
ఏడీఏ వేదమణి గిన్నీస్ రికార్డు
● గంటలో 1,046 సరళీ స్వరాలు ఆలపించి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా వ్యవసా య వనరుల కేంద్రంలో ఏడీఏగా పనిచేస్తున్న వేదమణికి సంగీతంలో అరుదైన గౌరవం లభించింది. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఆమె.. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దగ్గర ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో సంగీతం నేర్చుకున్నారు. ఈ క్రమంలో అనేక క్రైస్తవ పాటలను చర్చిల్లో పాడటమే కాకుండా సొంతంగా పాటలు రాసి ఆలపించారు. గత ఏడాది డిసెంబరు 1వ తేదీన కేవలం ఒక గంట సమయంలో 1,046 మంది సరళీ స్వరాలు ఆలపించి వీడియోలను ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు సర్టిఫికెట్, పతకం బహుకరించారు. వీటిని ప్రపంచ క్రైస్తవ బోధకులు అనిల్‌కుమార్ ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గిన్నీస్ రికార్డు లభించడం పట్ల ఆనందంగా ఉందని ఏడీఏ వేదమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు.