Kurnool District News
-
క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): క్షేత్ర ప్రదర్శనలతో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆచార్యా ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ తెలిపారు. సోమవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో ఏరువాక కేంద్రం జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఎం.జాన్షన్ అధ్యక్షతన నిర్వహించారు. యూనివర్సిటీ విస్తరణ సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు అందజేశారు. శనగలో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ద్వారా విడుదలైన ఎన్‌బీఈజీ 857, 1267 రకాలతో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు కలుపు మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్షన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా రైతులకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని గత ఏడాది ఆగస్టు 1 నుంచి కర్నూలుకు తరలించామన్నారు. మొక్కజొన్నలో కెమికల్ వినియోగం పెరిగిపోయిందని, వచ్చే ఏడాది వీటిని తగ్గించి జీవన ఎరువుల వాడకాన్ని పెంచుతామన్నారు. సమావేశంలో ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ డాక్టర్ సుజాతమ్మ, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, ఆత్మ డీపీడీ శ్రీలత, ఏడీఏ వెంకటేశ్వర్లు, సమన్వయ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
గురుకులం పిలుస్తోంది!
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. స్కూల్స్‌లో ప్రవేశం పొందితే ఉచిత విద్యతో పాటు నాలుగు జతల యూనిఫాం, షూస్, ప్లేట్, గ్లాసు, ట్రంక్ బాక్సు, పెన్నులు, పెన్సిల్స్, పుస్తకాలు, టవల్స్, బెడ్‌షీట్స్, మంచాలు అందిస్తారు. అలాగే విద్యార్థులకు గేమ్స్‌లో అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. డైట్ ప్రకారం ఆహారం అందిస్తారు. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 6 ఆఖరు స్కూళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. కర్నూలు జిల్లా బాలికల: దిన్నెదేవరపాడు, ఆదోని, కంబాలపాడు, వెల్దుర్తి, పత్తికొండ. బాలుర: సి.బెళగల్, అరికెర, చిన్నటేకూరు. నంద్యాల జిల్లా బాలికల: లక్ష్మీపురం, ఆళ్లగడ్డ రెగ్యులర్, ఆళ్లగడ్డ ఆర్పీఆర్పీ, కోవెలకుంట్ల, డోన్ బాలుర: జూపాడుబంగ్లా, డోన్(ఆర్ ) -
నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్ఎస్(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సెల్)లో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదకి(పీజీఆర్ఎస్)ను నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్లో ఉన్న కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● కృష్ణగిరి మండలం మాదాపురం పరిధిలో 43.23 ఎకరాలను 13 మంది మాదిగలకు కేటాయించారని, ఆ భూములను కొందరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కలెక్టర్‌ను కోరారు ● కర్నూలు ఎస్ఆర్ నగర్‌లోని మాస్టర్ జూనియర్ కాలేజీ నుంచి వెలువడే వ్యర్థాల బారి నుంచి కాలనీని కాపాడాలని కోరుతూ ఎస్ఆర్ నగర్ వెల్ఫేర అసోసియేషన్ నాయకులు విన్నవించారు. నాటుసారా నిర్మూలనకు ‘నవోదయం’ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కోసం చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నవోదయం 2.0 పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా నాటుసారా కాస్తే టోల్ ఫ్రీ నంబర్ 14405కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ఇంద్రకరణతేజ, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా -
శాస్త్రోక్తంగా సెల్వర్ కుత్తు ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సెల్వార్ కుత్తు ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం నుంచి అహోబిలేశుడి వివాహ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిత్య పూజల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి దేవాలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సెల్వర్ కుత్తు ఉత్సవం నిర్వహించారు. -
ఎస్టీ రిజర్వేషన్ కోసం వాల్మీకుల పోరాటం
కర్నూలు(సెంట్రల్): వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని వీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. సోమవారం వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలిపేలా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ నాయకులు.. వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వాలే ఉండటంతో ఎస్టీ రిజర్వేషన్ సాధన సులభతరం అవుతుందన్నారు. వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. వాల్మీకుల ఆశలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు కాశీం నాయుడు, మురళీ నాయుడు, రాఘవేంద్ర పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా -
నాణ్యత నగు‘బాట’
కూటమి ప్రభుత్వంలో చేపట్టిన పనుల నాణ్యత మున్నాళ్ల ముచ్చటగా మారింది. గతేడాది డిసెంబర్లో ప్రధాన రహదారులకు నామమాత్రంగా మరమ్మతులు చేశారు. మూడు నెలలు తిరగక ముందే రహదారులు యథాస్థితికి వచ్చాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెల్దుర్తి నుంచి కృష్ణగిరి మీదుగా ఆగవేళి వరకు వేసిన ప్యాచ్‌లు లేచిపోయి గుంతలుగా మారాయి. ప్రజాధనం ఇలా వృథా చేయడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని ప్రజలు చర్చించుకుంటున్నారు. – కృష్ణగిరి -
మంచి, చెడు స్పర్శపై అవగాహన
కర్నూలు(హాస్పిటల్): మంచి, చెడు స్పర్శపై బాలికలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ తెలిపారు. లైంగిక దాడుల నివారణపై సోమవారం కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్, విద్య, వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శాంతికళ మాట్లాడుతూ.. బాల్యవిహాలు చేసినా, బాలికలను లైంగికంగా వేధించినా 1098, 100, 181 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిల్లలు లైంగికదాడులకు గురైనప్పుడు ఆందోళనకు గురవుతారని, వారిని గుర్తించి ఎలా కౌన్సిలింగ్ చేయాలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చైతన్య వివరించారు. ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ శైలేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమంతో పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వైద్యం అందిస్తారన్నారు. డీపీఎంఓ డాక్టర్ ఉమ, డైస్ మేనేజర్ ఇర్ఫాన్, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆర్బీఎస్కే కన్సల్టెంట్ మల్లికార్జున పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య ఎమ్మిగనూరురూరల్: పిల్లలు కాలేదని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఉప్పర సందీప్(25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కొండవీటి ప్రాంతానికి చెందిన కుమారుడు ఉప్పర సందీప్(25)కు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ ప్రాంతానికి చెందిన మానసతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సందీప్ హోటల్ వ్యాపారం చూసుకునే వాడు. హోటల్ సరిగా నడవకపోవటంతో రెండు నెలల నుంచి మూసివేసి వేరే పనికి వెళ్లేవాడు. ఆర్థిక ఇబ్బందులు, రెండు సంవత్సరాలు కావస్తు న్నా పిల్లలు పుట్టకపోవటంతో తీవ్ర మనస్తానికి గురయ్యాడు. ఆదివారం ఇంటి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు బద్దకొట్టి సందీప్‌ను కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సందీప్ భార్య మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఏఎస్ఐ క్రిష్టప్ప తెలిపారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం తుగ్గలి: లింగనేనిదొడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించిన గ్యాంగ్ మెన్లు డోన్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే కానిస్టేబుల్ నరసింహ ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి ఆచూకీపై ఆరా తీశారు. మొహంపై తీవ్రగాయాలై మృతి చెందాడు. రైలులో నుంచి జారి పడ్డాడా, మరేదైనా కారణమా అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు చిరునామా మేరకు ఒడిశా రాష్ట్రం రాజ్‌గంగపూర్ కిషన్పాడకు చెందిన రటియా బాడెక్(33)గా గుర్తించారు. సెంట్రింగ్ కూలీ నిమిత్తం గదగ్ వెళుతున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. మృతుడు జనరల్ టికెట్‌పై ప్రయాణిస్తున్నారని తోటి ప్రయాణికుడి వద్ద టికెట్ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. -
సమస్తం నిర్లక్ష్యం.. అంతటా వైఫల్యం
శ్రీగిరిలో జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవస్థాన యంత్రాంగం వైఫల్యం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్సవాల విజయవంతానికి మూడు నెలల ముందు నుంచే సమీక్షలు, సమావేశాలు అంటూ హడావుడి చేసిన అధికారులు చివరకు భక్తులకు సౌకర్యాల కల్పనలో చేతులెత్తేశారు. శ్రీశైల క్షేత్రంలో గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. 11 రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం దర్శనమిచ్చింది. భక్తులను అతిథులుగా భావించి సౌక ర్యాలు కల్పిస్తామని చెప్పి చివరకు కష్టాల పాలు జేశా రు. మరో వైపు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. దాదాపు 6.5 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించిన అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటికై న దేవస్థాన అధికారులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చోటుచేసుకున్న లోపాలపై సమీక్షించుకుని, ఈ నెలాఖరులో జరిగే ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని భక్తులు కోరుతున్నారు. – శ్రీశైలంటెంపుల్ మల్లన్న భక్తుల కష్టాలు ఇలా.. ● చంద్రావతి కల్యాణ మండపంలో శివదీక్ష భక్తులకు అల్పాహారం, తాగునీరు అందించడంలో అధికారులు విఫలమయ్యారు. క్యూలైన్ ఏర్పాటులో నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ● జ్యోతిర్ముడి సమర్పించే క్రమంలో అర్చకులు శివదీక్ష రూ.100 ముక్కుపిండి వసూలు చేశారు. ● నందిమండపం, గంగాధర మండపం, సాక్షిగణపతి ఆలయాల వద్ద కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10 వసూలు చేశారు. ● తలనీలాలు సమర్పించిన భక్తుల నుంచి టికెట్టు కాకుండా వంద రూపాయాలు అదనంగా వసూలు చేశారు. ● శ్రీశైలంలో లీటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించడంతో లీటర్ నీళ్ల సీసా రూ.60 వెచ్చించాల్సి వచ్చింది. ● కొన్ని ఆర్టీసీ బస్సులు అధిక చార్జీల పేరుతో అదనంగా వసూలు చేశారు. ● పలు హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలపై ఇష్టానుసారంగా ధరలను పెంచి భక్తులను దోచుకున్నారు. ● ఫోన్ సిగ్నల్ సమస్య భక్తులకు వేధించింది. నెట్వర్క్ పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ● క్షేత్ర పరిధిలో ‘మే ఐ హెల్ప్ యూ’ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినటప్పటికీ అక్కడ సిబ్బంది లేకపోవడంతో అవి నామమాత్రంగా పని చేశాయి. ● సమాచార బోర్డులు సైతం తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో భక్తులు తికమక పడ్డారు. ● దర్శన కంపార్ట్మెంట్లలో అధికసంఖ్యలో ఫ్యాన్లు లేకపోవడం, భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు లేకపోవడం, రేకులషెడ్డు కావడంతో గంటల తరబడి ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ● లగేజ్ భద్రపరిచేందుకు నిర్ణీత రుసుం కంటే అధికంగా వసూలు చేశారు. ఉచిత ప్రసాదం చిక్కిపోయింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు నాలుగు రోజుల్లో దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం అందజేస్తామని మంత్రులు గొప్పలు చెప్పారు. సాధారణంగా దేవస్థానం భక్తులకు 100 గ్రాములు లడ్డూ రూ.20కు విక్రయిస్తారు. అదే పరిమాణం ఉన్న లడ్డూను ఉచితంగా ఇస్తారని భక్తులు భావించారు. అయితే 50 గ్రాముల లడ్డూను మాత్రమే ఉచితంగా అందజేశారు. సాధారణ రోజుల్లో స్వామి ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, 20 గ్రాముల లడ్డూ, గుగ్గులు, పొంగలి ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి భక్తులకు ఉచితంగా అందజేస్తారు. అయితే బ్రహ్మోత్సవాల్లో వంద గ్రాముల లడ్డూ ఉచితంగా పంపిణీ చేసి బాగుండేదని పలువురు భక్తులు చర్చించుకున్నారు. పేలవంగా కళా ప్రదర్శనలు.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్ర పరిధిలో మూడు చోట్ల పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అవి భక్తులను అలరించలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో సినీ ప్రముఖులు, నేపథ్య గాయకులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నామమాత్రంగానే జరిగాయనే విమర్శలు ఉన్నాయి. అలాగే మొదటి రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను సకాలంలో మీడియాకు సైతం అందించలేకపోవడం గమనార్హం. పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించారనే విమర్శలు ఉన్నాయి. పరమ పవిత్ర కార్యక్రమమైన పాగాలంకరణ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం సమయంలో అధ్యాత్మికతో భక్తులు శివనామస్మరణ చేసే సమయంలో, దేవదాయశాఖ ఆర్జేసీ ప్రభుత్వ పథకాల గురించి వివరించడం అనేక విమర్శలు దారితీసింది. బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లలో నిర్లక్ష్యం, పాగాలంకరణ సమయంలో పేలవంగా ప్రవచనాలు వినిపించడం, తదితర విషయాలపై శివరాత్రి అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అధికారులతో సమావేశమై హెచ్చరించినట్లు సమాచారం. కొరవడిన సమన్వయం దేవస్థానం అధికారులు, ఉత్సవాల విధులకు వచ్చిన అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం రోజున బందోబస్త్‌కు వచ్చిన పోలీసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనాలు చేసుకునేందుకు ఆరాటపడ్డారు. బ్రహ్మోత్సవాల కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను, దేవస్థాన సిబ్బందిని సైతం అడ్డుకుని అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. దేవస్థాన అధికారులుకు, పోలీసుల మధ్య సమన్వయం లేక గేట్లు తెరవడంతో పాగాలంకరణ అనంతరం దర్శనానికి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే దంపతులు భక్తుల రద్దీతో ఇబ్బందులు పడ్డారు. బ్రహ్మోత్సవాల ముందు రోజు దేవస్థానం అధికారులు, ఏసీఎస్పీడీసీఎల్ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యుత్లైన్లు మారుస్తున్న కార్మికుడు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. అలాగే బ్రహ్మోత్సవాల్లో డ్యాం దిగువన సున్నిపెంటలోని పాతాళగంగలో పుణ్యస్నానికి వెళ్లి తండ్రి, కుమారుడు మృత్యువాత పడ్డారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా మల్లన్న భక్తుల నిలువు దోపిడీ అసౌకర్యాల నడుమ స్వామి దర్శనం -
స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం
కర్నూలు: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.42 లక్షలు మోసం చేశారని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్‌లో తెలియని వ్యక్తులు లింకులు పంపి.. బ్లాక్ ట్రేడింగ్ అని, ఐపీఓ సబ్స్క్రిప్షన్ వంటి వాటితో నమ్మించారని, పెట్టుబడి పెట్టిన డబ్బుకు రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నందున మహిళను పూర్తిస్థాయిలో విచారించి దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని సైబర్ ల్యాబ్ పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐ శ్రీనివాస నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● అమడగుంట్ల గ్రామంలో తన 6 ఎకరాల పొలాన్ని దస్తగిరి అనే వ్యక్తి కౌలుకు తీసుకుని కౌలు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని కర్నూలు వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న ప్రభావతమ్మ ఫిర్యాదు చేశారు. ● తన పేరుతో ఉన్న ఆస్తి, పెన్షన్ కోసం పెద్ద కుమార్తె, అల్లుడు, చిన్న కుమార్తె పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు గఫూర్ నగర్‌కు చెందిన సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ● తనకు సంబంధించిన 30 గొర్రెలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని, విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన పల్దొడ్డి జమ్మన్న ఫిర్యాదు చేశారు. ● ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని నందవరం గ్రామానికి చెందిన సావిత్రమ్మ, తన ఇంటికి రస్తా ఇవ్వకుండా వేరే వ్యక్తులు అడ్డంగా ఇల్లు నిర్మించుకుంటున్నారని పత్తికొండ మండలం పులికొండ గ్రామానికి చెందిన బోయ లక్ష్మి ఫిర్యాదు చేశారు. రూ.42 లక్షలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు -
విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు
కర్నూలు(సెంట్రల్): పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న 6గురు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన ఆయన చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలులోని ప్రకాష్ నగర్‌కు చెందిన హకీమ్, రేష్మా దంపతులు తమ కుమారుడు ఉమర్‌కు ట్రై సైకిల్ ఇప్పించాలని కోరగా వెంటనే మంజూరు చేయించారు. ● విభిన్న ప్రతిభావంతుల సౌకార్యార్థం అన్ని శాఖల కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారని.. ఒక్క డీపీఓ, డీఈఓ కార్యాలయాల్లో మాత్రమే ఎందుకు ఏర్పాటు చేయలేదని సంబంధిత అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో పది మాల్ ప్రాక్టీస్ కేసులు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో పది మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయినట్లు ఆర్ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లాలో 69 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 20,506 మందికిగాను 20,160 మంది విద్యార్థులు హాజరుకాగా, 336 మంది గైర్హాజరయ్యారన్నారు. పత్తికొండ ప్రభు త్వ జూనియర్ కాలేజీలో ఆరుగురు, ఏపీ మోడల్ స్కూల్ పత్తికొండలో ఒకరు, గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ(బాలురు)ఎమ్మిగనూరులో ఒకరు, నారాయణ జూనియర్ కాలేజీలో ఒకరు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు తనిఖీ బృందాలకు తెలిసిందన్నారు. గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ కర్నూలు(అగ్రికల్చర్): గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ లభిస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఎలాంటి కెమికల్స్ లేకుండా గోఆధారిత ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ కౌంటర్ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీపీఎం చంద్రశేఖర్, డీఎల్ఎంపీ లక్ష్మయ్య, మార్కెటింగ్ ఎన్ఎఫ్ఏ మల్లికార్జున పాల్గొన్నారు. నవోదయలో ‘యువ పార్లమెంట్’ ఎమ్మిగనూరురూరల్: బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019 నవంబర్ 26న జాతీయ యవ పార్లమెంట్ పథకం వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. సోమవారం విద్యాలయంలో పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ, స్పీకర్ వంటి సన్నివేశాలు నిర్వహించారు. యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన విద్యార్థులను విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ చందిరన్, బసవరాజ్, కె. వెంకటేశ్వర్లు, శశికిరణ్, రాజు, వెంకటేష్, రవిశంకర్, మీనాచంద్రన్ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్య పాణ్యం: బలపనూరు గ్రామానికి చెందిన వై.రామ్మోహన్‌రెడ్డి(63) అనే రైతు విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, గ్రామస్తులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. రామ్మోహన్‌రెడ్డికి 10 ఎకరాల సొంత భూమి ఉంది. కొడుకు గంగధారర్రెడ్డితో కలిసి ఆ పొలంలో వరి పంటను సాగు చేశాడు. అంతేకాక కౌలుకు మరో 10 ఎకరాల భూమి తీసుకొని మిరప, మినుము పంటలను సాగు చేశాడు. పంటలకు సుమారు రూ.12 లక్ష ల నుంచి రూ.14లక్షల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. మిరప పంట సరిగ్గా లేకపోవడం, వచ్చిన పంటకు మద్దతు ధర లేనందున నిత్యం ఇంట్లో, బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. సోమవారం ఇంట్లో వారు బంధువుల వివాహానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషపు గుళికలు మింగాడు. వచ్చిన తర్వాత గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు గంగాధర్‌రెడ్డి ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. -
నృత్యం.. సంగీతం.. అ‘మోఘ’ం
