
చదవాలంటే ఎండకు నడవాల్సిందే!
పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక కాలినడకన పాఠశాలకు వచ్చి వెళ్తున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థులు మాత్రం మండుటెండలోనే పాఠశాల నుంచి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. రాచర్ల ఉన్నత పాఠశాలకు కొమ్మేమర్రి, నేరేడుచెర్ల, బొంచెర్వుపల్లి తదితర గ్రామాల విద్యార్థులు ప్రతి రోజూ కాలినడకన వచ్చి వెళ్తున్నారు. ఒంటి పూట బడులు కావడంతో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులను ఇంటికి వదులుతున్నారు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు మంగళవారం సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో నడకయాతన పడుతూ ఇళ్లకు వెళ్తూ కనిపించారు.
– ప్యాపిలి