేక సర్వీసుల పేరుతో టిక్కెట్ ధరపై అదనంగా 50శాతం వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రద్దీ, సమయాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ టిక్కెట్ ధరను రెండు నుంచి మూడు రెట్లు పెంచాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులే అధికం.. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రంలోనివిజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖతోపాటు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా దాదాపు 25వేలమంది ఉంటారు. పలు ప్రొఫెసనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు 5వేలమంది ఉన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పుణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు మరో పదివేలమంది, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పది వేలు, జిల్లాలో ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం, ఇతర పనుల నిమిత్తం వెళ్లి నిరుద్యోగులు, కూలీలు మరో 10వేలమంది ఉండొచ్చని అంచనా వీరంతా పండుగకు తమ సొంతూళ్లకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముందు జాగ్రత్త, ప్రణాళికతో సిద్ధమైన 30శాతం మందికి మాత్రమే టిక్కెట్లు దొరికాయి. మిగిలిన వారిలో 10 శాతం రైలులో వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మిగిలిన 60 శాతంలో 10శాతం మంది ప్రత్యేక వాహనాల్లో రావడానికి సన్నద్ధమయ్యారు. 50శాతం మంది చేతి చమురును వదిలించుకుంటేనే టిక్కెట్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. రెండింతలు అధికంగా చెల్లిస్తేనే ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్లను అందిస్తున్నారు. టిక్కెట్లు దొరకడం గగనం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11వ తేదీనుంచి 17 వరకు ఇదే పరిస్థితి. రూ.500తో చేయాల్సిన ప్రయాణానికి రూ.1000 నుంచి రూ.1300 వరకు వెచ్చించాల్సిందే! అయినా సీట్లు దొరకడం గగనంగా మారింది. దీంతో దూర ప్రాంత ప్రయాణికుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ పలు బస్సులను తిప్పేందుకు సిద్ధమైనా...లోకల్‌గా బస్సుల సమస్య ఏర్పడనుంది. ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ.. ప్రైవేట్ ట్రావెల్స్ వారు రెండు రెట్లు పెంచి దోపిడీకి తెర తీసినా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికే ప్రైవేట్ బస్సు వెబ్సైట్లలోనూ ధరలను పెంచి చూపిస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో కనీసం 70శాతం, ఏసీ బస్సుల్లో 100శాతం మేర ధరలు పెంచారు. ప్రైవేట్‌కు తోడు ఆర్టీసీ సైతం ఎక్స్‌ప్రెస్ సాధారణ సర్వీస్‌లను ప్రత్యేక సర్వీస్‌లుగా మార్చి సంక్రాంతి దోపిడీకి సిద్ధమైంది. రైళ్లలో ప్రయాణం కష్టమే.. జిల్లా మీదుగా హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి దాదాపు 30రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటిన్నింటిలోనూ ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. యువకులు, విద్యార్థులు జనరల్ బోగీల్లో ప్రయాణించినా, చిన్నారులు, మహిళలు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించాలంటే అగచాట్లు తప్పవు. జిల్లాకు సమీపంలో ఉండే గిద్దలూరుకు వచ్చే రైళ్లలోనూ ప్రయాణికులు భారీగా వస్తారు. దాదాపు 20వేలమంది తమ గమ్యస్థానం చేరతారని అంచనా. విమానాల్లోనూ రద్దీ దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు కడప ఎయిర్‌పోర్టు మీదుగా నడిచే విమానాలు రద్దీగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి మరింత రద్దీగా కనిపించే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ట్రూ జెట్ సంస్థ ప్రయాణికులకు టిక్కెట్ రాయితీలో ఆఫర్లు ఇచ్చి...మార్చి వరకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికే ఎక్కువ మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కడప మీదుగా నడిచే విజయవాడ, హైదరాబాదు, చెన్నై విమాన సర్వీసులు కూడా రద్దీగానే సాగిపోతున్నాయి. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం సంక్రాంతి పండుగకు కడపజోన్ పరిధిలోని వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశాం. జనవరి 11 నుంచి 14వ తేది వరకు 500 బస్సులు తిరుగుతాయి. హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. 15వ తేది నుంచి 21వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే వాటిని పెంచాలని ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ కేవీఆర్కే ప్రసాద్ తెలిపారు. -
ప్రైవేటు బస్సు నుంచి పోగలు
-
బస్సులో రూ.కోటి నగదు స్వాధీనం
