
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
కర్నూలు: పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ మైదానంలో ఏపీఎస్పీ ఎస్‌డీఆర్‌ఎఫ్ పోలీసులకు, సివిల్, ఏఆర్ పోలీసుల జట్లకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌ను గురువారం డీఐజీ, ఎస్పీ కలిసి ప్రారంభించారు. వారు స్వయంగా క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచారు. కర్నూలు జిల్లా సివిల్, ఏఆర్ పోలీసుల జట్టుకు డీఐజీ కెప్టెన్‌గా, ఏపీఎస్పీ ఎస్‌డీఆర్‌ఎఫ్ పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు నూతనోత్సాహాన్ని ఇస్తాయన్నారు. శారీరక దృఢత్వానికి, ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నాగేంద్రరావు, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్లు ఎస్‌ఎం బాషా, సుధాకర్ రెడ్డి, రవికిరణ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం