
కూతుర్ల చదువు కోసం ఆటో డ్రైవర్‌గా..
కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ కాలనీకి చెందిన బండి క్రిష్ణుడు, పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. పెద్ద కూతురు యశస్విని బీటెక్ చదువుతుంది. చిన్న కూతురు బండి పావని ప్రభుత్వ జూనియర్(టౌన్ మోడల్) కాలేజీలో చదువుతూ ఇంటర్మీడియేట్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్‌లో 986 మార్కులు సాధించింది. తండ్రి బండి క్రిష్ణుడు డిగ్రీ వరకు చదువుకోని ఉద్యోగం లేకపోవడంతో ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటూ పిల్లల చదువు కోసం నందికొట్కూరు సమీపంలోని కొణిదెల గ్రామం నుంచి కర్నూలుకు వచ్చి స్థిరపడ్డారు. ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే చదివి రాణిస్తుండటం విశేషం.