
ఏపీటీఎస్‌ఏ ఉమ్మడి జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవం
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్(ఏపీటీఎస్‌ఏ) ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఆదివారం బి.క్యాంపులోని జిల్లా ట్రెజ రీ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా నెల్లూరు జిల్లా ఏపీటీఎస్‌ఏ అధ్యక్షుడు పి.కిరణ్‌కుమార్ వ్యవహరించారు. ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి జిల్లా ట్రెజరీలో సీనియర్ అకౌంటెంటుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన చొరవ తీసుకోవడంతో పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏపీటీఎస్‌ఏ ఉమ్మడి జిల్లా శాఖ అధ్యక్షుడుగా డి.రవికుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎస్.మహబూబ్‌బాషా, ఉపాధ్యక్షులుగా టి.వనిత, పి.సుధాకర్‌రెడ్డి, ఎస్.ఆంజాద్‌బాషా, రాకేష్, కార్యదర్శిగా టి.గురుమూర్తి, జాయింట్ సెక్రటరీలుగా కె.విజయమ్మ, జి.అరవింద్ హనోక్, ఆర్.లక్ష్మణ్ నాయక్, కోశాధికారిగా ఎన్.సునీల్‌బాబు. స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా ఉదయ్‌కుమార్, వేమచంద్రరావు, హెచ్‌ఎండీ అలియా ఎన్నికయ్యారు.