కర్నూలు కల్చరల్: తల్లిదండ్రుల ప్రోత్సాహం.. గురువుల మార్గదర్శనం.. నృత్యం, సంగీతంలో కామళే మేఘనను ఘనాపాటిని చేశాయి. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాట్య ప్రదర్శనలు ఈమె అవార్డులు సాధించారు. ఆదో ని పట్టణం ఆర్టీసీ కాలనీకి చెందిన బ్యాంగ్ ఉద్యో గి కామళే రమేష్ బాబు, కామళే విజయలక్ష్మి దంపతలు మూడో కుమార్తె కామళే మేఘన. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం బీకాం కంప్యూటర్స్ చదువుతున్నారు. ఈ విద్యార్థిని 2015 నుంచి కూచిపూడి, భరత నాట్యంతో పాటు కర్ణాటక సంగీతంలో గాయనిగా సాధన చేయడం మొదలు పెట్టారు. ఆదోనిలో సంవత్సరం క్రితం శ్రీ నృత్య కళా నిలయం బ్రాంచ్‌ను ప్రారంభించి శాసీ్త్రయ కళలను ఇతరులకు నేర్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. ప్రశంసలు.. ● నేపాల్ దేశం రాజధానిలోని ఖాట్మాండ్లో కామళే మేఘన నృత్య ప్రదర్శనను ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. ● ఇటీవల బెంగళూరులోని జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. ● మేఘన తన నృత్య ప్రదర్శనలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఏసియా బుక్ ఆఫ్ రికార్డు, భారత్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ ట్రెడిషినల్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ట్రెజర్ హంట్ రికార్డు అందుకున్నారు. ● కోల్‌కతాలో నిర్వహించిన భారత్ సంస్కృతి ఉత్సవ్ పోటీల్లో ప్రెసిడెంట్ అవార్డు కై వసం చేసుకున్నారు. భావితరాలకు అందిస్తా శాసీ్త్రయ నృత్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలా మంది చిన్నారులకు ఉండటం లేదు. నేను కూచిపూడి నృత్యంలో లెవల్–4, భరత నాట్యంలో మధ్యమ, కర్ణాక సంగీతంలో లెవల్–5 పూర్తి చేశాను. చదువుతో పాటు నృత్యమూ ముఖ్యమే. నాకు తెలిసిన విద్యను భావితరాలకు అందించాలన్నదే నా లక్ష్యం. – కామళే మేఘన కూచిపూడి, భరత నాట్యం, కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం ఆదోనికి చెందిన కామళే మేఘన అత్యుత్తమ ప్రతిభ -
ఆమెకు ‘రక్షణ’ కవచం
హెల్ప్లైన్లు నంబర్లు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ఉమెన్ హెల్ప్‌లైన్ 181 పోలీస్ హెల్ప్‌లైన్ 100/112 సైబర్ క్రైం హెల్ప్‌లైన్ 1930 పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 77778 77722 కర్నూలు: సమాజంలో మహిళలు, విద్యార్థినులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారికి రక్షణ కవచంలా నిలిచేందుకు జిల్లా పోలీసులు కదిలారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మహిళల రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాలపై పోలీస్ స్టేషన్ల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు, 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓపెన్ హౌస్, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీలు, మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ తరహా కార్యక్రమాలను ఈనెల 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలకు సంబంధించిన అంశాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజు 8వ తేదీ మహిళలతో ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వ్యాసరచన పోటీలు... మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు సోమవారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా కర్నూలులోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, అశోక్ ఉమెన్స్, కేవీఆర్ కళాశాలలో విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కూడా వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్శించండి... తెలుసుకోండి మహిళలు, యువతులు, విద్యార్థినులను పోలీస్ స్టేషన్లకు ఆహ్వానిస్తున్నారు. పోలీసు విధులు, మహిళా సహాయక కేంద్రం పనితీరు, అధికారుల పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే పరిక రాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మహిళలు, యువతులు, చిన్నారుల రక్షణకు రూపొందించి అమలు చేస్తున్న చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టాలతో పాటు సామాజిక మాధ్యమాల వినియోగం–దుష్పరిణామాలు, సైబర్ నేరాలు–తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై వివరిస్తున్నారు. బాలికలు స్వీయరక్షణ పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. సహాయానికి ఫోన్ చేయండి మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు ఎక్కడైనా, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే తక్షణ సహాయం కోసం పోలీసులతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల భద్రతకు పోలీసులు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు -
నేటి సాయంత్రంలోగా పీ4 సర్వే పూర్తి చేయాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్ ) సర్వేను ఈ నెల 4 సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. ఆయన సోమవారం జెడ్పీలోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రెండు, మూడు సచివాలయాలను కలిపి క్లస్టర్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది రోజు వారీ హాజరును తప్పక వేయాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను త్వరగా పూర్తి చేసి, వర్మీ తయారీపై దృష్టి సారించాలన్నారు. వెబ్సైట్లో ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలు కర్నూలు(హాస్పిటల్): అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలను కర్నూలు, నంద్యాల జిల్లాల వెబ్సైట్లు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap. gov.in, కర్నూలు మెడికల్ కాలేజీ వెబ్సైట్ https:// kurnoolmedicalcollege.ac.inలలో అప్లోడ్ చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు 2023 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి 11 కేటగిరిల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాలు డీఈఓ వెబ్సైట్లో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలపాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా తయారు చేసిన జాబితాను వైబ్‌సైట్‌తో పాటు నోటీసు బోర్డులో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జెడ్పీ, మండల, మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఈనెల 10వ తేదీలోపు డీఈఓ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కడప కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కేసీకి నీటి విడుదల బంద్ కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి కర్నూలు–కడప కెనాల్‌కు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అలాగే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదల నిలిపివేశారు. మల్యాల నుంచి 675 క్యుసెక్కుల నీరు మాత్రమే కేసీకి పంపింగ్ చేస్తున్నారు. ఈ కాలువ పరిధిలో రబీలో సుమారుగా 90,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మొన్నటి వరకు ఆయకట్టుకు నీరు అందించామని, ప్రస్తుతం పంటలకు నీరు అవసరం లేదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ ప్రాంతంలోని సాగులో ఉన్న ఆయకట్టుకు వచ్చే నెల వరకు నీరిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
మూగజీవాలు విలవిల
చెట్ల నీడన సేదతీరుతున్న గొర్రెలు, మేకలు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా డోన్ ఆర్టీసీ బస్టాండ్ కౌతాళం: మండలంలో వారం రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మండలంలో ఎండల తీవ్రత 35డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో మండల పరిదిలోని ఉరుకుంద గ్రామ శివారులో గొర్రెలు, మేకలు చెట్ల కింద సేదతీరడం కనిపించింది. రానున్న రోజుల్లో తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పట్టింది. ఈ వేసవి నిప్పుల కొలిమే! ● మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు ● గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు ● ఈ సారి 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ● వేసవి తీవ్రత పెరుగుతున్నా కనిపించని ఉపశమన చర్యలు ● జాడలేని చలువ పందిళ్లు, చలివేంద్రాలుఈ నెల 1 నుంచి నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు తేదీ కర్నూలు నంద్యాల గరిష్టం–కనిష్టం గరిష్టం–కనిష్టం 1వ తేదీ 36.8-20.0 36.4-18.6 2వ తేదీ 37.0-23.1 37.0-20.0 3వ తేదీ 39.5-22.0 38.5-23.6 ఈత.. కేరింత దొర్నిపాడు: రోజురోజుకూ వేసవి ముదురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండంతో జనాలు భానుడి సెగకు తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు వేసవి తాపం తాళలేక క్రిష్టిపాడు గ్రామంలోని కుందూనదిలో ఈతకు వెళ్లి కేరింతలు కొట్టడం కనిపించింది.వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఇలా..కర్నూలు(అగ్రికల్చర్): గత ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ సారి కూడా భానుడి భగభగలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ సారి సూర్య ప్రతాపం పెరుగనుంది. ఏప్రిల్ మొదటి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదవుతాయి. అలాంటిది అక్కడి కంటే ఇక్కడ రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతుండటం గమనార్హం. మార్చి నెల చివరికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు, ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలకు, మే నెలలో 47/48 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉన్నా సాయంత్రానికి అకాల వర్షాలు పడటం, గాలుల వల్ల కాస్త ఉపశమనం లభించింది. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వడగాలులు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే గాలిలో తేమ తగ్గింది. ఈ కారణంగా వడగాలులు మొదలయ్యాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. అక్టోబర్ నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేక ఎండల తీవ్రతకు పెరిగి నేల నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అడవులు తరిగిపోతుండటం, పచ్చదనం కనుమరుగు అవుతుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాల్సి ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగి వాయు కాలుష్యం అధికమవడం కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు మొదలవుతాయి. దీనినే హీట్‌వేవ్‌గా వ్యవహరిస్తారు. ఇప్పుడు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. పెరిగిన విద్యుత్ వినియోగం ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏసీలకు తోడు కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి 1న 15లక్షల మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా.. ఈ నెల 1న వినియోగం 16.02 లక్షల మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రికార్డు స్థాయిలో లక్ష మిలియన్ యూనిట్లకుపైగా వినియోగం పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్ వినియోగం 20 లక్షల మిలియన్ యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా. వడదెబ్బ లక్షణాలు: తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి. ఉపాధి, పొలం పనులకు వెళ్లే వాళ్లు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్ల్లాలి. కనీసం తలపైన టోపి లేదా టువాలను కప్పుకోవాలి. కళ్ల రక్షణకు సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. దాహం వేయకపోయినా తరచూ చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు తాగుతుండాలి. వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం ఉత్తమం. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం మార్చి నుంచి మే నెల చివరి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.ఈ సారి ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రత 47–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. గాలిలో తేమ శాతం తగ్గుతున్నందున వడగాలుల ప్రభావం ఉంటుంది. – నారాయణ స్వామి, సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త ఉపశమన చర్యలు శూన్యం 2024 వేసవి వరకు ముందస్తుగానే ఉపశమన చర్యలు తీసుకోవడం కనిపించింది. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రాంతంలో ఇరువైపులు, కలెక్టరేట్ బస్టాపు, రాజ్‌విహార్, బళ్లారి చౌరస్తా, సి.క్యాంపు సెంటర్, ట్రాఫిక్ సిగ్నల్ పడే ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసేవాళ్లు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చూశాం. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీలు ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు కరువయ్యాయి. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లోనూ నీడ సదుపాయం కల్పిస్తున్న దాఖలాల్లేవు. -
ప్చ్.. వినపడటం లేదు..!
వినికిడి సమస్యకు కారణాలు ● ధ్వని ఎక్కువగా ఉండే పరిసరాల్లో ఉండటం ● మొబైల్, బ్లూటూత్, హెడ్ఫోన్లలలో పెద్దశబ్దంతో మ్యూజిక్ వినడం ● వాహనాల శబ్దాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండటం ● జన్యుకారణాలు, పుట్టుకతో వచ్చే లోపాలు ● మేనరికం, వంశపారంపర్యంగా రావడం ● వృద్దాప్యం, చెవి మధ్యలో ఇన్ఫెక్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● చెవి శుభ్రతకు బడ్స్, పిన్ను సూదులు తదితరాలు ఉపయోగించకూడదు. ● చెవిలో నొప్పికి నూనె, ఆకుపసర్లు వేయకూడదు. ● చెవిలో చీము కారుతుంటే స్విమ్మింగ్ చేయకూడదు. ● చెవిలో నీరు పోకుండా నూనె అంటిన దూదిని చెవిలో పెట్టుకోవాలి. ● ఎక్కువ శబ్దాలు వచ్చే ప్రదేశంలో పనిచేసే వారు ఇయర్ ప్లగ్స్ వాడాలి. ● ప్రతి ఆరు నెలలకు ఒకసారి వినికిడి పరీక్ష చేయించుకోవడం మంచిది. ● బ్లూటూత్, హెడ్ఫోన్లతో వినికిడి సమస్య ● పెద్దగా మ్యూజిక్ వినడంతో ఇబ్బందులు ● కొందరికి పుట్టుకతో వినికిడి లోపం ● పరిష్కారం చూపుతున్న ఆధునిక హియరింగ్ ఎయిడ్లు ● నేడు ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినంకర్నూలు(హాస్పిటల్): స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వినికిడి సమస్య బాధితులు పెరుగుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడటం, అధిక శబ్దంతో పాటలు వినడం, బ్లూటూత్, హెడ్సెట్ వినియోగించడం తదితర కారణాలతో వినికిడి సమస్య ఏర్పడి బాధితులు అవస్థలు పడుతున్నారు. ఎదుటి వారు చెప్పేది సరిగా వినిపించకపోతే తలెత్తే సమస్య అంతా ఇంతా కాదు. వినికిడి సమస్యను అధిగించేందుకు ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం జిల్లాలో వీరి సంఖ్య 4వేల దాకా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలు దాటిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు పాక్షికంగా సమస్య ఉన్న వారి సంఖ్య ఇందుకు మూడింతలు ఉంటుందని వారి అంచనా. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులలో చెవి, ముక్కు, గొంతు (ఈఎన్టి ) వైద్యుల వద్దకు చెవిలో ఇబ్బందులతో రోజుకు సగటున 250 నుంచి 300 మంది వస్తుండగా అందులో వినికిడి సమస్యతో బాధపడే వారు 40 శాతానికి పైగా ఉంటున్నారు. ఇలాంటి వారు సరిగ్గా వినపడని కారణంగా శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య కొందరికి పుట్టుకతో వస్తుండగా మరికొందరికి ప్రమాదాల్లో సమస్య ఏర్పడుతోంది. సమస్యను పరిష్కరిస్తున్న వినికిడి మిషన్లు ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ వినికిడి మిషన్లు వచ్చాక చాలా మంది వాటిని వాడటం సులభంగా మారింది. వీటిని వైద్యులు చెవిలోపల, చెవి వెనుక కనిపించకుండా అమరుస్తారు. ఇవి వాడటం వల్ల మనకు ఎంత వినికిడి శక్తి కావాలో అంతే తీసుకుంటుంది. నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉండటం, అడ్వాన్స్ టెక్నాలజీ రిమోట్ కంట్రోల్ హియరింగ్ ఎయిడ్స్ ద్వారా మనం ఎంత సౌండ్ కావాలో ఈ టెక్నాలజి ఉపయోగపడుతుంది. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న పిల్లలకు వినికిడి మిషన్లు అమర్చి స్పీచ్‌థెరపీ ఇప్పిస్తే వారు త్వరగా మాటలు వినడమే గాక అర్థం చేసుకుని తిరిగి మాట్లాడేందుకు సులభం అవుతుంది. వినికిడి మిషన్ వాడటం వల్ల చిన్నశబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినగలరు. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోగలరు. చెవిలో నుంచి శబ్దం తగ్గుతుంది. వినికిడి పరీక్ష ఇలా చేయించుకోవాలి వినికిడి సమస్య ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఈఎన్టీ వైద్యులు, ఆడియాలజిస్టు వద్దకు వెళ్లి ఆడియోమెట్రి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల ఎంత శాతం వినికిడి కోల్పోయింది. ఎందువల్ల అని నిర్దారణ అయితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆడియోమెట్రిక్ పరీక్ష చేయించుకున్న తర్వాత సెన్సార్ హియరింగ్ లాస్ అయితే వినికిడి మిషన్, హియరింగ్ ఎయిడ్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల చిన్న శబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినిపిస్తాయి. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోవచ్చు. -
ప్రముఖ విద్యావేత్త రాయసం రత్నస్వామి మృతి
వెలుగోడు: ప్రముఖ విద్యావేత్త, వెలుగోడు గ్రామ నివాసి డాక్టర్ రాయసం రత్న స్వామి (90) ఆదివారం స్వగృహంలో వయోభారంతో కన్నుమూశారు. వెలుగోడులో అనేక విద్యాసంస్థలకు సారథ్యం వహించిన ఈయన నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సర్దార్ పటేల్ ఐటీఐను స్థాపించారు. ముస్లిం మైనార్టీల కోరిక మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో స్థానికంగా ఉర్దూ కళాశాల స్థాపించారు. సామాజిక సేవలో భాగంగా రూరల్ డెవలప్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి తన సేవలను జిల్లా వ్యాప్తంగా అందించారు. అలాగే వృద్ధాప్య ఆశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు వసతి కల్పించారు. అవివాహితుడైన రత్న స్వామి మృతి విషయం తెలియగానే గ్రామస్తులు, విద్యావేత్తలు, మేధావులు సంతాపం తెలియజేశారు. స్నేహితుడి కుటుంబానికి చేయూత గోనెగండ్ల: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. లక్షరూపాయలు సాయం అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..గోనెగండ్లలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పూజారి ఒంకార్ (48)కు భార్య పూజారి లత, కూతురు, కుమారుడు ఉన్నారు. మోటర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఈయనకు వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు పెంచికల పాడు ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు, మెకానిక్ యూనియన్ సభ్యులు ఒంకార్ స్వగృహానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. లక్ష సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
అన్నదాన పథకానికి విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఆదివారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దశరథరామమ్ రూ.లక్ష విరాళా న్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.● ఆదోని పట్టణంలో కోసిగికి చెందిన రాఘవేంద్ర, గోవిందమ్మల నుంచి 5.27 క్వింటాళ్ల బియ్యం, రవాణా వాహనం సీజ్ సీజ్. ● కర్నూలు రూరల్ మండలం పంచలింగాల సమీపంలో లారీని సీజ్ చేసి 135 బస్తాల బియ్యం స్వాధీనం. లారీ ఓనర్ ప్రైమ్ సీలోరియాతో పాటు మద్దిలేటి అనే వ్యక్తిపై క్రిమినల్ కేసు. ● పత్తికొండ మండలం హోసూరులో 52 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అరుణాక్షి, రామకృష్ణలపై క్రిమినల్, 6ఏ కేసులు. ● తుగ్గలి మండలం రాంపల్లి వద్ద లారీ, ఓ కారును సీజ్ చేసి 1100 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. అనంతపురం జిల్లాకు చెందిన డి.శంకర్, శివప్రసాద్, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన భాస్కరరెడ్డి, డోన్ మండలం చింతలపేటకు చెందిన వడ్డే సురేష్‌లపై కేసు. ● కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌వద్ద 30 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. కె.మహేశ్, జయప్రకాష్‌నాయుడు, ఇర్ఫాన్‌పై కేసు. ● మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్టు వద్ద కర్ణాటకకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. ● ఆదోని పట్టణం ఢణాపురం రోడ్డులో 3.20 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసి షేక్ షబ్బీర్‌పై కేసు నమోదు. మరో కేసులో 3.51 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం. వాహనాన్ని సీజ్ చేసి అబ్దుల్ రహిమాన్ అనే వ్యక్తిపై కేసు. ఇటీవల నమోదైన కొన్ని 6ఏ, క్రిమినల్ కేసులు -
పెద్దాసుపత్రిలో వృద్ధురాలికి అరుదైన చికిత్స
కర్నూలు(హాస్పిటల్): ఆహారం, నీళ్లు మింగలేక ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు ఆపరేషన్ అవసరం లేకుండా ఎండోస్కోపి ద్వారా చికిత్స చేసి సమస్య పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన అహ్మద్బీ (65) కొంత కాలంగా ఆహారం, నీళ్లు మింగలేక ఇబ్బంది పడుతోంది. ఈ మేరకు ఇటీవల ఆమె చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజి విభాగానికి వచ్చింది. ఆమెను పరీక్షించిన ఆ విభాగాధిపతి డాక్టర్ మోహన్‌రెడ్డి అకలేషియా కార్డియా అనే జబ్బుతో బాధపడుతోందని నిర్ధారించారు. సాధారణంగా ఇలాంటి సమస్యకు ఆపరేషన్ ద్వారా పరిష్కరిస్తారు. కానీ ఆపరేషన్ అవసరం లేకుండా ఆదివారం ఎండోస్కోపి పరికరంతో పరోరల్ ఎండోస్కోపిక్ మయాటమి(పోయమ్) అనే విధానం ద్వారా అన్నవాహికలో దెబ్బతిన్న కండరాన్ని కట్‌చేసి తొలగించారు. ఇదే చికిత్సను డోన్ మండలం ధర్మవరానికి చెందిన రఘుయాదవ్(30) అనే యువకుడికి కూడా నిర్వహించారు. కోత, కుట్లు లేని ఈ చికిత్స వల్ల రోగి త్వరగా కోలుకుంటారని, రక్తస్రావం ఉండదని డాక్టర్ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ ఆసుపత్రిలో తాము ఉచితంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. -
దాన ధర్మం..పుణ్యఫలం!
