హొళగుందలో సామూహిక వివాహాలు | - | Sakshi
Sakshi News home page

హొళగుందలో సామూహిక వివాహాలు

Apr 15 2025 1:52 AM | Updated on Apr 15 2025 1:52 AM

హొళగు

హొళగుందలో సామూహిక వివాహాలు

హొళగుంద: మండల కేంద్రమైన హొళగుందలో సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది జంటలు ఒక్కటయ్యాయి. వధూవరుల బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామపెద్దలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాలు, సామూహిక వివాహాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపించారు. నూతన వధూవరులను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆశీర్వదించారు. ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మార్పీఎస్‌, దళిత సంఘాలు ఈ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

రక్తదానం మహా దానం

● హాల్వి మఠం పీఠాధిపతి మహాంతస్వామి

కౌతాళం: రక్తదానం మహాదానమని హాల్వి మఠం పీఠాధిపతి మహాంతస్వామి అన్నారు. బుధవారం జరగనున్న మహాంతస్వామి జాతరను పురస్కరించుకుని సోమవారం మఠం వారి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించి 580 మంది రక్తం దానం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో రక్తదానం చేయడం ఆదోని డివిజన్‌ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. ఈ శిబిరానికి కర్నూలుతో పాటు బళ్లారి, గుంతకల్‌, ఆదోని నుంచి వైద్యులు తరలివచ్చి రక్త సేకరణ చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, పెద్దలు మహంతస్వామి శిష్యరిక బృందం వారు పాల్గొన్నారు.

చేరిన నెల రోజులకే జాబ్స్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌

డీఆర్‌డీఏలో చర్చనీయాంశంగా

మారిన నియామకం

కర్నూలు(అగ్రికల్చర్‌): డీఆర్‌డీఏలో జాబ్స్‌ మేనేజర్‌ నియామకం విమర్శలకు తావిస్తోంది. ఎన్‌.అశోక్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి మొదటి పక్షం వరకు ప్రయివేటు కంపెనీల్లో పనిచేశారు. జనవరి 18న కూటమి పార్టీల నేతల సిపారసుతో సీడాప్‌లో డీఆర్‌డీఏకు చెందిన టీటీడీసీలో జాబ్స్‌కు సంబంధించి ఎస్‌ఆర్‌టీపీగా(ట్రైనర్‌) నియమితులయ్యారు. ఒక నెల వేతనం మాత్రమే పొందారు. ఉన్నట్టుండి ఆయనను ఏకంగా జాబ్స్‌ మేనేజర్‌ పోస్టింగ్‌ వరించడం డీఆర్‌డీఏలో సంచలనంగా మారింది. 10–15 ఏళ్ల సీనియర్లు ఎందరో ఉండగా జనవరిలో చేరిన వ్యక్తిని ఏకంగా కీలకమైన జాబ్స్‌ మేనేజర్‌గా నియమించడం చర్చనీయాంశమవుతోంది. ముడుపులు భారీగా ముట్టబెబితే తప్ప ఇది సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వంలో డబ్బుంటే ఏదైనా సాధ్యమనేందుకు ఈ నియామకం తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

కుంగిన ‘గోరుకల్లు’ కట్ట

పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్‌ కట్ట సోమవారం కుంగింది. దీంతో స్థానికులు, రైతులు భయందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గోరుకల్లు జలాశయంలో 5.2 టీఎంసీల నీరు ఉంది. ఈ నెలలో కట్ట భారీగా కుంగినట్ల అధికారులు గర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి స్థాయి పనులు చేయకుండా కేవలం నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గోరుకల్లు పెండింగ్‌ పనుల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం నిర్వహణ పనులు చేయిస్తున్నారు. దీంతో సోమవారం జలాశయం ఓటీ రెగ్యులేటర్‌ సమీపంలోని 3,200 మీటర్ల వద్ద 30 మీటర్ల మేర కట్ట కుంగిపోయింది. జలాశయం నీటిమట్టం 245 నుంచి 250 మీటర్లు వద్ద కట్ట కుంగినట్లు అధికారులు తెలిపారు. కట్ట కుంగిపోవడంపై అంచనా వేసిన మరమ్మతు కోసం జిల్లా కలెక్టర్‌కు రూ. 2కోట్లకు ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ సుభకుమార్‌ తెలిపారు. కాగా.. ఈ కట్ట కుంగడం ఇది మూడోసారి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇదే చోట కట్ట కుంగిపోవడంతో యుద్ధప్రాదిపదికన రూ. కోటితో పనులు చేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు.

హొళగుందలో సామూహిక వివాహాలు 1
1/2

హొళగుందలో సామూహిక వివాహాలు

హొళగుందలో సామూహిక వివాహాలు 2
2/2

హొళగుందలో సామూహిక వివాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement