
రాజకీయ కక్షతోనే ఎంపీ మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు
కర్నూలు (టౌన్): రాజకీయ కక్షతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఆదివారం స్థానిక సి. క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మిథున్‌రెడ్డి కుటుంబంపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఆధికార అండతో ప్రతి అంశంపై ఆరోపణలు చేస్తున్నారు తప్పా.. అందులో ఏ ఒక్కటి నిజం లేదని ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికై న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.