● రంజాన్ మాసం ప్రత్యేకం ● జకాత్, పిత్రాకు అత్యధిక ప్రాధాన్యత ● ఒక రూపాయి దానం చేస్తే 70 రెట్లు ఫలితం గడివేముల: ముస్లింలకు అత్యంత ప్రీతికరమైనది రంజాన్ మాసం. జీవితాన్ని, జీవిత గమనాన్ని మార్చి మనసుకు ప్రశాంతత ఇచ్చే ఈ మాసంలో ఇస్లామియ బోధనల ప్రకారం నడుచుకుంటారు. దీనివల్ల మిగతా 11 నెలలు కూడా అదే విధంగా జీవించేలా అలవాటు అవుతుందని ముస్లింల నమ్మకం. ఇదే కాకుండా ఆరాధన విషయంలో ఇస్లాం నిర్వచనం విభిన్నమైంది. విధిగా చేయాల్సిన సమాజ్, రోజా, జకాత్, హజ్ వంటి ఆరాధనలే కాదు. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఖురాన్ ఆదేశాల ప్రకారం చేసిన ప్రతి మంచి పని ఆరాధన కిందికే వస్తుంది. అందుకే రంజాన్ మాసంలో చేసే ఏ పనులకై నా 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందని ముస్లింల నమ్మకం. ఒక రూపాయి దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుందని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ మాసంలో అందరూ దానం చేస్తారు. దానధర్మాలు రెండు రకాలు సమాజంలో నిర్భాగ్యులు, అనాథలను ఆదుకోవడానికి దానం చేయాలని ఇస్లాం బోధిస్తుంది. అందుకే ముస్లింలు రంజాన్ మాసంలో ఇతోధికంగా దాన ధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. ఇస్లాంలో దానధర్మాలు రెండు రకాలు ఒకటి తప్పనిసరిగా చేయవలసినది జకాత్. అంటే తన వద్ద ఉన్న సంపదలో 2.5 శాతం పేదలకు పంచాలి. ఇలా చేయడం ద్వారా సంపద శుద్ధి అవుతుందని నమ్మకం. రెండోది ఫిత్రా. రంజాన్ మాసం తర్వాత రోజు ఈద్ నమాజ్ కన్నా ముందు ఫిత్రా తప్పనిసరిగా చెల్లించాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరి పేరిట ఫిత్రా దానం తప్పనిసరిగా చేయాలి. రెండు కిలోల 50 గ్రాముల ధాన్యం లేదా గోధువులు లేదా వాటి మార్కెట్లో వాటి ధరకు సరిపడ సొమ్మునైనా పేదలకు దానంగా చేయాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగ చేసుకోవాలన్నది ఈ సాయం ఉద్దేశం. అల్లా ప్రసాదించిన మాసం మానవుల అధికంగా పుణ్యం చేకూర్చేందుకే అల్లా ప్రసాదించిన నెల రంజాన్. ఈ మాసంలో ఆధ్యాత్మికతలో గడపాలి. నిరుపేదలకు ఫిత్రా, జకాత్ చేయాలి. నిష్టతో ఉప వాసం ఉండాలి. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. పేదలు కూడా ధనికులతో సమానంగా పండుగా చేసుకునేలా చూడాలి. సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయాలి. అప్పుడే అల్లా కరుణిస్తాడు. ఈ మాసంలో చిన్న దానం చేసినా పుణ్యం లభిస్తుంది. –ఖాజీ మౌలానా షేక్ అబ్దుల్ రెహమాన్ రషాది, ప్రభుత్వఖాజీ, గడివేముల మండలం దానం చేస్తే రెట్టింపు పుణ్యం రమదాన్ మాసంలో రూ.1 దానం చేస్తే రూ.70 దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ముస్లిం జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి. తను ఉన్న ఇల్లు కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే సంపదలో 2.5 శాతం జకాత్‌గా చెల్లించాలి. ఇది అల్లా ఆదేశం. రంజాన్ మాసంలో రోజా ఉండటం ఎంత ముఖ్యమో పేదలకు సాయం చేయడం కూడా అంతే ముఖ్యం. –హఫీజ్ జాఫర్ ఉశేన్,మంచాలకట్ట. -
ఏపీజీబీని కడపలోనే కొనసాగించాలి
కర్నూలు(అగ్రికల్చర్): విలీనం తర్వాత అతి పెద్ద బ్యాంకుగా అవతరించనున్న ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన కార్యాలయాన్ని కడపకు తరలించడం ద్వారా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరుతామని తెలిపారు. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కూడా ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి మొత్తాన్ని ఆమరావతిలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతీయ విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఘనంగా గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రహ్లాదరాయల వరదుడు.. యతి వరేణ్యుడు శ్రీరాఘవేంద్ర స్వామి గురు భక్తి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జామున సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజా మందిరంలో పీఠాధిపతి చేపట్టిన మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, భక్తి కీర్తనలు, మంగళవాయిద్యాల మధ్య అర్చన, అభిషేకాది పూజలు, దివిటీ సేవలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుల మూల బృందావనానికి పంచామృతాభిషేకం గావించి పుష్పాలంకరణ చేపట్టి హారతులు పట్టారు. వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. పూజోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచింది. అనుగ్రహ ప్రశస్థి అవార్డులు వేడుకల సందర్భంగా యోగీంద్ర మంటపంలో కర్ణాటక రేల్వే సహాయక మంత్రి సోమన్న రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డు అందుకున్నారు. అదే మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విదూషి అదితి నారాయణ కర్ణాటక సంగీత విభావరి, బెంగళూరుకు చెందిన కడప హనుమేష్ ఆచార్ వీణానాద ప్రదర్శన అలరించాయి. ఉత్సవాల్లో ఏఏవో మాధవశెట్టి, సలహాదారు శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, మేనేజర్–సి సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, సంస్కృత విద్యాపీఠం ప్రధానాచార్యులు వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
ఎస్ఐ శిక్షణలో ప్రతిభ
కర్నూలు: కర్నూలు పట్టణం ప్రకాష్‌నగర్‌కు చెందిన చైతన్య స్వరూపరాణి ఎస్ఐ శిక్షణలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం పోలీస్ శిక్షణ కేంద్రంలో ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే చైతన్య స్వరూపరాణి ఫైరింగ్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ట్రోఫీ అందుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవి దంపతుల కూతురు చైతన్య డిగ్రీలో బయో టెక్నాలజీ పూర్తి చేశారు. పత్తికొండకు చెందిన వెంకటేశ్వర్లు ఉద్యోగ రీత్యా కర్నూలులో ఉంటున్నారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టును సాధించినట్లు చైతన్య తెలిపారు. 12 నెలల శిక్షణ కాలంలో ప్రతిభను చూపినందుకు గోల్డ్ మెడల్ దక్కిందని, మే నెల నుంచి నెల రోజుల పాటు ఏపీఎస్పీ కర్నూలు బెటాలియన్‌లో శిక్షణ పొందనున్నట్లు చైతన్య తెలిపారు. తనను అనంతపురం జిల్లాకు కేటాయించినట్లు ఆమె తెలిపారు. హ్యాండ్‌బాల్ విజేత కల్లూరు జట్టు కర్నూలు (టౌన్): స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ ఇన్విటేషన్ పోటీల్లో కల్లూరుకు చెందిన బడే సాహెబ్ జట్టు విజేతగా నిలింది. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. బహుమతుల కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు. ఇన్విటేషన్ పోటీల్లో పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లాలోనే కర్నూలుకు హ్యాండ్‌బాల్ క్రీడలో మంచి పేరు ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు ప్రతిభ చాటారన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సువర్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆదివారం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కే తులసీదేవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక బీ క్యాంప్‌లోని ఏపీటీడబ్ల్యూఆర్ (బాలికలు) స్కూల్లో ఈ పరీక్షను నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు కర్నూలు జిల్లా నుంచి 42 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఎంట్రెన్స్ టెస్ట్‌కు బాలురు 30 మందికి గాను 19 మంది, బాలికలు 12 మందికి గాను 9 మంది హాజరు అయ్యారన్నారు. మిగిలిన 14 మంది పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. ‘ఎకై ్సజ్’ సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎగ్జిక్యూటీవ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలుగా ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు ఎకై ్సజ్ కార్యాలయం ఆవరణలో జిల్లా డీపీఈఓ మచ్చా సుధీర్‌బాబు అధ్యక్షతన ఎన్నిక లు జరిగాయి. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సోమశేఖర్ (డోన్ ఎస్ఐ), ఉపాధ్యక్షులుగా బార్గవ్‌రెడ్డి (కోసిగి ఎస్ఐ), ప్రధాన కార్యదర్శిగా సందీప్ (కోవెలకుంట్ల ఎస్ఐ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రమేష్‌రెడ్డి (ఎమ్మిగనూరు సీఐ), సహాయ కార్య దర్శిగా రహెనాబేగం (కర్నూలు ఎస్ఐ), కోశాధికారిగా దుర్గా నవీన్‌బాబు (కర్నూలు ఎస్ఐ), కార్యవర్గ సభ్యులుగా ఇన్స్పెక్టర్లు శ్రీధర్, రమాదేవి, శేషాచలం, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్ నాయక్, ఇంద్ర కిరణ్ తేజ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి సుధీర్‌బాబు, ఏఈఎస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలిఆళ్లగడ్డ: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ అన్నారు. అహోబిలం క్షేత్రంలో ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఠాధిపతి ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అహోబిలం క్షేత్రం చరిత్ర, ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి శ్రీకార్యం, ప్రధానార్చకులు వేణుగోపాలన్ పాల్గొన్నారు. సైక్లింగ్‌తో ఆరోగ్యం కర్నూలు (టౌన్): ‘ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించి సైక్లింగ్ చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం’ అంటూ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, శాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్ ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్డీవో మాట్లాడుతూ ఆరోగ్య భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైక్లింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. -
నియోజకవర్గాల వారీగా ముఠాలు
● ఒక్క కర్నూలులోనే 25కు పైగా గ్యాంగులు ● పట్టుకోసం రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు ● ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని అక్రమ రవాణా ● కళ్లెదుటే సాగుతున్నా నోరు మెదపని అధికారులు ● పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లుమల్లన్నకు నృత్యనీరాజనం శ్రీశైలంటెంపుల్: నిత్యకళావేదికపై ఆదివారం కర్నూలుకు చెందిన వి.ప్రసాద్ బృందం వారి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. వాగ్వేది ప్రసాద్, మహతి, సాహిత్య, తపస్య, సంధ్య నృత్యం ప్రదర్శించారు.సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025కర్నూలు(సెంట్రల్): పేదల బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఏ స్థాయిలో దందా చేసుకుంటే అంతటి ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రేషన్ బియ్యం కోసం మాఫియాలు పుట్టుకొచ్చాయి. నియోజకవర్గాల వారీగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులు ముఠాలుగా ఏర్పడి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి రేషన్ బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు, ఇతర అధికారులందరికీ మామూళ్లు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో నెలకు దాదాపు రూ.100 కోట్లకుపైగా బియ్యం అక్రమ రవాణా వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్లా నేరుగా ఎండీయూ ఆపరేటర్లే బియ్యాన్ని రూ.10 నుంచి రూ.15 వరకు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు కలసి అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల వినియోగదారుల నుంచే నేరుగా తక్కువ ధరకు కొనుగోలు చేసే గ్యాంగులు ఉండటం గమనార్హం. కర్నూలులో బరితెగించిన రెండు ముఠాలు అక్రమ బియ్యం దందా జిల్లా అంతటా సగం ఉంటే.. మిగిలిన సగం జిల్లా కేంద్రంలో నడుస్తోంది. ఇక్కడ ఏకంగా 170 చౌకధరల దుకాణాల పరిధిలో 1,100 టన్నుల బియ్యం కేటాయింపులు ఉంటున్నాయి. దీంతో ఇక్కడ పట్టుకోసం టీజీ, గౌరుల పేర్లు చెప్పుకొని వ్యాపారం చేసే వారు బరితెగించారు. కర్నూలులో 25 గ్యాంగుల వరకు పనిచేస్తున్నాయి. వీరంతా ఇద్దరు వ్యాపారులకు ఇన్నాళ్లూ బియ్యం ఇచ్చేవారు. అయితే కొత్తగా వెలుగోడు కేంద్రంగా ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. గౌరు అనుచరుడినంటూ చెప్పుకొని అప్పటికే ఉన్న వారిద్దరిని కూడా తనకే బియ్యం అమ్మాలంటూ హుకుం జారీ చేశాడు. అమ్మకుంటే అంతు చూస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఒకానొక సమయంలో దాడులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరకు పోలీసులు కలుగజేసుకొని కర్నూలులో వ్యాపారం చేస్తున్న బాషా, శరణయ్యలను వెలుగోడు వ్యక్తికి సహకరించాలని, లేదంటే ఇబ్బందులు పడతారని హెచ్చరించి రాజీ చేసినట్లు చర్చ జరరుగుతోంది. అయినప్పటికీ రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోందని, ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. మిన్నకుండిపోయిన నిఘా వ్యవస్థలు జిల్లాలో ప్రతి నెలా బియ్యం దందా రూ.100 కోట్ల వరకు జరుగతున్నా పౌరసరఫరా, పోలీసు, విజిలెన్స్ నిఘాలకు మాత్రం దొరకని పరిస్థితి. బహిరంగంగా తెలిసినా ఎవరూ తమకు తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా అక్రమ బియ్యం ఎక్కడైనా ఉంటే తమకు చెబితే పట్టుకుంటామని పౌరసరఫరాల అధికారులు చెబుతుండడం గమనార్హం. మరోవైపు విజిలెన్స్ ఇన్‌ఫ్మార్మర్లను సైతం పచ్చ మూకలు కనిపెట్టినట్లు తెలుస్తోంది. వారిని దారికి తెచ్చుకోవడం, లేదంటే భయపెట్టే వరకు వెళ్లడంతో ఆ వ్యవస్థ కూడా దిక్కుతోచని స్థితిలో ఉంటోంది. ఇక పోలీసులు చాలా చోట్ల వారికి అన్నీ తెలిసినా ఏమీ అనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బియ్యం దందాలో పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు అందుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల వారీగా ‘పచ్చ’ ముఠాలు కర్నూలులో దాదాపు 25 గ్యాంగులు బియ్యం దందాలో ఉన్నాయి. బుధవారపేటకు చెందిన వ్యక్తి, పాతబస్తీకి చెందిన మరో వ్యక్తి ఆయా గ్యాంగుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీరికి పట్టణం నడిబొడ్డున బుధవారపేట, శరీన్‌నగర్, వీకర్ సెక్షన్‌కాలనీ, పంచలింగాలలో గోదాములు ఉన్నాయి. అక్కడి నుంచి బియ్యాన్ని జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. కాగా, వీరిద్దరూ ఓ మంత్రికి అనుచరులు. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడుకు చెందిన ఓ వ్యాపారి ఓ ఎమ్మెల్యే భర్త ఆశీస్సులతో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, కర్నూలులలో బియ్యం సిండికేట్‌కు తెరలేపారు. డోన్, కోడుమూరు, పత్తికొండలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు వెల్దుర్తి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదోనిలో ఓ బీజేపీ నాయకుడు తన కింద 10మందితో బియ్యం దందాను నడిపి కర్ణాటకలోని శిరుగుప్పు, రాయచూరు, బళ్లారి వరకు విస్తరించారు. ఆలూరు నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా వ్యాపారాన్ని గుంతకల్‌కు చెందిన వ్యక్తులు నడిపిస్తున్నారు. మంత్రాలయం, ఎమ్మిగనూరులో కొంత భాగం వెల్దుర్తి కేంద్రంగా పనిచేసే వ్యాపారి, మిగిలిన భాగాలను కొందరు టీడీపీ నాయకులు కర్ణాటక వ్యాపారులతో కలిసి నిర్వహిస్తున్నట్లు సమాచారం. న్యూస్‌రీల్ -
ఊరు అడుగుతోంది నీరు
