
సేల్స్‌మ్యాన్ కూతుళ్లకు ఉత్తమ మార్కులు
కల్లూరు షరీఫ్ నగర్‌కి చెందిన రాజశేఖర్, జ్యోతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం. రెండో కూతురు డి.నందిని, మూడో కూతురు నవీనాలు ఇద్దరు ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించారు. నందిని బైపీసీలో 980 మార్కులు, నవీనా 937 మార్కులు సాధించారు. ముగ్గురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నారు. నీట్ ప్రవేశ పరీక్షకు అధ్యాపకులు కోచింగ్ ఉచితంగా ఇప్పిస్తున్నారని, డాక్టర్ కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నందిని తెలిపారు.