
యాగంటిని దర్శించుకున్న డైరెక్టర్ సుకుమార్
బనగానపల్లె రూరల్: మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో ఏకశిలారూపంలో కొలువైన శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుహను సందర్శించి అక్కడున్న వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. గతంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 షూటింగ్ ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ డైరెక్టర్ సుకుమార్ యాగంటిని దర్శించుకోవడంతో పుష్ప–3 షూటింగ్ చిత్రీకరణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం వచ్చి ఉంటారనే చర్చ అభిమానుల మధ్య సాగుతోంది.