
పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్
కర్నూలు(టౌన్): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా(పీఎసీ) మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్), మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్(కర్నూలు) నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మందికి చోటు లభించగా.. కమిటీలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వీరిరువురికీ అవకాశం దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రోడ్డు ప్రమాదాల
నియంత్రణే లక్ష్యం
కర్నూలు: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని వాహనదారులకు తనిఖీల సందర్భంగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలోని 39 పోలీస్ స్టేషన్లు ఉండగా ఆయా స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది కలసి తనిఖీలు నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు.
రేపటి ‘పరిష్కార వేదిక’ రద్దు
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈనెల 14వ తేదీన రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.
14న పీజీఆర్‌ఎస్ రద్దు
కర్నూలు: ఈనెల 14న ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు ‘గురుకుల’ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ( 2025–26 ) 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 13న (నేడు) పరీ క్ష నిర్వహిస్తున్నట్లు గురుకులాల సమన్వయ కర్త డాక్టర్ ఐ.శ్రీదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలోని 8, నంద్యాల జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 1,120 సీట్లకు 9340 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 1,480 సీట్లకు 7,727 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్

పీఎసీ సభ్యులుగా బుగ్గన, హఫీజ్‌ఖాన్