
గత ప్రభుత్వ చలువే
అనంతపురం జిల్లా పామిడికి చెందిన శ్రీనివాసులు, రమబాయిల కుమార్తె ఎం. దృతికబాయి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 987 మార్కులు సాధించారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవటం తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక బనవాసి ఏపీఆర్‌జేసీ కాలేజీలో చేర్పించారు. గత ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకువచ్చిన మార్పులు, విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో మెరుగైన విద్యను అందించారు. ఏపీఆర్‌జేసీ కాలేజీలో నాణ్యమైన విద్యనందించటంతో తమ బిడ్డ మంచి మార్కులు సాధించారని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమబాయిలు చెపుతున్నారు.