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు 31 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలు దేరింది. ప్రయాణికులు భోజనం చేసేందుకు రాత్రి 11:30 ప్రాంతంలో చిట్యాల శివారులోని ఓ హోటల్ వద్ద ఆపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూళ్లూరుపేటకు చెందిన కూన ప్రభాకర్ తన యజమాని అయ్యప్పరెడ్డికి చెందిన సుమారు రూ.17 లక్షల నగదును తీసుకుని ప్రయాణిస్తున్నాడు. భోజనానికి దిగి వచ్చేసరికి నగదు బ్యాగు కనిపించకపోవడంతో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. చిట్యాల పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకువెళుతున్న కోటీ మూడు లక్షల ఎనబై వేల రూపాయలున్న నగదు బాక్స్ లభ్యమైంది. జగ్గయ్యపేటలో జ్యువెలరీ షాపు నిర్వహించే రాయపూడి రాజశేఖర్‌కు చెందిన నగదును తాను వ్యాపార నిమిత్తం చెన్నైకు తీసుకువెళుతున్నట్లు ప్రయాణికుడు సోమశేఖర్ తెలిపారు. దీంతో తగిన ధ్రువీకరణ పత్రాలు లేవని పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ.17 లక్షల నగదు బ్యాగ్ మాత్రం దొరకలేదు. -
ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం
- డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన పెళ్లి బృందం - షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం! - విశాఖ జిల్లాలో ఘటన కశింకోట (అనకాపల్లి): విశాఖ జిల్లా కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద శనివారం ప్రైవేటు ట్రావెల్ బస్సు కాలిపోయింది. కారు, బస్సు డ్రైవర్ల అప్రమత్తతతో 52 మంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నష్టం సుమారు రూ.కోటికి పైగా ఉంటుదని అంచనా. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బంధు మిత్రులు అనకాపల్లిలో జరిగే వివాహానికి వెళ్లేందుకు కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్కానియా బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద అమలోద్భవి హోటల్ సమీపానికి వచ్చేసరికి షార్టు సర్క్యూట్ వల్ల బస్సు వెనుక ఉన్న ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని అదే మార్గంలో వస్తున్న ఓ కారు డ్రైవర్ గుర్తించారు. బస్సు డ్రైవర్ కనకాల శ్రీనుకు విషయాన్ని తెలిపి అప్రమత్తం చేశాడు. దీంతో బస్సును నిలిపి తమ వద్ద ఉన్న ఫైర్ డిస్టింగ్ ఫిషర్‌తో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి దింపి వేశారు. దీంతో వారు సురక్షితంగా బయట పడ్డారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు దాదాపు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం వల్ల సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీఐ రామచంద్రరావు, ఎస్ఐ బి.మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాలిపోయిన బస్సును క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు. -
మంటలు చెలరేగి బస్సు దగ్ధం
-
మంటలు చెలరేగి బస్సు దగ్ధం
హైదరాబాద్: మంటలు చేలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని కుకట్పల్లి ఐడీఎల్ వద్ద ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బస్సుకు ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా.. లేక మరేదైనా కారణాలతో జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపించారు. -
తప్పిన పెను ముప్పు
కశింకోట : ఉగ్గినపాలెం వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆదివారం క్రేన్లతో వెలికి తీశారు. ఈ బస్సు ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి ఇక్కడ మదుంపై నుంచి రక్షణ గోడను ఢీకొని పంట కాలువలోకి దూసుకుపోయి ఆగింది. ఇది బోల్తా పడినా, టిప్పర్‌ను ఢీకొట్టినా పెద్ద ఎత్తున ప్రాణ హాని జరిగేదని స్థానికులు తెలిపారు. బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేరే బస్సులో పంపించారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగి ఉంటుందని భావించారు. గాయపడిన బస్సు డ్రైవర్ రాంబాబు అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బస్సు ముందు భాగం దెబ్బతింది. అధిక వేగంతోనే అనర్థాలు జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సులు మితిమీరిన వేగంతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు విశాఖ నుంచి ఎక్కువగా రాత్రి వేళ బస్సులను నడుపుతున్నారు. ట్రావెల్ బస్సుల మధ్య పోటీ వల్ల త్వరగా గమ్యానికి చేరుకోవ డానికి అతి వేగంగా బస్సులను నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారు. రాత్రి వేళ ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉండటంతో అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారు. దీనివల్ల జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహన చోదకులు, పాదచారులకు భద్రత ఉండటం లేదు. ప్రైవేటు వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రాత్రి వేళ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు.