
ఎట్టకేలకు డీఎస్సీ!
పోస్టుల భర్తీ ఇలా..
డీఎస్సీతో ఉమ్మడి జిల్లాలో ఎస్‌జీటీ 1817, స్కూల్ అసిసెంట్లు లాంగ్వేజ్–182 పోస్టులు, హిందీ 114, ఇంగ్లిషు 81, గణితం 90, ఫిజికల్ సైన్స్ 66, బయోలాజికల్ సైన్స్ 74, సోషల్ స్టడీస్ 112, ఫిజికల్ ఎడ్యుకేషన్ 209 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఏపీ మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకులాల్లో జోన్–4లో ఉమ్మడి జిల్లాలో సుమారు 121 పోస్టులు భర్తీ చేయనున్నారు.
కర్నూలు సిటీ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఆగస్టు నెలలో హడావుడి చేసింది. టెట్ పరీక్షల పేరుతో నాడు డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేసి, టెట్ నిర్వహించి ఫలితాలను సైతం విడుదల చేశారు. అదిగో...ఇదిగో అంటూ నాలుగైదు నెలలుగా నిరుద్యోగులను ఊరించి..ఊరించి ఎట్టకేకలకు డీఎస్సీ నోటఫికేషన్‌ను జారీ చేశారు. ఏడాదికిపైగా నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది విద్యార్థులు మనస్తాపానికి గురై అనారోగ్యాల బారిన పడ్డారు.
ఇదీ నిజం
● వాస్తవానికి 2018లోనే 1,393 టీచర్ పోస్టులు, 192 క్రాఫ్ట్ టీచర్ పోస్టులను రద్దు చేసి అప్పటి డీఈఓ వాటిని డీఎస్సీలో నోటిఫై చేయాలని నాటి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం నామమాత్రంగా 608 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది.
● 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పోస్టులను భర్తీ చేసింది. అదే విధంగా 1998 డీఎస్సీ బాధితులకు, 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు రాని వారికి సైతం టీచర్ పోస్టులు ఇచ్చింది.
● గతేడాది జిల్లాలో సుమారు 1,693 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేయించారు. దీంతో నిరుద్యోగులు మరో ఏడాది పాటు డీఎస్సీ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి.
● స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుత డీఎస్సీలో ఒక్క పోస్టు కూడా చూపలేదు.
● పరీక్షలను ఆన్‌లైన్‌లో నెల రోజుల పాటు నిర్వహిస్తుండడంపై నిరుద్యోగులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● ఒకే నోటిఫికేషన్, ఒకే ప్రశ్నపత్రం ద్వారా పరీక్షలను ఆఫ్‌లైన్లో నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
● గతేడాది ఆగస్టు నెలలో నిర్వహించిన టెట్‌లో తక్కువ మంది అర్హత పొందారు. మిగిలిన వారికి కూడా అర్హత పొందేందుకు మరోసారి టెట్ నిర్వహించి..ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా చేశారు.
అవసరం ఇదీ..
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,843 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో చదవుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా 4,000 టీచర్ పోస్టులు అవసరం అని గతంలో జిల్లా విద్యాశాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం 2,645 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.
● ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన చేసే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ‘టెట్’ నిర్వహించినా డీఎస్సీలో ఒక్క పోస్టును కూడా చూపలేదు. పోస్టులు భర్తీ చేయనప్పుడు ఎందుకు టెట్ నిర్వహించారని ప్రశ్నిస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
● మున్సిపల్ స్కూళ్లలో అన్ని క్యాటగిరీలకు చెందిన 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. మున్సిపల్ టీచర్లకు పదోన్నతులు ఇవ్వలేక 22 పోస్టులు మాత్రమే ఇచ్చారు.
● ప్రస్తుతం విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన క్లస్టర్, మోడల్ ప్రైమరీ స్కూల్ విధానంతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇంకా 1,300 టీచర్ పోస్టులకు పైగా అవసరమని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.
వైఎస్సార్‌సీపీ చొరవతోనే...
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పోస్టులు మంజూరైనా వారికి అవసరం లేని వాటిని ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదలాయించారు. దీంతో సుమారు 1,845 పోస్టులకు జిల్లాకు వచ్చాయి. ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చారు. దీంతో ఎస్‌జీటీ పోస్టులను నేటి డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అవకాశం కలిగింది.
ఉమ్మడి జిల్లాలో 2,645 పోస్టుల
భర్తీకి నోటిఫికేషన్
ఎస్‌జీటీ 1,817, స్కూల్ అసిస్టెంట్లు
828, ట్రైబల్ వెల్ఫేర్‌లో 33 పోస్టులు
డీఎస్సీలో చూపించని
స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు
నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో
పరీక్షలపై మండిపడుతున్న
నిరుద్యోగులు