దమ్ముంటే అక్రమాలు నిరూపించండి
పొలం సమాజం స్థలం
కొనుగోలు చేశాం.. లీజ్ కాదు
● క్రైస్తవ ఆస్తులను టీజీ, కేఈ
కుటుంబాలు లీజుకు తీసుకోలేదా?
● ఆధారాలతో నిరూపించ లేకుంటే
ఈనాడుపై పరువు నష్టం దావా
● మసీదు ఇనాం భూముల్లో
ఈనాడు కార్యాలయం నిర్మించలేదా
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం
కర్నూలు(టౌన్): ‘‘50 ఏళ్లుగా ఎస్వీ కుటుంబం రాజకీయాలు చేస్తోంది. ఏనాడు అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ఈ విషయం జిల్లా ప్రజలకు తెలుసు. ఐదు రోజుల క్రితం ఈనాడు యజమాన్యం కేవలం తమపై బురుద జల్లేందుకు ఇసుకలో అక్రమాలు, పొలం సమాజం ఆస్తుల కొనుగోలులో అక్రమాలు చేసినట్లు కథనాలు రాశారు. మీ ప్రభుత్వమే కదా.. దమ్ముంటే అక్రమాలు నిరూపించండి. రాజకీయాలు వదులుకుంటా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్వీ కాంప్లెక్స్ లీజు ప్రాపర్టీ కాదని, ఇన్‌కంట్యాక్స్ చెల్లించి లీగల్‌గా కేపీబిపిఎస్ సంస్థ నుంచి కోనుగోలు చేశామన్నారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నా యని, ఎప్పుడైన తన ఇంటికి వస్తే రికార్డులు చూపించేందుకు సిద్ధమన్నారు. ఇవే భూములను అప్పట్లో టీజీ కుటుంబం, కేఈ కుటుంబాలు లీజుకు తీసుకోలేదా అని ప్రశ్నించారు.
అక్రమాలు నిరూపించకుంటే దావా వేస్తా
ఇసుక అక్రమాలు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మీ ప్రభుత్వమే ఉంది కదా.. విచారణ చేయించండన్నారు. తనపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని రాశారని, మీరైమెన కలగన్నారా? అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడో ఇసుక, లిక్కర్ వ్యాపారం చేశామన్నారు. తాము వ్యాపారం చేసినప్పుడు ఇసుక లీజు రూ.2 లక్షలు ఉంటే రూ.16 లక్షలు పాడి ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం సమకూర్చామన్నారు. రూ.16 లక్షల టెండర్ ఉంటే రూ.1.5 కోట్లు చెల్లించి ఇసుక వ్యాపారం చేశామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క కేసు తమపై లేదన్నారు. తమపై ఆరోపణలను నిరూపించకపోతే ఈనాడు యజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తామన్నారు.
మసీదు ఇనాం భూముల్లో
ఈనాడు కార్యాలయం
మామిదాల పాడు వద్ద సర్వే నెంబర్ 80లోని 4 ఎకరాల్లో నిర్మించిన ఈనాడు కార్యాలయం మసీదు ఇనాం భూములు కాదా అని ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధికి ఉన్న ఆ భూములను ఆక్రమంగా కొట్టేయలేదా? అన్నారు. రామోజీరావు చనిపోయారని, కేసులు తొలగించాలని కోర్టును ఆశ్రయించ డం సిగ్గుచేటన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సంఘం నా యకులు రాఘవేంద్ర నాయుడు, అధికార ప్రతినిధి మల్లి, కార్పొరేటర్లు జుబేర్, యూనుస్, మహిళా నాయకురాలు కల్లా నాగవేణి రెడ్డి పాల్గొన్నారు.


