
కర్ణాటక మద్యం స్వాధీనం
ఆదోని రూరల్: బైక్‌పై కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.కె.జె.సైదుల్ గురువారం తెలిపారు. మండలంలోని పెసలబండ గ్రామానికి చెందిన నర్సారెడ్డి, కపటి గ్రామానికి చెందిన ఈడిగ హరిచంద్ర బైక్‌పై 192 కర్ణాటక టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి బైక్, 192 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అలాగే మద్యం సరఫరా చేసిన పెసలబండ గ్రామానికి చెందిన గిడ్డయ్యపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ట్లు చెప్పారు. ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యా న్ని సరఫరా చేసినా, అమ్మినా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.