ఆస్పరి: మంచినీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందె నీటికి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాల్లో రేగడి పొలాలు ఉన్నాయి. ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. దీంతో బాపురం రిజర్వాయర్ నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. జొహరాపురంలో 7,000, చిన్నహోతూరులో 4,000 మంది ప్రజలు ఉన్నారు. రెండు గ్రామాల్లో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదు. వేసవి కాలం వచ్చిందంటే వారికి కష్టాలు తప్పడం లేదు. జొహరాపుర గ్రామస్తులు నేటికీ వక్కిరేణి నీటినే తాగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాపురం రిజర్వాయర్ నుంచి 15 రోజులకోసారి వచ్చే నీటి కోసం రెండు గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా అందిస్తున్నారు. రెండు గ్రామాలకు పై భాగంలో ఉన్న పల్లెవారు పట్టుకున్న తర్వాత నీటిని వదులుతున్నారు. తమ గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నుంచి నేరుగా పైపులైన్ వేస్తే బాగుంటుందని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. రెండు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నాం మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాలకు రెండు రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీటిని సరఫరా చేస్తున్నాం. అయితే గ్రామాల్లో పంచాయతీ వారు విడతలు వారీగా ఒక్కో కాలనీకి ఒక్క రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. చివర కాలనీలకు నీరు వచ్చేలోపు ఆలస్యమవుతుండొచ్చు. పందికోన రిజయర్వాయర్ నుంచి ఆస్పరి మండలంలోని జొహరాపురం, చిన్నహోతూరు, ఆస్పరి, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర, బిణిగేర, చిగిళి, నగరూరు గ్రామాలకు శాశ్వతంగా మంచి నీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీతో సర్వే చేయిస్తోంది. – హనుమంతు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పెద్దల కాలం నుంచి తిప్పలే పెద్దల కాలం నుంచి మంచి నీటి కోసం అవస్థలు తప్పడం లేదు. మా ఎస్సీ కాలనీకి 15 రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీరు వచ్చినా చాలడం లేదు. తప్పని సరి పరిస్థితులలో వర్షాధారంతో నిండిన వక్కిరేణి నీటినే నేటికీ తాగుతున్నాం. ఏప్రిల్, మే నెలలో అయితే వక్కిరేణిలో నీరు పూర్తిగా అడుగంటి పోతుంది. బు రద నీరు ఉన్నా దానినే తాగుతున్నాం. హంద్రీ నీవా నీటిని మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. – కరుణాకర్, జొహరాపురం గ్రామం, ఆస్పరి మండలంపైపులైన్ మార్చాలి బాపురం రిజర్వాయర్ నుంచి మా గ్రామానికి 50 ఏళ్లు క్రితం పైపులైన్ వేశారు. పాత పైపులైన్ మార్చి కొత్తగా వేయాలి. అంతేగాక పెద్దహోతూరు నుంచి కాకుండా నేరుగా పైపులైన్ వేస్తే నీటి సమస్య కొంత వరకు తీరుతుంది. మాగ్రామంలో ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతుంది. అధికారులు మా గ్రామానికి శాశ్వతంగా మంచి నీటి సమస్య పరిష్కారం చే యాలి. – హరికృష్ణ, చిన్నహోతూరు సర్పంచ్, ఆస్పరి మండలం బాపురం రిజర్వాయర్ నీరే గతి చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాల్లో అవస్థలు -
విద్యార్థులకు సంస్కారం అవసరం
కర్నూలు కల్చరల్: విద్యార్థులకు చదువే కాదు సంస్కారం కూడా అవసరమని జిల్లా జడ్జి జి.కబర్ది అన్నారు. ఆదివారం ఓల్డ్‌సిటీ చిదంబరావు వీధిలోని స్వామి వివేకానంద సంస్కృత పాఠశాలలో అన్నపూర్ణమ్మ విద్యార్థి వసతి గృహం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు, సంస్కారం అందించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ ముఖ్య వక్తగా హాజరై సందేశమిచ్చారు. పారిశ్రామికవేత్త శేరి బాలనాగరాజు, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిని సభ్యులు సుబ్బ లక్ష్మయ్య, వసతి గృహం అధ్యక్షులు బి.చిరంజీవిరెడ్డి, కార్యదర్శి కె.బాలాజీరావు మాట్లాడారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా జడ్జి జి.కబర్ది -
విశ్రాంత ఇంజినీర్ సుబ్బరాయుడుకు ‘గాడిచర్ల పురస్కారం’
కర్నూలు కల్చరల్: నగరానికి చెందిన నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజినీర్ ఎం.సుబ్బరాయుడుకు 29వ ‘గాడిచర్ల పురస్కారం’ను ఆదివారం ఆయన స్వగృహంలో ప్రదానం చేశారు. ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు 66వ వర్ధంతిని పురష్కరించుకొని గాడిచర్ల ఫౌండేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ, ఏపీ గ్రంథాలయ సంఘం, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్న గాడిచర్ల పురస్కారాన్ని ఈఏడాది సుబ్బరాయుడుకు చల్లా కాంపౌండ్‌లోని ఆయన స్వగృహంలో అందజేశారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ పరిఽధిలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని ప్రకాశం సభా భవనంలో గాడిచర్ల వర్ధంతి సభ జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాడిచర్ల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన క్లస్టర్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ విజ్ఞాన వేత్త సాగు, తాగు నీటి కోసం శ్రమించిన సుబ్బరాయుడు పనిలో దైవాన్ని చూసే వారన్నారు. నీటిని పదిలం చేసే పనిలో వంద శాతం కృషి చేశారన్నారు. రాయలసీమకు సాగు, తాగు నీరు కోసం విశేషంగా శ్రమించారన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ లైబ్రరీకి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పేరు పెడతామన్నారు. గాడిచర్ల ఫౌండేషన్, సాహితీ సదస్సు అధ్యక్షుడు కురాడి చంద్రశేఖర కల్కూర మాట్లాడుతూ కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగు, తుంగ భద్రపై గుండ్రేవుల రిజర్వాయర్, వేదవతి నదిపైన ఎత్తిపోతల పథకం కడితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పిన దార్శనికుడు సుబ్బరాయుడని కొనియాడారు. క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, రాయలసీమ జల సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీఎస్ కుమార్, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్ఆర్కే శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ బె బెటాలియన్ డీఎస్పీ మహబుబ్ బాషా, గ్రంఽథాయల సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, మధుర కవి ఎలమర్తి రమణయ్య మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు దండెబోయిన పార్వతీ దేవి, డాక్టర్ రాధారాణి, చరిత్ర విభాగాధిపతి జయలక్ష్మి, ఉపన్యాసకులు విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మోతాదుకు మించి పురుగుమందులు వాడొద్దు
కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఇన్పుట్ డీలర్లను ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచించారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ డీపీడీ మాట్లాడుతూ.. పురుగుమందులు ఎక్కువగా వాడుతుండటంతో ఆహార పంటలు, కూరగాయల్లో వాటి అవశేషాలు ఉంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త జయచంద్ర పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆ సంఘం కోశాధికారి భాస్కరనాయుడు, మరి కొందరు కార్యవర్గ సభ్యుల ఫిర్యాదు చేశారు. సంఘం తాలూకా కార్యవర్గాల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం ఏకపక్షంగా ముందుకు పోతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్ చర్యలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తాలూకా ఎన్నికలు జరుపవద్దని, సంఘం నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. అలాగే జిల్లా సంఘంలో వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆర్వీ రమణ.. జిల్లా నాయకత్వంపై పలు విమర్శలు చేశారు. సంఘం ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని పేర్కొంటూ 21 అంశాలపై ఆరోపణలు చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వీటిని రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు
బేతంచెర్ల: మండల పరిధిలోని ముసలాయిచెర్వు గ్రామంలో గత నెల 25వ తేదీన జరిగిన హత్యా యత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ముసలాయి చెర్వుకు చెందిన పల్లె రాములమ్మ, కొడుకు మహేశ్వర్‌రెడ్డి పొలం గట్టు విషయంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన కుంచె రామేశ్వర్‌రెడ్డి, కొడుకు సుదర్శన్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలోని రంగాపురం గ్రామంలో ఇద్దరు నిందితులు ఉన్నారనే సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. డోన్ కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులు గురుబాబు, శ్రీను, దస్తగిరి, రాజు నాయక్, సురేష్ కుమార్, వెంకటేష్‌ను సీఐ అభినందించారు. -
వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు
చెవిలో సమస్య వచ్చిన వారు నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. చెవి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు అవి వినికిడి లోపానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వచ్చినప్పుడు చెవి బ్లాక్ అవుతుంది. దానివల్ల కొన్నిసార్లు వినికిడి సమస్య రావచ్చు. చెవిలో రంధ్రం పడితే మైరింగోప్లాస్టీ ఆపరేషన్ చేస్తాం. పెద్దల్లో నరాల బలహీనత వల్ల వినికిడి సమస్య వస్తుంది. వీరికి ఆడియోమెట్రీ పరీక్ష చేసి మందులు వాడాల్సి ఉంటుంది. తగ్గకపోతే హియరింగ్ ఎయిడ్ వాడాల్సి వస్తుంది. – డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, ఈఎన్టీ వైద్యులు, కర్నూలు సరైన హియరింగ్ ఎయిడ్ వాడాలి వినికిడి సమస్య ఉన్న వారు అవసరమైన చికిత్సను పొందకపోయినా, వినికిడి మిషన్‌ను ఉపయోగించకపోయినా, ఎక్కువగా సెల్‌ఫోన్ రేడియేషన్, శబ్దకాలుష్యానికి గురైనా వారి వినికిడి సామర్థ్యం మరింత క్షీణిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా వినికిడి శక్తి కోల్పోతారు. సరైన హియరింగ్ ఎయిడ్, లిజనింగ్ ట్రైనింగ్ ద్వారా వినికిడి లోపం తగ్గించవచ్చు. బ్యాలెన్స్ సమస్యను బ్యాలెన్స్ థెరపి సహాయంతో పరిష్కరించవచ్చు. వినికిడి సమస్య ఉన్న వారు ఆడియాలజిస్టును సంప్రదిస్తే పరీక్షించి అవసరమైన పరికరాన్ని అమరుస్తారు. మిషన్లు పెట్టుకోవడానికి నామోషీ పడేవారికి చెవిలోపల కూడా అమర్చే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. – రోజా బంగి, ఆడియాలజిస్టు, కర్నూలు -
ఎస్టీ రిజర్వేషన్ సాధనకు నేడు వీఆర్పీఎస్ ధర్నా
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై సోమవారం ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మొలగవెళ్లి రామాంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో చట్టం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. -
విద్యార్థిని శ్రీలేఖ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
కర్నూలు(సెంట్రల్): ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి.శ్రీలేఖ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సైన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలేఖతో పాటు మరో ఆరుగురిపై చెట్టు కొమ్మ విరిగి పడగా తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలుపెద్దాసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీలేఖ ఆదివారం చనిపోవడంతో విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. బాలిక మృతి దురదృష్టకరమని చెప్పారు. -
యాగంటిలో శివదీక్ష విరమణ
బనగానపల్లె రూరల్: మండల పరిధిలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో శివమాలధారుల దీక్ష విరమణ శనివారం ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి శివ దీక్ష విరమణ గావించారు. ముందుగా పాతపాడు గ్రామం నుంచి తనయుడు శివ నరసింహారెడ్డి, మరికొందరు శివస్వాములతో కలిసి ఇరుముడులు తలపై పెట్టుకొని శివనామస్మరణ గావిస్తూ పాదయాత్రగా యాగంటి క్షేత్రానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి దీక్ష విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, సాయి ప్రసాదరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ద్వారా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. -
ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం
● అనుమతి లేకుండా ఎల్ఎల్సీ కాలువ నీరు కర్ణాటక రిజర్వాయర్‌కు మళ్లింపు ● అడ్డుకున్న అధికారులుహాలహర్వి: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. తుంగభధ్ర దిగువ కాలువ నీటిని అనుమతి లేకుండా కర్ణాటక రిజర్వాయర్‌కు మళ్లించేందుకు జేసీబీలతో ఎల్లెల్సీ ఆంధ్ర సరిహద్దు 135వ కి.మీ. వద్ద తవ్వుతున్నారు. విషయం తెలుసుకున్న తుంగభద్ర డ్యాం అధికారులు ఎల్డీఓ హాసన్బాషా, జేఈ దుర్గాప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మోకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువగట్టు తవ్వకం పనులు నిలిపి వేశారు. నీరు లేక కర్ణాటక ఎర్రగుడి రిజర్వాయర్ ఎండిపోయింది. తాగునీటి సరఫరా కోసం ఎల్ఎల్సీ కాలువ నుంచి రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నామని కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్ర నీటి వాటాను అనుమతి లేకుండా కాలువ గట్టును తవ్వడం నేరమని డ్యాం అధికారులు, ఎస్డీఓ హాసన్బాషా, జేఈ దుర్గాప్సాద్లు కర్ణాటక అధికారులతో వాగ్వాదం చేశారు. వెంటనే కాలువ తవ్వకం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. కలెక్టర్ అనుమతి తీసుకోవాలని డ్యాం అధికారులు కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర కాలువ గట్టును తవ్వకుండా మోటార్లు ద్వారా రిజర్వాయర్‌కు నీరు మళ్లించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేసి మోటార్ల ద్వారా రిజర్వాయర్‌కు నీరు మళ్లిస్తున్నారు. -
రూ.5 లక్షల వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ
కర్నూలు(అగ్రికల్చర్): ఏడాదిలోపు చెల్లించే వ్యవసాయ రుణాలపై 7 శాతం వడ్డీరేటు ఉందని, గడువులోపు చెల్లించిన రైతులకు 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం ఇస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. వడ్డీ రాయితీ ఇప్పటి వరకు రూ.3లక్షల వరకు మాత్రం ఉందని, ఇక నుంచి రూ.5 లక్షల వరకు లభిస్తుందన్నారు. శనివారం న్యూఢిల్లీ నుంచి వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడారు. కర్నూలు ఉద్యానభవన్‌లో జరిగిన వెబ్‌నార్‌కు రైతులు, అధికారులు హాజరయ్యారు. వెబ్‌నార్‌లో ప్రధాని మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం లక్ష్యంగా కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా వ్యవసాయ రుణ వడ్డీ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. వ్యవసాయంపై మరింత నమ్మకాన్ని పెంచేందుకు కేసీసీ దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్డీఎం రామచంద్రరావు మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో డిసెంబరు నాటికి కేసీసీ కింద 4.04 లక్షల మంది రైతులకు రూ.6,985 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు పొందేందుకు కేసీసీ పనికొస్తుందన్నారు. పాడి రైతులు, చేపల పెంపకం చేపట్టిన వారందరూ కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు పొందవచ్చన్నారు. బ్యాంకుల నుంచి తీసుకునే కేసీసీ రుణాలపై రూ.5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉన్న విషయాన్ని రైతుల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేది ప్రధాని లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, వ్యవసాయ అనుబంద శాఖల అధికారులు, వివిద బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ -
దేవర పొట్టేళ్ల కోసం వెళ్తూ మృత్యువాత
