
వైభవంగా సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ
హొళగుంద: స్థానిక సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో కాశీ మఠం వారణాసి పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహా స్వామి ఆధ్వర్యంలో సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ వైభవంగా నిర్వహించారు. బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా రెండు రోజు శుక్రవారం ఉదయం జరిగిన బృహత్తర కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సంగీత కార్యక్రమాలు, భజనలు, పూజలతో హొళగుందలో ఆధ్యాత్మిక వా తావరణ నెలకొంది. ఈ సందర్భంగా జగద్గురువు భక్తులనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమానికి జంగమర హొసళ్లికి చెందిన అజాత శంభులింగ శివాచార్య, పాల్తూరు చెన్నవీర శివాచార్య, కొట్టూరు శాకామఠానికి చెందిన మరికొట్టూరు దేశీకేంద్ర మహాస్వాములు, నందీపుర డాక్టర్ మహేశ్వరా శివాచార్య మహాస్వాములు, రౌడకుంద శివయోగి శివాచార్య మహాస్వాములు హాజరయ్యారు.
లింగ పూజ పరమ శ్రేష్టం
మనసు చెంచలం కాకుండా క్రమశిక్షణ, ఏక్రాగత, ప్రశాంతతకు లింగ పూజ ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందని కాశీ జగద్గురువులు అన్నారు. కుళ్లు కుతంత్రలు వదిలి తమకు చేతనైనంత మేర పేదలకు దాన ధర్మాలు చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చెప్పారు. శాంతితో ప్రశాంత జీవనం గడుపుకునేలా జీవితాన్ని తీర్చుకోవాలని ఆయన ఉపదేశం చేశారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుని మంచి మార్గాల్లో నడవాలన్నారు. నవ సమాజాన్ని నిర్మించుకోవాలని భక్తులకు ఆయన బోధ చేశారు.

వైభవంగా సంగీత యుక్త ఇష్టలింగ మహాపూజ