ఆయుష్ వైద్యుల సంఘం అడహక్ కమిటీ ఎన్నిక
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ (రామా) జిల్లా అడహక్ కమిటీ ఎన్నికై ంది. ఆదివారం అసోసియేషన్ సమావేశం స్థానిక గౌరిగోపాల్ హాస్పిటల్ వద్ద ఉన్న డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్‌లో నిర్వహించారు. అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ బండారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అడహక్ కమిటీ ఎన్నిక చేశారు. జిల్లా ప్రెసిడెంట్‌గా పీవీ నాగరాజ, వైస్ ప్రెసిడెంట్‌గా డీఏ పద్మనాభరెడ్డి, ప్రసాద్, జనరల్ సెక్రటరీగా జె.యధుభూషణ్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా నవీన్‌కుమార్, ట్రెజరర్‌గా రజాక్‌బాషా, ఉమామహేశ్వరి, మహిళా శాఖ అబ్జర్వర్లుగా స్వర్ణలత, లక్ష్మీషాలిని, లీష్మా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా సురేష్‌కుమార్, నాగరాజు, ఫయాజ్, అమర్‌నాథ్, చీఫ్ అడ్వయిజర్‌గా డీఏ పద్మనాభరెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టి. చంద్రశేఖర్‌రెడ్డి, మురళీధర్, స్వర్ణలత, అఖిల, పి. ప్రభాకర్‌రెడ్డి, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
తుగ్గలి:మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన వెంకటేష్(30) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జొన్నగిరి ఎస్‌ఐ ఎన్‌సీ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన రాజేశ్వరితో స్నేహం ఏర్పడడంతో వెంకటేష్ రెండేళ్ల క్రితం ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. సహ జీవనం చేస్తూ జీవిస్తున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెల 14వ తేదీన రాజేశ్వరి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేష్ ఒంటరి జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంటి పైకప్పు గరండాకున్న ఇనుప కొక్కీకి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తండ్రి మల్లికార్జున ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆదివారం తెలిపారు.
సెల్‌ఫోన్ల దొంగల అరెస్ట్
డోన్ టౌన్: సెల్‌ఫోన్‌లను చోరీ చేసే దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున కారులో సెల్‌ఫోన్లు తరలిస్తుండగా అనుమానం వచ్చిన బీట్ కానిస్టేబుల్ తనిఖీ చేశారు. కారులో ఉన్న వంశీ, ప్రేమ్ అనే ఇద్దరిని, చోరీ చేసిన సెల్ ఫోన్లను, కారును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కారులో ఉన్న సెల్‌ఫోన్లు, నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి ఇంటిలో సోదాలు చేశారు. మరికొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోని విచారణ చేపట్టారు. ఈ విషయంపై పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా మాట్లాడుతూ.. విచారణ చేస్తున్నది వాస్తవమేనని, సోమవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ప్రాణం తీసిన ఈత సరదా
● ఎల్లెల్సీలో పడి యువకుడి మృతి
హాలహర్వి: సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. గూళ్యం గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గూళ్యం గ్రామానికి చెందిన శివప్ప(18) అనే యువకుడు పొలం పనులు ముగించుకుని తోటి స్నేహితులతో కలిసి ఎల్లెల్సీలో ఈతకు వెళ్లాడు. స్నేహితులు కాలువలో ఈత కొడుతుండడం చూసి తాను కూడా ఈత నేర్చుకోవాలని శివప్ప మెల్లగా ఈదుకుంటూ కాలువలోకి వెళ్లాడు. ఎక్కువ దూరం వెళ్లి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గమనించిన తోటి స్నేహితులు కాలువలో గాలించగా శివప్ప శవమై తేలాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గంగమ్మ, మారెప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆయుష్ వైద్యుల సంఘం అడహక్ కమిటీ ఎన్నిక