కృష్ణగిరి: గ్రామంలో దేవర కోసం పొట్టేళ్లను తీసుకొచ్చేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. మండలంలోని టి.గోకులపాడులో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు గ్రామదేవతల దేవర నిర్వహించనున్నారు. దేవరలో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పొట్టేళ్ల కోసం గ్రామానికి చెందిన 20 మంది రెండు ఆటోల్లో శనివారం ఉదయం తెలంగాణలోని పెబ్బేరు సంతకు బయలుదేరారు. అలంపూర్ దాటిన తరువాత కోదండాపురం వద్ద వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ ఓ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న పది మందిలో పింజరి నబీసాహెబ్ (53) అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతావారిలో నాగరాజు, లాల్స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురికి రక్తగాయాలు కావడంతో వెంటనే 108లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామి రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య మస్తానమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలోని కోదండాపురం వద్ద ఆటోను వెనక నుంచి ఢీకొట్టిన పాల ట్యాంకర్ ఒకరి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు టి.గోకులపాడులో విషాదచాయలు -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
అవుకు: మండల పరిధిలోని మారుమడుగుల గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మికాంత్ రెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ లీకై మంటలు చేలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాదంలో రూ.5 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. పీజీ పరీక్షలో కేఎంసీ విద్యార్థుల ప్రతిభ ● రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులు కై వసం కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పీజీ వార్షిక పరీక్షలో కర్నూలు మెడికల్ కాలేజి జనరల్ సర్జరీ విభాగం వైద్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి మొదటి మూడు ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వీరిలో మొదటి ర్యాంకును డాక్టర్ డి.విష్ణుశ్రీకర్‌రెడ్డి 800 మార్కులకు 613, రెండో ర్యాంకును డాక్టర్ ఎ.తేజేశ్వర్‌రెడ్డి 610 మార్కులను, మూడో ర్యాంకును డాక్టర్ పి.వెంకటశివనాగజ్యోతి 602 మార్కులను సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. ఒకే మెడికల్ కాలేజీ విద్యార్థులు మొదటి మూడు ర్యాంకులు సాధించడం రికార్డు అని జనరల్ సర్జరీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ పి.హరిచరణ్ తెలిపారు. -
అహో బలం.. నమో నారసింహం
ఇలపై 108 దివ్యమైన వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది నవనారసింహులు కొలువైన ‘శ్రీ అహోబిల క్షేత్రం’. నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్రం భక్తి ప్రవత్తులకే కాదు ప్రకృతి రమణీయతకు కూడా ఆలవాలం. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సంతోషించిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించాడా అన్నట్లుండే పర్వత శ్రేణి. ఈ పర్వతాల తలభాగంలో వేంకటేశ్వర స్వామి (తిరుమల) నడుముపై నారసింహస్వామి (అహోబిలం), తోకపై మల్లికార్జున స్వామి (శ్రీశైలం) ఆవిర్భవించారని భక్తుల నమ్మకం. – ఆళ్లగడ్డ ● నాటి ‘అహో బలమే’ నేటి అహోబిలం ● రేపటి నుంచి ఓబులేశుడి బ్రహ్మోత్సవాలు ● తరలిరానున్న భక్త జనం ● దినదిన ప్రవర్థమానంగా నారసింహ క్షేత్రం రాక్షస రాజైన హిరణ్యకశపుడి రాజ్యం ‘అహోబిలం’. తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకశపుడిని సంహరించేందుకు లక్ష్మీనరసింహ స్వామి ఉక్కు స్తంభంలోంచి ఉద్భవించిన స్థలం అహోబిల పుణ్యక్షేత్రం. నృసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు ‘అహో బలం’ అని ప్రశంసించడంతో ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది. తర్వాత ఆ పేరు ఆహోబిలంగా మారింది. ఉగ్ర నృసింహస్వామిని పరమశివుడు ‘ఉగ్రం వీరం మహావిష్ణుం’ అనే మంత్రం జపించి శాంతింపజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరదస్వామిని శాంతమూర్తిగా కొలుస్తారు. స్వామితో సమానంగా ఆల్వారులకు నిత్య పూజలు ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి, దిగువన ప్రహ్లాద వరదమూర్తులు కొలువై ఉన్నారు. ఎగువన మార్చి 3 నుంచి, దిగువన 4వ తేదీనుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ప్రపంచంలో ఏ వైష్ణవ క్షేత్రంలో కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒకే అలంకరణ, ఒకే వాహన సేవ లు వరుసగా రెండు రోజులు కొనసాగించరు. అది ఒక అహోబిల క్షేత్రానికే ప్రత్యేకం. ముందు రోజు జ్వాలా నరసింహస్వామికి జరిగిన ఉత్సవం, అలంకరణ, వాహన సేవలు మరుసటి రోజు ప్రహ్లాద వరదస్వామికి నిర్వహించడం ఆనవాయితీ. ఎగువ, దిగువ ఆలయాల చుట్టు మహా భక్తులైన ఆల్వార్లు కొలువై ఉన్నారు. వీరికి ముఖ్య వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీనరసింహస్వామితో పాటు ఈ మూర్తులకు పూజలు చేసి భక్తులు పరమానందం పొందనున్నారు. బ్రహ్మ ప్రారంభించిన ఉత్సవం సృష్టికర్త బ్రహ్మ స్వయంగా ప్రారంభించినందున బ్రహ్మోత్సవం అనే పేరు వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపు సాగుతుంది. దానికే బ్రహ్మరథం అని పేరు. ఈ రథంలో బ్రహ్మదేవుడు ఉండి ఉత్సవం నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వాల్ తిరుమంజనం బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు స్వామి, అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేస్తారు. దీన్ని ’కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ అంటారు. వార్హిక బ్రహ్మోత్సవాలకు ముందు ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలతో పాటు నవనారసింహ క్షేత్రాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. విష్వక్ష్సేనుడి పర్యవేక్షణ శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ కా ర్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆలయానికి నైరుతి దిశలో నిర్ణీత ప్రదేశంలో భూదేవి (పట్ట)ని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా తీసుకొస్తారు. అలా తెచ్చిన మట్టిలో నవధాన్యాలు మొలకెత్తించే కార్యక్రమానికి అంకురార్పణ అని పేరు. గరుడుని స్వాగత పత్రిక లక్ష్మీనరసింహస్వాముల బ్రహ్మోత్సవాలకు సకల దేవ తామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనమైన గరుడి చిత్రాన్ని కొత్త వస్త్రంపై చిత్రీకరిస్తారు. దీ న్నే ‘ గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత నరసింహస్వామి సమక్షంలో నూతన కేతాన్ని పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఆకాశానికెగిసిన గరుడుడు బ్రహ్మోత్సవాలకు రమ్మంటూ ముక్కోటి దేవతలనూ, ఆబాలగోపాలన్ని ఆహ్వానిస్తాడని అర్థం. లక్ష్మీనృసింహుల వాహనసేవలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు కొనసాగుతాయి. ఒక్కో రోజు ఎగువ, రెండు వాహనాల్లో, దిగువ రెండు వాహనాల్లో స్వామి ఊరేగుతారు. ముందురోజు ఎగువన కొలువైన వాహనాల్లోనే మరుసటి రోజు దిగువన కొలువై ఊరేగుతారు. స్వామివారు అధిరోహించే ఒక్కో వాహనానికి ఒక్కో చరిత్ర ఉంది. ప్రతి వాహనంపై నుంచి స్వామి ఒక్కో సందేశమిస్తారు. తీర్థవారి చక్రస్నానం పదో రోజు ఉదయం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు వాహనసేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడానికి ఈ స్నానం జరిపిస్తారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, ఉభయనాంచారులతో స్వామికి అభిషేక సేవ నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో సమాప్తం పదో రోజు అర్ధరాత్రి అనంతరం ధజారోహణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి వారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలకులకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతాన్ని ధ్వజస్తంభం నుంచి దించుతారు. దాంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఎగువ అహోబిలం కొండపై వెలసిన ఉగ్రస్తంభంక్షేత్ర విశిష్టత వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తరించేందుకు 11వ శతాబ్దంలో రామానుజచార్యులవారు, అనేక ప్రముఖ ఆళ్వారులు ఈ స్వామిని దర్శించారు. అన్నమాచార్యుడు ఈ స్వామిని దర్శించి కీర్తించాడు. వీరేగాక వివిధ సామ్రాజ్యాలకు చెందిన చక్రవర్తులు, రాజులు, నవాబాబు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శాసనాలున్నాయి. ఈ దేవాలయం, ప్రాకారాలు నిర్మించడానికి అప్పట్లో 13 సంవత్సరాలు పట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆది శంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్ర నరసింహస్వామిని కరాలవంబ స్తోత్రము (శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే..) జపించగా ఆయనకు తిరిగి చేతులు వచ్చాయి. ఈ సన్నివేశం అహోబిలంలో జరిగింది. ఎగువ అహోబిలంలో స్వామి జ్వాలనరసింహుడై స్వయంభూగా అవతరించగా దిగువ అహోబిలంలో వేకంటేశ్వర స్వామి చేత ప్రతిష్టించబడి ప్రహ్లాదవరదుడిగా కొలువై కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. -
ఉర్దూ కాలేజీలో అడ్మిషన్లు
కర్నూలు సిటీ: ఏపీ ఉర్దూ గురుకుల కాలేజీ (బాలురు) ప్రవేశాలకు దరఖాస్తూలు ఆహ్వానిస్తున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.బుబాసిర్ బేగమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉర్దూ మాతృభాష గల మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా https://aprs. apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల కోసం వచ్చే నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. కాలేజీలో ఉర్దూ మీడియంతో పాటు, ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీ సీ, సీఈసీ గ్రూప్‌లు ఉన్నాయని వెల్లడించారు. భక్తిశ్రద్ధలతో రోజా దర్గా ఉరుసు కర్నూలు కల్చరల్: రోజా దర్గా ఉరుసు శనివారం ఘనంగా జరిగింది. కర్నూలు నగరం తుంగభద్ర నది ఒడ్డున వెలసిన సయ్యద్ షా ఇషాఖి సనావుల్లా ఖాద్రి (రోజా) దర్గాకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా దాదా బాషా ఖాద్రీ చర్యలు తీసుకున్నారు. దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉరుసు సందర్భంగా శనివారం రాత్రి ఖవ్వాలి కార్యక్రమం నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖలు దర్గాను దర్శించుకున్నారు. నేడు ప్రత్యేక జియారత్ ఫాతెహాలతో ఉత్సవాలు ముగుస్తాయని పీఠాధిపతి తెలిపారు. పాడి పశువులకు టీకాలు కర్నూలు(అగ్రికల్చర్): పశువుల్లో గాలికుంటు, బ్రూసెల్లోసిస్ వ్యాధుల నివారణకు ఈనెల 30 వరకు టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువ్యాది నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ రవిబాబు తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైందన్నారు. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య నందవరం: వరకట్నం తేవాలని భర్త, అత్తింటివారు వేధిస్తుండటంతో భరించలేక స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆశీర్వాదమ్మ (26) శనివారం వేకువజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఆశీర్వాదమ్మ, మాదన్న ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. రెండేళ్లుగా కాపురం అనోన్యంగా సాగింది. ఈ క్రమంలో గత ఆరు నెలల నుంచి వరకట్నం తేవాలని అత్తింటివారు వేధిస్తున్నారు. భర్త మాదన్న, అత్తమామలు మరియమ్మ, యేసన్న, బావవదినలు చంద్రశేఖర్, చిన్నారి ఆమెను కట్నం తేవాలని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయమై శుక్రవారం ఆశీర్వాదమ్మ, భర్త మాదన్న మధ్య గొడవ జరిగింది. దీంతో విరక్తిచెందిన ఆశీర్వాదమ్మ ఇంట్లో ఇనుప రాడ్డుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృత్యురాలి తల్లిదండ్రులు నరసన్న, మాణికమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో ఆలయాల్లో పూజలు చేయించుకుని మొదటి సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఉదయం 8.15 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్దేశించిన సమయం 9 గంటలలోపే పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఎనిమిది రూట్లలో అదనపు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేశారు. శనివారం మొదటి సంవత్స విద్యార్థులు జనరల్ విభాగం విద్యార్థులు 21,462 మందికిగాను 20,984 మంది హాజరై 478 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగానికి చెందిన విద్యార్థులు 2,293 మందికిగాను 2,160 మంది హాజరుకాగా 133 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ గురవయ్యశెట్టి, డీవీఈఓ వై.పరమేశ్వరరెడ్డి, స్పెషల్ ఆఫీసర్.. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తొలి రోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు -
కనిపించని ‘భరోసా’
కొలిమిగుండ్ల ఎస్సీ కాలనీ వీధిలో పింఛన్ల కోసం నిల్చున్న లబ్ధిదారులు కొలిమిగుండ్ల: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నామమాత్రంగా పంపిణీ చేస్తున్నారు. సిగ్నల్ సమస్య, ఇతర కారణాలతో వీధులు, రచ్చబండల వద్ద కూర్చొని పింఛన్ అందిస్తున్నారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. అలాగే ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ వాయిస్ రికార్డ్ వినిపించాలని ఉత్తర్వులు ఇచ్చారు. చాలా గ్రామాల్లో వీధుల్లోనే పింఛన్లు పంపిణీ చేశారు. అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. -
ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం
పల్లె పండుగ వారోత్సవాలు, నాబార్డు కింద చేపట్టిన పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చేసిన పనులకు చేసినట్లుగా ఎంబుక్ రికార్డు చేసి బిల్లులను అప్లోడ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన పడకుండా చేపట్టిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. బిల్లుల చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం. – వీ రామచంద్రారెడ్డి, పీఆర్ ఎస్ఈ ● -
ఆధ్యాత్మిక ‘నెల’వంక
నేటి ఇఫ్తార్: 6.31 రేపటి సహెరీ: 5.13సాశ్రీశ్రీఉశ్రీశ్రీకర్నూలు కల్చరల్: ముస్లింల పవిత్ర మాసం రంజాన్. దీంతో నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో వారు పర్వదినాన్ని జరుపుకుంటారు. మానవాళికి మార్గదర్శనం చేసే ఖురాన్ సైతం ఈనెలలోనే అవతరించింది. ఎన్నో విశేషాలు కలిగిన ఈ మాసం శనివారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమైంది. ‘చాంద్ దిఖ్ గయా’ అంటూ ఒకరి నొకరు ముబారక్ చెప్పుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే కర్నూలులో అవుట్ పేలడంతో రాత్రి మొదటి తరావీహ్ నమాజు చేసుకున్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు ఉపవాసాలు (రోజా) పాటించనున్నారు. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు హిలాల్ కమిటీ ప్రకటించింది. మాసమంతా ఆధ్యాత్మిక చింతన ‘రంజాన్ మాసం’ ప్రతి ముస్లిం అల్లాహ్ నుంచి వరా లు అందుకునే సౌభాగ్యం కల్పించే నెల. కఠోర దీక్ష, చిత్తశుద్ధితో అల్లాహ్‌ను ప్రార్థించిన వారికి చక్కటి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఉపవాసాలు ఉండడంతో పాటు రోజుకు ఐదు పూటలు నమాజు చదువుతారు. రోజూ ఖురాన్ పఠనం లేదా శ్రవణం చేస్తారు. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతోపాటు పరిహారం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ఉచిత సహెరీకి ఏర్పాట్లు ఉపవాస దీక్షల సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు సహెరీ ఏర్పాట్లు చేశారు. కర్నూలు నగరంలోని లాల్ మసీదు వద్ద ఉన్న ఖూబ్సూరత్ మసీదులో, పెద్దమార్కెట్ వద్ద ఉన్న నూరానీ మసీదులో, ఖడక్‌పురలో ఉన్న డాక్టర్ మియా హత్తి (ఏనుగు) బీడీ ఫ్యాక్టరీలో, కొత్తపేటలో ఉన్న హజరత్ మౌలా మిష్కిన్ మసీదులో, కొత్తపేటలోని ఖా దుమియా మసీదులో, సి.క్యాంప్ సెంటర్లోని మామూర్ మసీదులో, అబ్బాస్ నగర్‌లోని యూ నిఖ్ స్కూల్ వద్ద ఉన్న అబ్బాస్ మసీదులో సహెరీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఫొటో: డి. హుస్సేన్ నేటి నుంచి రంజాన్ ఉపవాసాలు షురూ నెల రోజులు దైవ చింతనలో గడపనున్న ముస్లింలు ఉచిత సహెరీ ఏర్పాట్లు చేసిన స్వచ్ఛంద సంస్థలు -
ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!
