
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కోసిగి/పెద్దకడబూరు: అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు కోసిగి ఎకై ్స జ్ పోలీసులు తెలిపారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో సీఐ భార్గవ్ రెడ్డి, కర్నూలు ఈఎస్‌టీఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాలపల్లి నుంచి కంబాలదిన్నె గ్రామం వైపు పోవు రోడ్డు లోని మారెమ్మ గుడి వెనుక భాగం మట్టి రోడ్డులో కారులో 40 బాక్స్‌ల్లో టెట్రా ప్యాకెట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మంత్రాల యం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన గోవిందు, పోలి వీరేష్, మజ్జిగ బొజ్జప్ప లు, పెద్దకడబూరు మండలం కంబదహాల్ గ్రామానికి చెందిన బోయ బాలును అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్, కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ ఉసేని పరారయ్యారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలించామని, పరారైన వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐలు తెలిపారు. దాడుల్లో కోసిగి ఎకై ్సజ్ ఎస్‌ఐ కె. నాగేంద్ర, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు భరత్, రవి కుమార్, మునిరంగడు, కర్నూలు ఈఎస్‌టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మధు, లాలూ, కుమార్ స్వామి రెడ్డి పాల్గొన్నారు.