దినకూలీ ఇంట.. చదువుల తల్లి
కల్లూరు అర్బన్‌లోని ముజఫర్ నగర్‌లోని వెంకటచలపతి కాలనీకి చెందిన యు.రాముడు, యు.భాగ్యమ్మ దంపతులకు యు.శ్రావణి, యు.మానస సంతానం. శ్రావణికి వివాహమైంది. మానస పంచలింగాల కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయంలో చదువుతోంది. అకౌంటెన్స్ అండ్ టాక్సేషన్‌లో ఇంటర్మీడియేట్ చదువుతూ ఫస్ట్ ఇయర్‌లో 500కి 495 మార్కులు సాధించింది. సెకండియర్‌లో 991 మార్కులు సాధించింది. తండ్రి రాము కరోనా సమయంలో చనిపోగా.. తల్లి భాగ్యమ్మ కుమార్తెను బాగా చదివించాలని కొన్నాళ్లు హోటళ్లలో పనిచేసింది. ఆ తర్వాత మట్టి పనికి దినసరి కూలీకి వెళ్తోంది. సీఏ చదివి చార్టెడ్ అకౌంటెంట్‌గా రాణించాలనేది మానస ఆశాభావం.