● ‘పల్లె పండుగ’ రోడ్లు వేసినా అందని బిల్లులు ● సంక్రాతి అన్నారు.. శివరాత్రి కూడా పాయే! ● రూ.55 కోట్లకు విడుదలైంది రూ.14 కోట్లు మాత్రమే ● అదే దారిలో నాబార్డు పనులు ● ఆందోళనలో కాంట్రాక్టర్లు పని పూర్తి చేసి ఆరు నెలలైనా... ఈ చిత్రంలో కనిపిస్తున్నది కోడుమూరు మండలం క్రిష్ణాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు. 4.10 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగు చేసేందుకు రూ.2.97 కోట్లు వెచ్చించారు. పని పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా, నేటి వరకు కూటమి ప్రభుత్వం నయాపైసా బిల్లు విడుదల చేయలేదు. అలాగే కర్నూలు మండలం పడిదెంపాడు, పూడూరు మీదుగా కోళ్లబావాపురం వరకు (14.58 కి.మీ), రూ.11.85 కోట్లు ఖర్చు చేసి రోడ్డు నిర్మించినా, నేటి వరకు ఒక్క రూపాయ బిల్లు కూడా విడుదల కాలేదు.కర్నూలు(అర్బన్): అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం రోడ్ల పనులపై హడావిడి చేసింది. పల్లె పండుగ వారోత్సవాలంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. చేసిన పనులకు చేసినట్టుగా బిల్లులను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ పనులన్నింటినీ సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని నిర్ణీత లక్ష్యాన్ని విధించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటి వరకు రూ.67.58 కోట్ల అంచనాతో చేపట్టిన మొత్తం 830 రోడ్లలో 814 రోడ్లను పూర్తి చేశారు. చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.55 కోట్లను విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.14 కోట్లను మాత్రమే విడుదల చేసింది. సంక్రాంతి పండుగ నాటికి అన్ని రోడ్లు పూర్తి చేయాలని, బిల్లులను కూడా సకాలంలో విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం శివరాత్రి పండుగ పోయినా కూడా బిల్లులను విడుదల చేయలేదు. పల్లెల్లో ఆయా సీసీ రోడ్ల పనులను చేపట్టిన చిన్న చితకా కాంట్రాక్టర్లు బిల్లులు ఎప్పుడు విడుదలవుతాయోనని గగ్గోలు పెడుతున్నారు. నయాపైసా ఇవ్వకుండా.. గత ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయి చేపట్టిన నాబార్డు పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం నేటి వరకు నయాపైసా బిల్లులను చెల్లించలేదు. జిల్లాకు మొత్తం నాబార్డు కిందరూ.61.40 కోట్లతో మొత్తం 12 పనులు ( 98.09 కిలోమీటర్లు ) చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు రెండు పనులు పూర్తి కాగా, మిగిలిన 10 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 12 పనులకు సంబంధించి రూ. 38.13 కోట్ల పనులను పూర్తి చేశారు. అయితే ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాకపోవడం వల్ల ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో కోడుమూరు మండలం క్రిష్ణాపురం, కర్నూలు మండలం కేజీ రోడ్డు నుంచి కళ్లబావాపురం వయా పడిదెంపాడు, పూడు రు రోడ్ల పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. పనులను పూర్తి చేసిన వారితో పాటు వివిధ దశల్లో పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు జిల్లాకు చెందిన 41 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికి స్థానిక బి.క్యాంప్‌లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. రేపటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు కర్నూలు సిటీ: జిల్లా సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్) ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పా ల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాసకులు https://www.apopen school.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకొని స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ సంతకం చేయించుకోవాలన్నారు. పరీక్షలకు 9 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,239 మంది అభ్యాసకులు హాజరవుతున్నారన్నారు. అభ్యాసకుల అనుమానాల నివృత్తికి డీఈఓ ఆఫీస్‌లో 9966562862, 9398128893 నెంబర్లతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. అగ్నిమాపక సిబ్బంది యూనిఫాంలో మార్పులు కర్నూలు: అగ్నిమాపక శాఖలో లీడింగ్ ఫైర్‌మెన్, డ్రైవర్, ఆపరేటర్, ఫైర్‌మెన్‌ల యూనిఫాంలో స్వల్ప మార్పు చేశారు. ఆయా హోదాల్లోని ఉద్యోగులు నేవీ బ్లూ కలర్ క్యాప్(టోపీ), ఆలివ్ కొమ్మల గుర్తుతో కూడిన నలుపు రంగు బెల్టు ధరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ చేతుల మీదుగా అందుకున్న నూతన యూనిఫాంను సిబ్బంది ధరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, కర్నూలు కేంద్ర ప్రతినిధి చింతల రామాంజనేయులు, లీడింగ్ ఫైర్మెన్లు వెంకటరాముడు, నరేష్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ ఎక్కడా కనిపించలేదు. లబ్ధిదారుల ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా పింఛన్ అందలేదు. అన్ని చోట్లా అవ్వతాతల, దివ్యాంగుల అవస్థలే దర్శనమిచ్చాయి. ప్రచారంలో భాగంగా 20 సెకండ్ల నిడివి కలిగిన ఆడియోను వి
తుగ్గలి మండలం ఆర్ కొట్టాలలో వీధిలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యంవీధి చివరన ఎదురుచూపు● ఉమ్మడి కర్నూలు జిల్లాలో అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ ● సచివాలయాలకు వెళ్లి నిరీక్షించినా అందని ‘భరోసా’ ● సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జాప్యం ● రచ్చబండల దగ్గర, చెట్ల కింద తప్పని ఎదురుచూపులు ● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అవ్వతాతలు, దివ్యాంగులు సి.బెళగల్: మండలంలో పింఛన్ పొందేందుకు లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం ఏడు గంటల అనంతరం కొంతమంది అధికారులు పింఛన్‌ను అందజేశారు. అయితే కొంతమంది అధికారులు గ్రామాలకు ఆలస్యంగా చేరుకోవడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పలేదు. అవ్వాతాతలు వీధి చివరలోని అరుగులను ఆశ్రయించారు. అధికారులు సైతం ఒకే చోట కూర్చుని అక్కడికే లబ్ధిదారులను పిలుపించుకుని పింఛన్ పంపిణీ చేశారు. మండల కేంద్రం సి.బెళగల్లో పాల కెనరా బ్యాంక్ దగ్గరున్న దుకాణం దగ్గర, తెలుగు వీధిలోని మసీద్ దగ్గర, కొంతమంది వీధి చివరన అరుగుల మీద కూర్చుని పంపిణీ చేశారు.కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. చాలా గ్రామాల్లో రచ్చబండలు, వీధుల్లోకి రప్పించి పంపిణీ చేయడం చూసి అవ్వతాతలు నోరెళ్లబెట్టారు. పడిగాపులు కాసి అతి కష్టం మీద పింఛన్లు తీసుకున్నారు. పలువురు సచివాలయ ఉద్యోగులు కొందరు ఉదయం ఏడు గంటలకే పింఛన్ లబ్ధిదారుల ఇంటి దగ్గరకే వెళ్లినా సర్వర్ సమస్య వచ్చింది. దీంతో అందరినీ ఒకేచోట పిలిపించి పంపిణీ చేపట్టారు. దివ్యాంగులు, వృద్ధులు అతి కష్టం మీద పింఛన్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకొని వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా మంత్రాలయంలో, మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో పింఛన్లు పంపిణీ చేశారు. డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 2,38,798 పింఛన్లు ఉండగా 2,25,767 పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,031 పింఛన్లు ఉండగా 2,00,936 పంపిణీ చేశారు. అంతా అస్తవ్యస్తం పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. కల్లూరు, కోడుమూరు, సి.బెళగల్, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ కేవలం నామమాత్రానికే పరిమితం అయింది. ఎక్కువ మంది సచివాలయాలకే వెళ్లి పింఛన్లు తెచ్చుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇచ్చేవారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు సంతోషం వ్యక్తం చేసేవారు. పింఛన్ల పంపిణీ వారం రోజుల పాటు కొనసాగేది. దూర ప్రాంతాల్లో ఉండేవారికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి వలంటీర్లు పింఛన్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో ఈ పరిస్థితులు లేవు. రచ్చబండల దగ్గర, చెట్లకింద, వీధుల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో అవ్వతాతలకు, దివ్యాంగులకు తిప్పలు తప్పడం లేదు. తుగ్గలి: పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల కూడా కష్టాలు తప్పలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలనెలా లబ్ధిదారుల ఇంటి వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్ అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తుగ్గలి మండలంలోని ఆర్ కొట్టాల గ్రామంలో శనివారం మూడు చోట్ల పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ హంగామే! పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వీడియోను లబ్ధిదారులకు చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వేలాది మంది దివ్యాంగులు, వృద్ధులు వచ్చినా వారికి వెంటనే పింఛన్లు ఇవ్వలేదు. అవ్వతాతలు చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రంగా సాగింది. -
నేరాల నియంత్రణకు కృషి
● జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు (టౌన్): నేరాల నియంత్రణకు పోలీసులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. హత్య కేసులు, పోక్సో కేసులు ఎప్పటి కప్పుడు తెలియజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మోటారు సైకిల్ నడిపే సమయంలో పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ ధరించాలన్నారు. పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ ఆడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, హేమలత, భాస్కరరావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి ఒక్క ప్రకటనా లేదు
● కర్నూలు, నంద్యాల జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం పైసా కూడా ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు. ● ఓర్వకల్లు ఇండస్ట్రియల్హబ్కు పరిశ్రమలు వస్తున్నాయని ఇటీవల భరత్ ప్రకటించారు. ● అయితే ఒక్క పరిశ్రమపై కూడా బడ్జెట్లో ప్రస్తావన చేయలేదు. ● రూ.150కోట్లతో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ శాశ్వత భవనాలు, కర్నూలు నగరానికి ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, డోన్‌లో ఇన్స్టిట్యూట్ ఆఫ్‌మైన్స్, శ్రీశైలంలో టైగర్పార్క్, ఆలూరులో జింకలపార్క్, ఆదోని, ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టైక్స్‌టైల్ అప్పెరల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ● కర్నూలులో మైనార్టీ స్టడీ సర్కిల్ ఏర్పాటు, కర్నూలులోని సర్వజన వైద్యశాలను ‘రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్’ స్థాయిగా అభివృద్ధి చేస్తామన్నారు. ● నంద్యాలను ‘సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా అభివృద్ధిచేసి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థను డీమ్డ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ● బడ్జెట్లో వీటికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిధులు కేటాయించని పరిస్థితి. -
‘గురు’ భక్తి.. భక్త కోటికి ముక్తి
● నేటి నుంచి శ్రీరాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు ● ఆరు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణమంత్రాలయం: ప్రహ్లాదరాయల స్వరూపులు.. భక్తుల కల్పతరువు.. శ్రీరాఘవేంద్రస్వామి. పవిత్ర తుంగభద్ర నదీతీరాన సశరీరంగా బృందావనస్థులై ఖండాంతరాలకు ఖ్యాతిని గడించిన కామధేనువు. సద్గురు శ్రీరాఘవేంద్రుల జయంతి, పట్టాభిషేకం పురస్కరించుకుని గురు వైభవోత్సవాలు శనివారం నుంచి కనుల పండువగా జరగనున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఆరు రోజులు వేడుకలు నిర్వహిస్తారు. శనివారం శ్రీగురుని 404వ పట్టాభిషేకం, 6వ తేదీన జయంతి ఉత్సవాలు ప్రత్యేకంగా చేస్తారు. శనివారం పాదుక పట్టాభిషేకంలో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకం ఉంటాయి. వైభవోత్సవాల్లో రోజూ రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం ప్రాకారాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ సాయంత్రం యోగీంద్ర మంటపంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఊంజల మండపంలో జ్ఞానయజ్ఞ ప్రవచనాలు ఉంటాయి. -
నేడు ప్రధాని వెబ్‌నార్
● కర్నూలులోని ఉద్యాన భవన్ వేదిక కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెబ్‌నార్ నిర్వహించనున్నారని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్డీఎం) ఎస్ఆర్ రామచంద్రరావు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఉద్యానభవన్‌లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వెబ్‌నార్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులతో ప్రధాని ముఖాముఖి అవుతారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా పంపిణీ చేసే వ్యవసాయ రుణ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వెబ్‌నార్‌లో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొంటారని తెలిపారు. నెలాఖరు వరకు పశుగణన కర్నూలు(అగ్రికల్చర్): 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని ఈ నెల చివరి వరకు పొడిగించారు. గత అక్టోబర్ చివరి వారంలో మొదలైన పశుగణన ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి నెల చివరితో ముగియాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 4,73,516 ఇళ్లు ఉన్నాయి. 15 ఏళ్ల కాలంలో లక్షలాది కొత్త గృహాలు వెలిశాయి. వీటిన్నంటిని కూడా ఎన్యూమరేటర్లు సందర్శించి పశుగణన చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగానే మార్చి నెల 31 వరకు పశుగణనను పొడిగించినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జి.శ్రీనివాస్ తెలిపారు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 69 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొదటి సంవత్సరం 23,098, ద్వితీయ సంవత్సరం 22,227 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలోని గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం నుంచి జోనల్, రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియెట్ కార్యాలయం వరకు పర్యవేక్షణ చేసేందుకు లైవ్‌స్ట్రీమ్ సదుపాయాలను కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రాల్లోకి అనుమతించరు. ఇంటి దగ్గర పింఛన్ కష్టమే! ● 300 మీటర్ల దూరంలో పంపిణీ కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేయగా.. ఇంటి నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) దూరంలో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే కారణాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ సందేశాన్ని ఆడియో రూపంలో లబ్ధిదారులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 1న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలెట్‌గా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క సచివాలయంలో కూడా 100 శాతం ఇంటిదగ్గర పింఛన్లు పంపిణీ చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రచ్చబండల దగ్గరే పంపిణీ సాగుతోంది. మార్చి నెలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నెలలో 1,095 పించన్లపై కోత పడింది. ‘లేపాక్షి’లో క్లియరెన్స్ సేల్స్ కర్నూలు(అగ్రికల్చర్): తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హ్యాండీక్రాప్ట్ ఎంపోరియంలో యూనివల్ క్లియరెన్స్ సేల్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేనేజర్ తిమ్మయ్య తెలిపారు. ఈ సదుపాయం మార్చి1 నుంచి 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఆయ న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాప్ట్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ ఆదేశాల మేరకు అన్ని రకాల వస్తువులపై 10 శాతం, ఎంపిక చేసిన వస్తువులపై అఫ్టు 50 శాతం తగ్గింపు సదుపాయం ఉంద ని తెలిపారు. హస్తకళా వస్తువులు, చేనేత వ స్త్రాలు అందుబాటులో ఉన్నాయని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేసిన బడ్జెట్
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ ఏపీ ప్రజలను మోసం చేసింది. 9 నెలల పాలనలో ఒక్క రూపాయి సంక్షేమానికి ఖర్చు చేయని కూటమి సర్కార్ రూ. లక్ష కోట్లు అప్పు చేయడం అసలైన ఆర్థిక అరాచకం. అన్ని వర్గాల ప్రజల ఆశలను ఈ ప్రభుత్వం చిదిమేసింది. ఎన్నికలకు ముందు లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు నిధులు కేటాయించలేక కల్లబొల్లి మాటలు చెప్పడం విడ్డూరం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
‘ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతాం..’ అని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా చెప్పిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేటాయింపుల్లో మాత్రం చేతులెత్తేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో సూపర్ సిక్స్‌కు పైస
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది మాసాలు పూర్తయినా ప్రధాన హామీ ‘సూపర్ సిక్స్’ అమలుపై మీనమేషాలు లెక్కించించింది. ఈ బడ్జెట్లోనైనా వాటిని అమలు చేస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తల్లికివందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లకు అరకొర నిధులు కేటాయించగా.. తక్కిన యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు హామీలను అటకెక్కించింది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ రూ.15వేల చొప్పున తల్లికివందనం జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బడ్జెట్లో రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ నిధులను చూస్తే ఇంటికి ఒక్కరికి మాత్రమే నిధులు విడుదల చేస్తారని, అది కూడా అర్హులైన లబ్ధిదారులను భారీగా తగ్గిస్తారని స్పష్టమవుతోంది. ఇక అన్నదాత సుఖీభవ కింద కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకే రూ.1061 కోట్లు అవసరం. కానీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.6,300కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే అమలు ఏస్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. ఉద్యోగుల ఆశలపై నీళ్లు ‘కూటమి ప్రభుత్వం’ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, డీఏలపై ప్రకటన ఉంటుందని భావించారు. 2024లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీ కమిషన్ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ కమిషన్ ఏర్పాటు కాలేదు. బడ్జెట్లో వీటిపై కీలక ప్రకటనలు చేస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. -
డ్రిప్‌పై తప్పుడు ప్రకటనలు
యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు అమలు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.7,179.09 కోట్లు లబ్ధిదారులకు నష్టం వాటిల్లింది. ఈ బడ్జెట్లో వీటి ప్రస్తావన లేకపోవడంతో రెండేళ్లకు రూ.14,358.18కోట్లు కోల్పోయినట్లే. నిజాని ప్రతి ఇంటికీ ఉద్యోగం కల్పిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన అధికారం చేపట్టిన రోజు నుంచి ఉద్యోగం కల్పించే వరకూ భృతి చెల్లించాల్సి ఉన్నా మంగళం పాడేశారు. డ్రిప్ ఇరిగేషన్‌ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని మంత్రి ప్రకటించారు. అయితే గత ప్రభుత్వం రెండు బడ్జెట్లలో ఉమ్మడి జిల్లాలో ఏటా 27,500 ఎకరాలకు డ్రిప్ మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ దఫా బడ్జెట్లో 14వేల హెక్టార్లకే డ్రిప్‌ను ప్రతిపాదించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ రెండూ పొరుగు జిల్లాలు. గుంటూరులో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఇప్పటికే ఉంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలోనే రెండు క్లస్టర్ యూనిట్లు ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం కర్నూలును విస్మరించింది. ఉమ్మడి గుంటూరులో 1,07,053 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 55,799 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,17,867 ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. అనంతపురంలోనూ 35,443 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. కనీసం కర్నూలులో క్లస్టర్యూనిట్ ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమకు ఎంతో ఉపయోగకరం. అలాంటిది కేశవ్ సీమ వాసిగా ఈ ప్రాంతాన్నే విస్మరించడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
కర్నూలు(సెంట్రల్): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి.. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..టమాటా, ఉల్లి, మిర్చి, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ , ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు సంబంధించి భూమి గుర్తించేందుకు సంబంధిత ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లతో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ జెడ్ఎం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా త్వరగా రుణాలు ఇవ్వాల ని బ్యాంకర్లను ఆదేశించారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అనంతరం రూ.1.69 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు. పరిశ్రమల శాఖ ఇన్చార్జ్ జీఎం అరుణ, ఏపీఐఐసీ జెడ్ఎం చిరంజీవి, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయకుమార్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, దళిత ఇండియన్చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కో ఆర్డినేటర్ దిలీప్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి, ఉద్యాన శాఖాధికారి రామాంజనేయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా -
పూర్తిస్థాయి బడ్జెట్లోనూ సూపర్ సిక్స్‌కు ఎగనామం
● ఊసేలేని యువనేస్తం, మహాశక్తి, ఉచితబస్సు ● ఈ ఆర్థిక సంవత్సరానికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లేనట్లే.. ● గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి క్లస్టర్ యూనిట్ ● ఉమ్మడి కర్నూలు జిల్లాకు మొండిచేయి ● హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్పైనే ప్రకటన ● మాటలకే పరిమితమైన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ● ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధికి పైసా విదల్చని వైనం -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
కర్నూలు కల్చరల్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉండటంతో కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లు, వసతుల కల్పన తదితర విషయాలను ఆర్ఐఓ గురవ్య శెట్టి గురువారం విలేకరులకు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులందరూ బెంచీలపై కూర్చొని పరీక్షలు రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం 23, 098 మంది, ద్వితీయ సంవత్సరం 22, 227 మంది మొత్తం 45,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కర్నూలు జిల్లాలో చిప్పగిరి, కోసిగి, పత్తికొండ, దేవనకొండ, కృష్ణగిరి, గోనెగండ్ల, ఆలూరు జూనియర్ కళాశాలల్లోని 7 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హాల్ టికెట్‌పై కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూం ఫోన్ 08518 222047 నంబర్‌ను సంప్రదించవచ్చు. విలేకరుల సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ జి.లాలెప్ప, డీఈసీ మెంబర్లు కె.నాగభూషణ్ రెడ్డి, యు.పద్మావతి, జీఎస్ సురేష్ చంద్ర, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్చార్జ్ కె. రమాదేవి పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు -
పోసాని అరెస్టు అనైతికం
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తప్పిదాలను రెండేళ్ల క్రితం విమర్శించిన పోసాని కృష్ణమురళిని అర్ధంతరంగా అర్ధరాత్రి అరెస్టు చేయడం అనైతికం అని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ‘కూటమి’ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి కేవలం కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 111 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఎప్పుడో పాత కేసులను తిరగదోడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వం దిగజారుడు విధానాలు అమలు చేస్తోందన్నారు. అసలు డిప్యూటీ సీఎం ఉన్నారా? రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారా అని ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని పదే పదే చెప్పిన పవన్ తర్వాత ఒక్క మహిళనైన కనిపెట్టగలిగరా అని ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేసిన విషయాన్ని వీడియోలతో సహా కర్నూలు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏం చేశారన్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తున్నాయని, ప్రజలే కూటమి ప్రభుత్వం భరతం పడతారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి -
వచ్చాడయ్యో స్వామి..!
● పార్వేట ముగించుకుని కొండకు చేరిన అహోబిలేశులు ఆళ్లగడ్డ: తమ వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించేందుకు పార్వేటగా కొండ దిగిన జ్వాలా నారసింహస్వామి, ప్రహ్లాదవరదుడు తిరిగి అహో బిలం క్షేత్రం చేరుకున్నారు. 33 గ్రామాల్లో పల్లకీలో విహరిస్తూ పార్వేట ముగించుకుని క్షేత్రం చేరుకున్న స్వామి వార్లకు వేద పండితులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. పొలిమేర దాక వేదపండితులు ఎదురేగి మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉత్సవమూర్తులను ఆలయ సన్నిధికి చేర్చారు. స్వామి రాకతో క్షేత్రంలో పండగ వాతావరణం నెలకొంది. పార్వేటగా గ్రామాల్లో సంచరిస్తూ అలసి పోయిన స్వామి వార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజలు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దిగువ అహోబిలంలో పూజల అనంతరం జ్వాలా నర సింహస్వామిని పల్లకీలో ఎగువ అహోబిలానికి చేర్చారు. -
హరహర మహాదేవ!
