
జగన్ మామయ్య చేసిన మార్పులతోనే..
కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామానికి చెందిన బోయ స్వాములు, వరలక్ష్మి దంపతుల కుమార్తె బోయ హరిత ఓర్వకల్లు కస్తూర్బా గాందీ విద్యాలయంలో చదివారు. ఇంటర్ ఎంఈసీ గ్రూపులో 913 మార్కులు సాధించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌బాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తాను వ్యవసాయ కుంటుంబంలో పుట్టి, ఇంట్లో పనులు, పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచానని ఈ విద్యార్థిని తెలిపారు. ఊర్లో జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదివి మంచి మార్కులు సాధించానని, ఇంటర్‌లో 913 మార్కులు సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామయ్య ప్రభుత్వ విద్యలో మార్పులు చేసి ఆయన ప్రవేశపెట్టిన ‘బేబీ బుల్లెట్స్’ అనే పుస్తకం నా చదువుకు ఎంతగానో ఉపకరించిందని ఈ విద్యార్థిని తెలిపారు.