
ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బ
వైఎస్సార్‌సీపీలో గెలిచి
బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్‌పర్సన్ శాంత
● ఎమ్మెల్యే పార్థ సమక్షంలో
బీజేపీ కండువా వేసుకున్న
శాంత భర్త నాగేంద్ర
● పార్టీకి ద్రోహం చేయడంపై
కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం
● శాంతకు వ్యతిరేకంగా 36 ఓట్లు,
విశ్వాసం కోల్పోయిన వైనం
● కొత్త చైర్‌పర్సన్‌గా లోకేశ్వరిని
రేపు ఎన్నుకోనున్న కౌన్సిలర్లు
● ఫిరాయింపు రాజకీయాలకు
చెంప పెట్టుగా ఆదోని కౌన్సిలర్లు
● బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా
నిలిచిన కౌన్సిలర్లకు
వైఎస్సార్‌సీపీ అభినందనలు
ఆదోని టౌన్: ఆదోని మునిసిపల్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మునిసిపల్ పీఠం దక్కితే రెండున్నరేళ్లు బోయ శాంత, ఆ తర్వాత లోకేశ్వరి కొనసాగాలని అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 42 వార్డులలో 41 వార్డులు వైఎస్సార్‌సీపీ, ఒక వార్డు టీడీపీ దక్కించుకున్నాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ తరపున శాంత మునిసిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత రాజీనామా చేయాల్సి ఉంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ వ్యవహారంపై పార్టీ దృష్టి సారించలేదు. ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాలని శాంతకు, ఆమె భర్త నాగేంద్రకు సాయిప్రసాద్‌రెడ్డి సూచించారు. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో అధికార కాంక్షతో నాగేంద్ర ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీ కండువా వేసుకున్నారు. ఆ తర్వాత మరో నలుగురు కౌన్సిలర్లను బీజేపీలోకి చేర్చుకున్నారు. వైఎస్సార్‌సీపీకి నాగేంద్ర, శాంత దూరంగా ఉంటూ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్నారు. ఆదోని అభివృద్ధికి పాటుపడకుండా ఎమ్మెల్యే కనుసన్నల్లో నడిచారు. ఈక్రమంలో కౌన్సిలర్లు మార్చి 19న కలెక్టర్ రంజిత్‌బాషాను కలిసి శాంతపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ
బుధవారం ఉదయం ప్రత్యేక బస్సులో కౌన్సిలర్లు ఉదయం 10.30 గంటలకు కౌన్సిల్ హాలుకు చేరుకున్నారు. ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రాగానే అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేశారు. శాంతపై అవిశ్వాస తీర్మానాన్ని కౌన్సిలర్ బాలజీ యాదవ్ ప్రవేశపెట్టారు. దీన్ని మరో కౌన్సిలర్ సందీప్‌రెడ్డి బలపరిచారు. ఆ తర్వాత 35 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే మధుసూదన్ మొత్తం 36మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు. దీంతో చైర్‌పర్సన్ బోయ శాంతపై అనర్హత వేటు వేస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకటించారు. త్వరలోనే నూతన చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ తెలిపారు.
ఆదోని అభివృద్ధి కోసమే
అవిశ్వాస తీర్మానం
ఆదోని అభివృద్ధి కోసం పలు అభివృద్ధి పనులు కౌన్సిల్ దృష్టికి, చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లినా శాంత నిర్లక్ష్యం చేశారని, అందుకే తాము అవిశ్వాసం ప్రవేశపెట్టామని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు సందీప్‌రెడ్డి, నరసింహులు, రాజేశ్వర్‌రెడ్డి, నాగరాజ్, ఎన్.పి.లక్ష్మిదేవి, లోకేశ్వరి తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేతో కుమ్మకై ్క వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే లక్ష్యంతో ఉన్న చైర్‌పర్సన్‌పై తాము అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదోని కొత్త చైర్‌పర్సన్‌గా బోయ లోకేశ్వరిని కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. రేపు సబ్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ ఈ ఎన్నికను నిర్వహించనున్నారు.
కౌన్సిలర్లకు సెల్యూట్
బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీపై విధేయత చూపి పార్టీ వైపు నిలబడిన 35మంది కౌన్సిలర్లను జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అభినందించారు. కౌన్సిలర్ల వ్యక్తిత్వం పార్టీలో పదవులు దక్కించుకున్న ప్రతీ వ్యక్తికి ఆదర్శమని కొనియాడారు.

ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బ