అశేష భక్తజనం మధ్య మల్లన్న రథోత్సవం, (ఇన్సెట్) చిన్నారి భక్తిభావం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న రథోత్సవం నయన మనోహరంగా సాగింది. మహాశివరాత్రి రోజు శ్రీభ్రమరాంబాదేవిని వివాహ మాడిన మల్లికార్జునస్వామి గురువారం సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో రథంపై ఊరేగారు. ఓం నమఃశివాయ, శంభో..శంకర అని భక్తులు నినదిస్తుండగా రథోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గంగాధర మండపం వద్దకు పల్లకీ మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం రథశాల వద్ద అర్చక వేదపండితులు రథాంగపూజ, రథాంగ హోమాది క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను రథంలో ఆశీనులు చేశారు. జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు రథోత్సవ పూజలో పాల్గొన్నారు. అనంతరం సాత్వికబలిగా కొబ్బరికాయ, గుమ్మడికాయలను సమర్పించారు. ఆ తర్వా త భక్తులు శివ నామ స్మరిస్తుండగా.. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా రథం ముందుకు కదిలింది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం నిర్వహించారు. రథంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి నీరాజనాలు సమర్పించారు. ఓం నమఃశివాయ, శంభో శంకర అంటూ భక్తులు పరమేశ్వరుడిని కీర్తించారు. రథోత్సవం ముందు కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పువాయిద్యాలు, గొరవయ్యల నృత్యాలు, భాజాభజంత్రీలు, వివిధ కళాకారుల రూపాలు ఆకట్టుకున్నాయి. రథోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణి వద్ద కనుల పండువగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పుష్కరిణిలో తెప్పపై ఉంచారు. స్వామి అమ్మవార్లు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకున్నారు. వైభవంగా మల్లన్న రథోత్సవం మారుమోగిన శివనామస్మరణ కనుల పండువగా తెప్పోత్సవం నేడు బ్రహ్మోత్సవ క్రతువులకు యాగ పూర్ణాహుతి నేడు పూర్ణాహుతి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాది క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఉదయం స్వామివారి యాగశాలలో అర్చకులు, అధికారులు పూజలు చేసి పూర్ణాహుతి జరపనున్నారు. అనంతరం వసంతోత్సవం, కలశోత్సవం, త్రిశూలస్నా నం చేస్తారు. సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. -
పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలి
కర్నూలు(అర్బన్): ఇంటర్ పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని కార్మికశాఖ ఉప కమిషనర్ కే వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్నందున, ఆ సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్, నెట్ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. అలా చేయని కేంద్రాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతి రోజూ 20 ఎకరాల్లో ‘భూసర్వే’
మద్దికెర: ప్రతి రోజు 20 ఎకరాల్లో భూసర్వే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య ఆదేశించారు. మండల పరిధిలోని పెరవలి గ్రామ పరిసరాల్లో జరుగుతున్న భూసర్వే కార్యక్రమాన్ని గురువారం ఆమె పరిశీలించారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి భూమి కొలతల ప్రకారం సర్వే చేయించి రికార్డుల్లో నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామంలోని అసైన్డ్భూములను పరిశీలించారు. పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్, తహసీల్దార్ హుస్సేన్‌సాహెబ్, ఆర్ఐ రవికుమార్, వీఆర్వో రంగస్వామి పాల్గొన్నారు. పట్టుపరిశ్రమ సహాయకులకు త్వరలో పదోన్నతి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పట్టు పరిశ్రమ శాఖలో పని చేస్తున్న గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుల(వీఎస్ఏ)కు పదోన్నతి లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 11 మంది వీఎస్‌ఏలు పనిచేస్తున్నారు. వీరికి సాంకేతిక సహాయకులు(టీఏ)గా పదోన్నతి కల్పించనున్నారు. ఇప్పటి వరకు వీరు సచివాలయ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పదోన్నతులు పొందడం ద్వారా వీరు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలోకి వస్తారు. పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసింది. పదోన్నతులకు సంబంధించిన ఫైలు జేసీకి పంపారు. అక్కడి ఆమోదం పొందిన తర్వాత కర్నూలు, నంద్యాల జిల్లాల పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పోస్టింగ్‌లు ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కర్నూలు న్యూసిటీ/రూరల్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. గురువారం కర్నూలు ఆర్డీఒ కార్యాలయంలో కమిటీ సభ్యులు ఆర్డీఓ కె.సందీప్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ నిర్మల, అడిషనల్ డీఎంహెచ్ఓ, సీడీపీఓ వరలక్ష్మి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి మండలాల పరిధిలోని ఐదు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీ ఉండగా 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందు లో 11 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 40 అంగన్వాడీ ఆయా పోస్టులకు 200 మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూలకు 163 మంది హాజరైనట్లు ఐసీడీఎస్ పీడీ నిర్మల తెలిపారు. రేపు ఆదోని, 4న పత్తికొండ డివిజన్లలో.. ఆదోని పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా ల పోస్టుల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నారు. అలాగే పత్తికొండ డివిజన్లో 4 టీచర్ పోస్టులకు, 26 ఆయా పోస్టులకు వచ్చేనెల 4న ఇంటర్వ్యూలు జరపనున్నారు. -
రూ.6.91 కోట్లతో నీటి ఎద్దడి నివారణ
కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో జిల్లాలోని పలు గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.6.91 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు బీ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తలేదని, ఆయా ఎస్ఎస్ ట్యాంకుల్లో కూడా నీరు సమృద్ధిగా ఉందన్నారు. రానున్న మార్చి, ఏప్రిల్, మే నెలలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలోని ఇంజినీర్ల ద్వారా ఎన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చనే అంశంపై సర్వే నిర్వహించి నివేదికలను తెప్పించుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని 25 మండలాల్లోని 721 జనవాసాల్లో 191 జనవాసాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తవచ్చనే అభిప్రాయానికి వచ్చామన్నారు. ఇందులో 76 జనవాసాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడరాదని రూ.3.89 కోట్లతో రవాణాతో తాగునీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు రూపొందించామన్నారు. అలాగే రూ.1.2 కోట్లతో సమీప గ్రామాల్లో నీటి సోర్సులను అద్దెకు తీసుకోవాలని, ఎస్ఎస్ ట్యాంకులను నింపేందుకు రూ.5 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనాకు వచ్చామన్నారు. రూ.2.95 కోట్లతో బోర్లలో డీపెనింగ్, ఫ్లష్సింగ్ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించామన్నారు. ఆదోని, కౌతాళం, ఆస్పరి, పెద్దకడుబూరు, కోసిగి, మద్దికెర, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లోని 115 గ్రామాలకు రవాణాతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చనే అభిప్రాయం మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీ నాగేశ్వరరావు -
రాష్ట్రంలో అరాచక పాలన
కల్లూరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తున్నారన్నారు. గొంతుకు ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నా పోసానిపై చంద్రబాబు సర్కారు తన క్రూరత్వాన్ని ఆపలేదన్నారు. మహాశివరాత్రి రోజు హైదరాబాద్‌లో ఉన్న పోసాని ఇంటికి రాత్రిపూట పోలీసులను పంపి, అరెస్టు చేయించారన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న వారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని, వ్యవస్థలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అరెస్టు అయిన వ్యక్తికి న్యాయం సహాయం అందకుండా, బెయిలు రానీయకుండా, నెలల తరబడి జైల్లో అక్రమంగా నిర్భంధించేలా ఒక తప్పుడు సంప్రదాయాన్ని చంద్రబాబు తీసుకువచ్చారన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం, పోలీసుల తీరు మారదడం లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా ‘పచ్చ’ సైకోలు రోజూ చెలరేగిపోతున్నారన్నారు. మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారన్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తూ వైఎస్సార్సీపీ చేస్తున్న ఫిర్యాదులను తొక్కి తెడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలన జరిగిన మంచితో పోల్చిచూస్తే కూటమి ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా రాష్ట్రంలో ప్రజలకు జరిగిన మంచి ఏమీ కనిపించడం లేదన్నారు. పతాక స్థాయికి కక్ష రాజకీయాలు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
గద్వాల జిల్లా వృషభాల జయకేతనం
కృష్ణగిరి: మండలంలోని చుంచు ఎర్రగుడి గ్రామంలో రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం స్వా మి వారిని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, కబడ్డీ, బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఆరుపళ్ల వృషభాల బండలాగుడు పోటీల్లో విజేతలుగా గద్వాల జిల్లా ఎస్ఎస్కె బుల్స్ హర్షద్పాష, అబ్దుల్ బాషా వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.40వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. తర్వాతి నాలుగు స్థానాలలో వరుసగా కర్నూలు బి.తాండ్రపాడు చిన్నరత్నం వృషభాలు, పందికోన, మల్యాలకు చెందిన ఎస్ఎస్వివీ టైగర్స్, షేక్ మైమున్నా ఎద్దులు సంయుక్తంగా, నంద్యాల కొణిదెల వెంకటేశ్వర్లు , కోడుమూరు వర్కూరు తలారి రామచంద్ర వృషభాలు వరుసగా రూ. 30వేలు, రూ.20వేలు, రూ.10వే లు, రూ.5వేలు నగదు గెలుచుకున్నాయి. అలాగే.. హోంటీమ్ టోర్నీ పేరుతో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా గోనెగండ్ల జట్టు నిలిచి రూ.20 వేలు గెలుచుకుంది. తర్వాతి మూడు స్థానాలలో వరుసగా పంచలింగాల జట్టు, డోన్ వి.బొంతిరాళ్ల జట్టు, చుంచుఎర్రగుడి జట్లు నిలిచి వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు సొంతం చేసుకున్నాయి. నాణ్యమైన భోజనం అందించాలి కర్నూలు కల్చరల్: ఆర్యూ హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఉద్యోగులను ఆదేశించారు. ఆయన గరువారం వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్‌తో కలిసి వర్సిటీలోని మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, భోజన శాలలను పరిశీలించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మెస్ బిల్లులు విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్లు చూస్తూనే నాణ్యత కలిగిన పదార్థాలను అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఉద్యోగులను ఆదేశించారు. హాస్టళ్లలో నీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘రెడ్‌బుక్’ అమలుపై ప్రజల తిరుగుబాటు
చిప్పగిరి: రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలు తారా స్థాయికి చేరిందని, దీనిపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అసలు ఏ కారణం చేత అరెస్టు చేస్తున్నారో పోలీసు సిబ్బందికి కూడా తెలియదనన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అనతి కాలంలోనే ప్రజల నుంచి అసంతృప్తి మూటగట్టుకున్నారన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా.. అక్రమ అరెస్టులే పనిగా పెట్టుకొని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలును పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు లోక్‌నాథ్, ఓబులేసు, మల్లికార్జున, నాగరాజు, ధర్మేంద్ర, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా పోసాని కృష్ణమురళి అరెస్టు ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి -
ఏప్రిల్ 12న ఫోరెన్సిక్ మెడిసిన్ రాష్ట్రస్థాయి సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఏప్రిల్ 12, 13వ తేదీల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగాధిపతి, ఏపీఏఎఫ్‌ఎంటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి.సాయిసుధీర్ చెప్పారు. ఇందుకు సంబంధించి బ్రోచర్లను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఆవిర్భావం(1957) నుంచి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటిలో రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు నిర్వహించలేదన్నారు. మొట్టమొదటిసారి రాష్ట్రస్థాయి వార్షిక సదస్సును ఏపీ అకాడమి ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజి(ఏపీఏఎఫ్‌ఎంటీ) ఆధ్వర్యంలో ఏపీ ఫర్మెడికాన్–2025 పేరుతో సదస్సు నిర్వహంచనున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ఫిజీషియన్–ఎ క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్ రూపొందించామన్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు తప్పక రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. -
చిరుతది సహజ మరణమే
శ్రీశైలం/ప్రాజెక్ట్: శ్రీశైలం క్షేత్రపరిధిలోని రుద్రపార్క్ సమీపంలో మృతి చెందిన చిరుతది సహజ మరణమేనని శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పి.సుభాష్ తెలిపారు. చిరుత కళేబరానికి స్థానిక రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ షేక్, నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ నామినీ కె.శంకర్, నాగార్జున సాగర్– శైలం వైల్డ్ లైఫ్ నిపుణులు డాక్టర్ అరుణ్ వెస్లీ, వెటర్నరీ డాక్టర్ పి.జుబేర్, సెక్షన్ ఆఫీసర్ మదన్, బీట్ ఆఫీసర్ ఠాగూర్ పాల్గొన్నారు. ఈ మేరకు రేంజ్ అధికారి సుభాష్ మాట్లాడుతూ.. చిరుత కొద్దిరోజుల క్రితం రుద్రపార్క్ గోడకు 30 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో సహజ మరణం చెందినట్లు గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలో చిరుత ఎముకలు, వెంట్రుకలు, ఇతర అవశేషాలు లభించాయన్నారు. అయితే చిరుత మృతి చెందిన ప్రాంతం నుంచి రుద్రపార్క్ గోడ ప్రహరీపైకి కళేబరం ఎలా వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
గ్రంథాలయ పితామహుడు హరి సర్వోత్తమరావు
కోవెలకుంట్ల: వందేమాతరం ఉద్యమంలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడిగా.. గ్రంథాలయాల అభివృద్ధికి విశిష్ట సేవలందించి గ్రంథాలయ పితామహుడిగా.. ఆంధ్రతిలక్గా దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన మహోన్నతుడు.. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. శుక్రవారం ఆయన 66వ వర్ధంతి. కర్నూలుకు చెందిన భాగీరథీబాయి, వెంకటరావు దంపతులకు 1883 సెప్టెంబర్ 14వ తేదీన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు జన్మించారు. 1907లో ఎంఏ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణకు గాడిచెర్ల రాజమండ్రిలో ట్రైనింగ్ కళాశాలకు వెళ్లారు. ఉదయం కళాశాలకు వెళ్తూ రాత్రివేళల్లో నిరక్షరాస్య వయోజనుల కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసిన ఘనత గాడిచెర్లదే. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవడంతో గాడిచెర్లలో అంతర్గతంగా దాగి ఉన్న స్వాతంత్య్ర పిపాస, దేశభక్తి ఒక్కసారిగా పెల్లుబికాయి. సాహిత్యం, వయోజన విద్య, గ్రంథాలయోద్యమం, పత్రికా రచన, సంఘసంస్కరణ, సంఘీభావ ప్రకటనలు, సభలు, సమావేశాలతో గాడిచెర్ల జీవితం ముందుకు సాగింది. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌వారు బాలగంగాధర తిలక్‌ను అరెస్ట్ చేసిన రోజునే గాడిచెర్లను అరెస్టు చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఆయనను ఆంధ్ర తిలక్‌గా అప్పట్లో అందరూ పిలిచేవారు. జైలులో ఉంటూనే అనేక గ్రంథాలు రచించారు. హోంరూల్ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించడమే కాకుండా బ్రిటీష్ వస్త్ర బహిస్కారం, జాతీయ విద్య, కల్లు, సారా పికెటింగ్‌లో ఈయన కనుసన్నల్లో నడిచేవి. చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ స్థాపించిన స్వరాజ్య పార్టీని ఆంధ్రలో అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాలతో ఉన్న నంద్యాల స్థానం నుంచి 1928లో పోటీచేసి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. నేడు గాడిచెర్ల 66వ వర్ధంతి -
లా సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది జూన్‌లో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సు 1, 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు, సెప్టెంబర్‌లో జరిగిన 5, 7,9 సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సంవత్సరాల ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్‌కు 56 మందికి 18, మూడో సెమిస్టర్‌కు 66 మందికి 20, ఐదో సెమిస్టర్‌కు 94 మందికి ఇద్దరు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల ఎల్ఎల్బీ మొదటి సెమిస్టర్‌కు 12 మందికి 0, మూడో సెమిస్టర్‌కు 10 మందికి 1, ఐదో సెమిస్టర్‌కు ఇద్దరికి 0, ఏడో సెమిస్టర్‌కు 20కి 0, తొమ్మిదో సెమిస్టర్‌కు 12 మందికి ఇద్దరు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. యువకుడి దుర్మరణం ఆత్మకూరురూరల్: ఆత్మకూరు – దోర్నాల మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మండలంలోని శ్రీపతిరావు పేటకు చెందిన సుమిత్ర(26) అనే యువకుడు గురువారం ఉదయం పని మీద ఆత్మకూరుకు వచ్చాడు. పని పూర్తయిన తర్వాత బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా పట్టణ శివారులోని సొసైటీ గోడౌన్ వద్ద ఎదురుగా వస్తున్న బోలెరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో సుమిత్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు సేకరించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు రైల్వే స్టేషన్లో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ గ్రామానికి చెందిన దండే హరీష్‌రెడ్డి(28) బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ నుంచి ధర్మవరం వెళుతున్న రైలు జమ్మలమడుగు స్టేషన్ సమీపంలోకి రాగానే హరీష్‌రెడ్డి ఒక్కసారిగా రైలు పట్టాలపై తల పెట్టాడు. దీంతో తల, మొండెం వేరయ్యాయి. కాగా బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం మంత్రాలయం: కర్ణాటక మద్యాన్ని భారీగా స్వాఽ దీనం చేసుకున్నట్లు మంత్రాలయం సీఐ రామాంజులు తెలిపారు. మంత్రాలయం పరిమళ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. కారులో కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన ఈడిగ విజయ్‌కుమార్ గౌడ్, అదే మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన దూదేకుల షేక్షావలి అనే ఇద్దరు వ్యక్తులు 34 బాక్స్‌లలో 3264 జాన్స్ ఒరిజనల్ చాయిస్ డీలక్స్ విస్కీ 90ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ పట్టుబడినట్లు తెలిపారు. ఇందులో ఈడిగ విజయ్‌కుమార్ గౌడ్ పరారీ కాగా.. షేక్షావలి పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని , కారును సీజ్ చేసినట్లు తెలిపారు. అనారోగ్యంతో వ్యక్తి బలవన్మరణంకోసిగి: అనారోగ్యంతో మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామానికి చెందిన తిక్కయ్య(50) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మద్యం తాగుడుకు బానిసై తిక్కయ్య అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి కోసిగి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 ఆంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతిని భార్య మాదేవి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లన్న సేవలో కార్మికశాఖ మంత్రి సుభాష్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మ ల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్ దర్శించుకున్నారు. గురువారం శ్రీశైల ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద పీఆర్వో టీ.శ్రీనివాసరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. -
నేడు వక్ఫ్‌బోర్డు చైర్మన్ రాక
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం కర్నూలుకు రానున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ సబీహా పర్వీన్ తెలిపారు. ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుంటారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్న ఉమర్ అరబిక్ స్కూల్‌కు చేరుకొని పాఠశాల పరిసరాలను పరిశీలించి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తారన్నారు. అలాగే 3.45 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించిన అనంతరం జొహరాపురం చేరుకొని అక్కడే టైలరింగ్ కోర్సు పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లను అందిస్తారని తెలిపారు. ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువకులు హొళగుంద: స్థానిక హొళగుంద–బళ్లారి రోడ్డులోని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో స్నానానికి వెళ్లి ఈత రాక కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు కాపాడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు చెందిన షమీ, బాషాతో పాటు పలువురు హొళగుందలోని ఓ మసీదులో పెయింట్ పనికి వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్నానం చేసేందుకు బళ్లారి రోడ్డులోని దిగువ కాలువలో దిగారు. ఇటీవల కాలువ గట్టుకు సిమెంట్ లైనింగ్ చేయడంతో ఈత షమీ, బాషా గట్టు కింద జారుకుంటూ కాలువలో కొట్టుకోపోసాగారు. వారి అరుపులు విన్న అటుగా వెళ్తున్న సిద్దిక్, మౌలాలి, సమీర్ వెంటనే కాలువలో దూకి ఇద్దరినీ బయటకు లాగారు. దీంతో యువకులను పలువురు అభినందించారు. శ్రీమఠంలో శివరాత్రి వేడుకలు మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు నేతృత్వంలో శివలింగానికి తుంగభద్ర జలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకాలు, ఫలపుష్పాలు సమర్పించి మహా మంగళహారతులు గావించి ప్రత్యేక పూజలు చేపట్టారు. పీఠాధిపతి శివుడిని దర్శించుకుని విశేష పూజలు చేసుకున్నారు. భక్తులు శివలింగను దర్శించుకుని నిష్ట పూజలు చేసుకున్నారు. భక్తులకు మహా శివరాత్రి విశిష్టతను భక్తులను వినిపించారు. నేడు సీ.క్యాంపు రైతుబజారు బంద్ కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు సీ.క్యాంపు రైతు బజారును ఈ నెల 27వ తేదీన బంద్ చేయనున్నట్లు ఇన్చార్జ్ ఎస్టేటు అధికారి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతుబజారులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు, వినియోగదారులు గమనించాలని కోరారు. శుక్రవారం నుంచి రైతుబజారు పని చేస్తుందని పేర్కొన్నారు. -
రోగాలు ‘కొని’తెచ్చుకుని!
