
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
బేతంచెర్ల: పట్టణంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక శేషారెడ్డి హైస్కూలు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. ఆయా ప్రాంతాల నుంచి 18 జతల వృషభాలు ఈ పోటీల్లో పాల్గొనాయి. చెన్న కేశవ స్వామి ఆలయ కమిటీ సభ్యులు రైతు సంఘం నాయకులు బూషిరెడ్డి, సీహెచ్ నాగిరెడ్డి పోటీలను ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామాల యువకులు, రైతులు పోటీలను తిలకించడానికి రావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈలలు కేరింతల మధ్య వృభజరాజములు రంకెలు వేస్తుండగా పోటీసులు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలుకు చెందిన అక్షరారెడ్డి, కోడుమూరుకు చెంఇన శశాంక్ శ్రేయ ఎద్దులు సంయుక్త విజేతగా నిలిచి ప్రథమ, ద్వితీయ నగదు బహుమతిని కై వసం చేసుకున్నాయి. తాండ్రపాడుకు చెందిన వరలక్ష్మి ఎద్దులు తృతీయ, ఎమ్మిగనూర్‌కు చెందిన సాయి వర్ధన్ వృషభాలు నాల్గొవ, సంజామలకు చెందిన గుండం చెన్నారెడ్డి వృషభాలు 5వ స్థానంలో నిలిచాయి. దాతలు సహకారంతో వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల నగదు బహుమతులను దాతలు, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, రైతు సంఘం నాయకుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగభూషణం రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, రామ్ మోహన్‌రెడ్డి, అన్నారావు, వీరభద్రారెడ్డి, అజయ్ పాల్గొన్నారు.

హోరాహోరీగా బండలాగుడు పోటీలు