
హాస్టల్‌లో చదువుకుని..
ఆదోని మండలం నాగథనహళ్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర.. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ కోర్స్‌లో 958 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమంలో నిలిచారు. గత మంగళవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా ప్రతిభా అవార్డు అందుకున్నాడు. ఈ విద్యార్థి ఎమ్మిగనూరు ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉండి స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదివారు. పదేళ్ల క్రితం తండ్రి మాల తిక్కయ్యను కోల్పోయిన ఈ విద్యార్థిని తల్లి ఆసనమ్మ కూలి పనులు చేసి చదివించింది. ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఇంటర్‌లో మంచి మార్కులు సాఽధించానని ఈ విద్యార్థి తెలిపారు. బీఎస్‌సీ అగ్రికల్చర్ కోర్స్ చేసి వ్యవసాయ శాఖలో మంచి ఉద్యోగం సాధించి రైతులకు చేయూతనందించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.