పెరిగిన పరగడుపు మాత్రలు ● రోజుకు 10 నుంచి 15 మాత్రలు మింగుతున్న జనం ● బీపీ, షుగర్‌తో పెరుగుతున్న వినియోగం ● ఉమ్మడి జిల్లాలో 2 వేల మెడికల్ షాపులు ● రోజూ రూ.6 కోట్ల దాకా మందుల వ్యాపారం కర్నూలు(హాస్పిటల్): ఒంట్లో ఏదైనా నలతగా ఉంటే చాలా మందికి మాత్రలు వేసుకునే వరకు మనసు ఊరుకోదు. జలుబు చేసినా, జ్వరం వచ్చినట్లు అనిపించినా, కడుపులో కాస్త నొప్పిగా ఉన్నా వెంటనే సమీపంలోని మెడికల్ షాపునకు వెళ్లి ఆరోగ్య సమస్యను చెప్పి మందులు కొని వేసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో వందలో నలుగురైదుగురు ఇలా చేస్తుండగా.. ఇప్పుడు నూటికి 20 మందికి పైగా మెడికల్ షాపులనే నమ్ముకున్నారు. మరికొందరికి బీపీ, షుగర్ వంటి జబ్బుల కారణంగా వాటిని తగ్గించుకునేందుకు ప్రతిరోజూ పదుల సంఖ్యలో మందులు వాడుతున్నారు. దీనివల్ల ఉన్న వ్యాధి తగ్గడం ఏమో కానీ, కొత్త వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మరో 700 పైగా హోల్‌సేల్ మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. సగటున రూ.6కోట్లకు పైగా మందులు, సర్జికల్స్ వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. కోవిడ్‌కు ముందు రోజు వ్యాపారం రూ.4కోట్ల వరకు ఉండగా, అనంతరం వచ్చిన జీవనశైలి మార్పులు, అలవాట్ల కారణంగా మందుల వాడకంతో పాటు వాటి ధరలు కూడా పెరగడం గమనార్హం. పెరుగుతున్న జీవనశైలి జబ్బులు బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. ఆహారంలో కల్తీ, ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడం, మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం, శ్రమకు మించి ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాల వల్ల జీవనశైలి జబ్బులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వీటికి వాడే మందుల బడ్జెట్ ప్రతి ఇంట్లో అధికమైంది. ప్రతి ఇంట్లో కేవలం మందులకు పెట్టే ఖర్చు రూ.2వేల నుంచి రూ.5వేల దాకా ఉంటోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ మందుల వ్యాపారం ప్రైవేటులో రూ.6కోట్లకు పైగా ఉంటోంది. ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకే ప్రభుత్వం ప్రతి యేటా ఇచ్చే మందుల బడ్జెట్ రూ.40కోట్లు దాకా ఉంటోంది. వీటితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో మరో రూ.30కోట్ల దాకా మందులకు నిధులు కేటాయిస్తున్నారు. నిద్రలేస్తూనే నోట్లోకి వెళ్తున్న మాత్రలు జబ్బుల కారణంగా నిద్రలేస్తూనే మాత్రలు వేసుకునే పరిస్థితి అధికమైంది. ఉదాహరణకు థైరాయిడ్ జబ్బుకు వాడే మాత్రలు నిద్రలేస్తూనే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ మాత్ర వేసుకున్నాక గంట నుంచి రెండు గంటల వరకు కాఫీ, టీలు కూడా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో షుగర్, గ్యాస్ట్రబుల్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జనాభాలో 15 నుంచి 20 శాతం వరకు షుగర్ బాధితులు ఉన్నారు. వీటికి వాడే మందులు సైతం చాలా వరకు తినకముందు వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని రకాల యాంటిబయాటిక్స్ మాత్రలు సైతం తినకముందు వేసుకుంటేనే బాగా పనిచేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. దేవనకొండకు చెందిన రాజేష్ కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో నొప్పి మాత్రలతో పాటు కడుపులో మంట రాకుండా గ్యాస్ట్రబుల్ మాత్రలు కూడా వేసుకున్నాడు. అప్పటి నుంచి రోజూ అతను గ్యాస్ట్రబుల్ మాత్రలు వాడుతూ వస్తున్నాడు. దీంతో పాటు కుటుంబ సమస్యలు, వంశపారంపర్యం కారణంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులు తోడు కావడంతో మాత్రల సంఖ్య బాగా పెరిగింది. వీటి వాడకం వల్ల ఏమైనా అవుతుందేమోననే బెంగతో మరికొన్ని మాత్రలు వాడటంతో ఏ జబ్బూ ఒక పట్టాన తగ్గని పరిస్థితి నెలకొంది. కర్నూలుకు చెందిన శివయ్య ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్. సోషల్ మీడియాలో వచ్చే వైద్యసంబంధిత రీల్స్, కథనాలు చూస్తుంటాడు. ఏ చిన్న వ్యాధి లక్షణం కనిపించినా దానికి సంబంధించిన మాత్రలను మందుల దుకాణానికి వెళ్లి తెచ్చుకుంటాడు. ఇలా ప్రతిరోజూ 12 నుంచి 15 దాకా మాత్రలు వేసుకుంటాడు. చివరకు వైద్యుని వద్దకు వెళితే అన్ని పరీక్షలు చేయించి ఎలాంటి జబ్బూ లేదని నిర్ధారించారు. తెలియని భయం కారణంగా మందుల వాడకం ఎక్కువైందని, ఏ మందులూ అవసరం లేదని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. -
ప్రణవ నాదం ప్రతిధ్వనించింది.. ప్రభోత్సవం కనుల పండువగా సాగింది.. మహాశివరాత్రి పర్వదినాన బుధవారం శ్రీగిరి క్షేత్రం భక్తజన సంద్రమైంది. లింగోద్భవకాల సమయాన శాస్త్రోక్తంగా నిర్వహించిన పాగాలంకరణ భక్తిపారవశ్యాన్ని నింపింది. అర్ధరాత్రి మల్లికార్జున స్వామి కల్యాణోత
● శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● కనుల పండువగా ప్రభోత్సవం, నందివాహనసేవ ● పాగాలంకరుడైన శ్రీమల్లికార్జున స్వామి ● శాస్త్రోక్తంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ● వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం ● నేడు రథోత్సవం, తెప్పోత్సవంశ్రీశైలంటెంపుల్: ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలం శివమయం అయ్యింది. క్షేత్రంలో ఏ వైపు చూసినా భక్తుల కోలాహలం కనిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామిఅమ్మవార్లకు అక్కమహాదేవి అలంకార మండపంలో నందివాహన సేవ నిర్వహించారు. నందివాహనంలో ఆదిదంపతులను అధిష్టింపజేసి ఆలయ ప్రదక్షణ ద్వారా ఊరేగింపు నిర్వహించారు. రమణీయం.. ప్రభోత్సవం శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రతి ఏటా ప్రభోత్సవం నిర్వహిస్తారు. సుగంధ పుష్పాలతో ప్రభను బుధవారం సాయంత్రం అలంకరించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిపల్లకీలో ఆలయ ప్రదక్షణ చేయించి క్షేత్ర ప్రధాన వీదుల్లోకి తోడ్కొని వచ్చారు. అనంతరం ప్రభపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్తజనం మధ్య గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రభోత్సవం సాగింది. రాత్రి 10గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అర్చకులు, పండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామివారికి అభిషేకం చేశారు. కమనీయం.. కల్యాణోత్సవం రాత్రి 12గంటల సమయంలో స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా కల్యాణానికి కంకణాలను, స్వామిఅమ్మవార్ల అభరణాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి పెండ్లి పీటలపై అధిష్టింపజేసి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగిన వివాహ వేడుకను తిలకించిన భక్తులు పరవశించిపోయారు. కల్యాణోత్సవంలో అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు భ్రమరాంబాదేవి అమ్మవారి తరుపు బంధువులుగాను, స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితులు మల్లికార్జునస్వామివారి బంధువర్గంగా నిలిచారు. వైశిష్టంగా పాగాలంకరణ బ్రహ్మోత్సవాల్లో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో అనవాయితీగా కొనసాగుతోంది. గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవనందులను అనుసంధానం చేస్తూ పాగా అలంకరిస్తారు. హస్తినాపురానికి చెందిన పృథ్వీ సుబ్బారావు దిగంబరుడై పాగాను అలంకరించారు. ఇందుకు రాత్రి 10గంటలకు ఆలయంలోని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మొత్తం ఎనిమిది పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓంనమఃశివాయ అంటూ శివనామస్మరణ మార్మోగింది. పాతాళగంగలో దీపం వదులుతున్న యువతి -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజాము రెండు గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉచిత దర్శన క్యూలైన్ భక్తుల క్యూ క్షేత్ర ప్రధాన వీధుల వద్దకు చేరింది. స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టింది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం ఉచితంగా తాగునీరు, అల్పాహారాన్ని అందించింది. కొందరు భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా శివనామస్మరణ చేశారు. శివమాలను స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించారు. పాగాలంకరణ తిలకించిన శివస్వాములు శివమాలధారణ విరమించారు.నేడు రథోత్సవం, తెప్పోత్సవం బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. -
మహానందీశుడికి టీటీడీ పట్టువస్త్రాలు
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో కొలువైన కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. టీటీడీ ఏఈఓ మోహన్‌రాజు దంపతులు బుధవారం మహానందికి చేరుకుని ఈఓ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్దనశర్మ, ముఖ్య అర్చకులు మణికంఠశర్మలకు అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీశైలం శ్రీనివాసులు, మహానంది శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వైద్యుల సూచన లేకుండా మందులు వాడొద్దు
ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కొంత కాలం ఓపిక పడితే శరీరమే దానిని నయం చేసుకుంటుంది. అవసరం లేకపోయినా మందులు వాడితే గ్యాస్ట్రబుల్, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. తప్పనిసరైతేనే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి మందులు కొని ప్రమాదాలు తెచ్చుకోవద్దు. – డాక్టర్ మోహన్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజి హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు నొప్పుల మాత్రలతో కిడ్నీ జబ్బులు ఇటీవల కాలంలో నొప్పుల నివారణకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఆర్ఎంపీలు ఇచ్చే ఇలాంటి మాత్రల వల్ల కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ప్రతి మందుకూ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. వైద్యులు రోగుల వ్యాధి లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి మందులు సూచిస్తారు. దీనివల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డాక్టర్ ఎస్.అబ్దుల్ సమద్, యురాలజిస్టు, కర్నూలు -
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కోడుమూరు రూరల్: కోడుమూరు ఎకై ్సజ్ పరిధిలోని కృష్ణగిరి క్వారీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.60 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కోడుమూరు ఎకై ్సజ్ సీఐ మంజుల బుధవారం తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు.. తెలవారుజామున సిబ్బందితో కలిసి కృష్ణగిరి క్వారీ వద్ద సోదాలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటకకు చెందిన 40 బాక్స్‌ల 3840 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను సీజ్ చేసి నిందితుడు బండి లోకేష్‌ను అరెస్ట్ చేశారు. మద్యం సరఫరా చేస్తున్న రాజేంద్రపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు చంద్రమోహన్, లక్ష్మి, హెడ్ కానిస్టేబుళ్లు జగన్నాథం, తిరుపాలు, పీరా, కానిస్టేబుళ్లు జగదీష్, సాయి, భూలక్ష్మి, సుజాత, నాగయ్య, విరుపాక్షిరెడ్డి పాల్గొన్నారు. యువకుడి దుర్మరణం వెల్దుర్తి: మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన శ్రీనాథ్ (27) బుధవారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. లారీ డ్రైవర్‌గా, క్లీనర్‌గా జీవనం సాగిస్తున్న శ్రీనాథ్ తన గ్రామం నుంచి కాల్వబుగ్గ వైపు మైనింగ్ ప్రాంతంలో డ్యూటీకి బైక్‌పై వెళ్తూ పెద్దమ్మ గుడి సమీపంలో ముందువెళ్తున్న జీపును ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తల్లి, సోదరి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులు తలిదండ్రుల చెంతకు శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య తప్పిపోయిన చిన్నారులను పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లాకు చెందిన ధనంజనేయులు కుమార్తె ఎ.పరిమళ(12), కర్నూలు రచ్చుమర్రి గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు ప్రదీప్ (3), దేవమాడకు చెందిన రియాజ్ కుమారుడు రజాక్ (8) తప్పిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కుటుబ సభ్యులకు అప్పగించారు. కొండచిలువ హల్చల్ గడివేముల: గడిగరేవుల గ్రామ సమీపంలోని భోగేశ్వరాలయం ప్రధాన కోనేరులో బుధవారం కొండచిలువ ప్రత్యకమైంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు కోనేరులో స్నానాలు చేస్తుండగా కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది, స్థానిక పోలీసులు కోనేరులోని భక్తులను బయటకు పంపి, ఫారెస్టు సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి విజయలక్ష్మి, ఫారెస్ట్ బీట్ అధికారి అబ్దుల్ కలాం, యాంటీ పౌచింగ్ టీం కొండచిలువను పట్టుకుని గని ఫారెస్టులో వదలడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. కోనేరులో యథావిధిగా స్నానాలాచరించారు. -
మహానందీశా...నమోస్తుతే!
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో బుధవారం రాత్రి కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరుడు నందివాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చాడు. ఈఓ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మలు వేదోక్తంగా పూజలు చేసిన అనంతరం స్వామి, అమ్మవారిని నందివాహనంపై కొలువు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. వేలాది మంది భక్తులు నందివాహనంపై కొలువైన మహానందీశ్వరస్వామి దంపతులను కనులారా తిలకించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కళాకారులు శివుడి వేషధారణలో రాక్షసులతో యుద్ధం, నోటిలో కిరోసిన్ పోసుకుని గాలిలో మంటలు పుట్టించడం లాంటి విన్యాసాలు భక్తులను కనువిందు చేశాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం -
కోనేరు వద్ద దొంగ చేతివాటం
మహానంది: మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన వృద్ధ భక్తుల నగదును ఓ దొంగ తెలివిగా ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నాగిరెడ్డి, మిత్రులు మహానందికి వచ్చారు. చిన్నకోనేరు వద్ద దుస్తులు, రూ.5,500 నగదు కవర్ పెట్టి స్నానాలు చేస్తుండగా ఓ యువకుడు అక్కడికి చేరుకుని తన టవల్‌ను అక్కడ పడేసి నగదు ఉన్న కవర్‌ను ఎత్తుకెళ్లాడు. అనంతరం బాధితుడు గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. కాసేపటి తర్వాత అదే దొంగ అక్కడికి చేరుకుని తన టవల్ తీసుకుని పరుగులు తీశాడు. -
ఐక్యతకు ప్రతీక రోజా దర్గా
● రేపటి నుంచి తుంగా తీరంలో ఆధ్యాత్మిక వేడుక ● దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో 535వ ఉరుసు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ● తరలిరానున్న వేలాది మంది భక్తులు కర్నూలు కల్చరల్: కర్నూలు నగరం తుంగభద్రా నది తీరాన హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా రోజా దర్గా వెలుగొందుతోంది. ఈ దర్గా ముస్లిం ప్రజల దైవస్థానం అయినప్పటికీ హిందూ ప్రజలు భక్తులుగా ఉండటం విశేషం. ప్రతి గురు, శుక్రవారాల్లో భక్తులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు. బాబా హజరత్ సయ్యద్ షా ఇస్ హక్ సనావుల్లా ఖాద్రి బాగ్దాద్ దేశీయుడు. 18 సంవత్సరాల వయస్సులో బర్నాల అనే గ్రామంలో 50 సంవత్సరాలు నిరాహార దీక్షలు చేశారని ప్రతీతి. అనంతరం ఆయన బాగ్దాద్ వెళ్లి వివాహం చేసుకొని సయ్యద్‌షా తాజ్ మహమ్మద్‌కు జన్మనిచ్చాడని మతాధిపతు ల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది. తదనంతర మే సనావుల్లా ఖాద్రి కర్నూలుకు వచ్చి తుంగభద్రా నదీ తీరాన రోజా అనే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని పీఠాధిపతి కుటుంబీకులు చెబుతుంటారు. 28 నుంచి ఉరుసు రంజాన్ మాసం ప్రారంభానికి చిహ్నంగా నెలవంక కనిపించిన రోజున రోజా దర్గా ఉరుసు ప్రారంభమవుతుంది. ప్రస్తుత దర్గా పీఠాధిపతి సయ్యద్‌షా దాదా బాషా ఖాద్రి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈనెల 28న రాత్రి గంధోత్సవంతో ప్రారంభమవుతాయి. మార్చి 1వ తేదీ (శనివారం) ఉరుసు, 2వ తేదీ (ఆదివారం)జియారత్ ముషరఫ్ కార్యక్రమం ఉంటుంది.ఉరుసు ఉత్సవాలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఫాతెహాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు దర్గా కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్గా ఆవరణలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఈ ఏడాది రోజా దర్గా 535వ ఉరుసు ఘనంగా నిర్వహించనున్నాం. వేడుక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉరుసులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అన్నదానం నిర్వహిస్తాం. కులమతాలకు అతీతంగా భక్తులు ఉరుసులో పాల్గొని విజయవంతం చేయాలి. – సయ్యద్‌షా దాదా బాషా ఖాద్రీ, రోజా దర్గా పీఠాధిపతి