ప్రకాశం జిల్లా మేడిపి వద్ద రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లా మేడిపి వద్ద రోడ్డు ప్రమాదం

Published Thu, Sep 21 2023 1:58 AM | Last Updated on Thu, Sep 21 2023 10:50 AM

- - Sakshi

కర్నూలు (టౌన్‌)/త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా మేడిపి వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రైవేటు ట్రావెల్‌ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు త్రిపురాంతకం బైపాస్‌ ఫ్లైఓవర్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులో నుంచి మార్కాపురానికి చెందిన భీమిశెట్టి మానస, కడపకు చెందిన శివలక్ష్మి, మరో మహిళ అటుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఎక్కారు. కర్నూలు నుంచి మెప్మా ట్రైనింగ్‌ కోసం 22 మంది ఆ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ట్రావెల్స్‌ బస్సు త్రిపురాంతకం మండలం మేడపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని అదుపు తప్పి ఢీకొంది.

ఈ ఘటనలో మార్కాపురం చెందిన భీమిశెట్టి మానస (22) అక్కడికక్కడే మృతిచెందగా, అదే ట్రావెల్స్‌ బస్సు రెండో డ్రైవర్‌ రాజేష్‌ రెండు కాళ్లు విరిగాయి. ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన బి. శానవ్‌, స్రవంతి, వెంకటేశ్వరమ్మ, హేమలతారెడ్డి, రామలక్ష్మి, షఫీ ఉన్నీస, జ్యోతి, శివగంగ, మరో ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుమన్‌ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్‌ల్లో పల్నాడు జిల్లా వినుకొండ, గుంటూరుకు మెరుగైన వైద్య సేవల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్‌, ఆర్ధ్రో అమరనాథ్‌, ఎంవీఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

పరామర్శించిన మెప్మా సిటీ మేనేజర్‌
ప్రమాదం విషయం తెలియగానే కర్నూలు మెప్మా ఆఫీసుకు చెందిన సిటీ మేనేజర్‌ మురళీ, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో కలిసి హుటాహుటిన వినుకొండకు బయలు దేరారు. పీడీ నాగశివలీల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన రీసోర్స్‌ పర్సన్లు, టీఎల్‌ఎఫ్‌ ఆఫీస్‌ బేరర్లు, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులను ఆయన పరామర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement