
పేద ఇంట విద్యా దీపం
కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన తెలుగు మహేష్, సువర్ణమ్మలకు రెండెకరాల భూమి మాత్రమే ఉంది. ఉన్న కాస్త భూమిలో పంటలు పడించడంతో పాటు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె మానస పంచాలింగాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఓకేషనల్ (అకౌంట్స్ ట్యాక్సేషన్) సెకండియర్‌లో 992మార్కులు సాధించారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థిని మానస మాట్లాడుతూ.. తనను చదివించాడనికి తల్లిదండ్రులు ఎంతో పడ్డ కష్టపడ్డారని, ఉపాధ్యాయులు కూడా ఎంతగానో ప్రోత్సహించారన్నారు. తాను ఐఏఎస్ అయ్యి మారుమూల గ్రామాల్లోని పిల్లలకు చదువు అందించేందుకు కృషి చేస్తానని మానస తెలియజేశారు.