
నెలకు రూ.10–15వేలు బీజేపీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలంట
మేం గుడికంబాలి నుంచి ఇసుక తోలుతున్నాం. బతికేందుకు ఫైనాన్స్‌లో ట్రాక్టర్ తెచ్చుకున్నాం. ఒక ట్రిప్పు తోలితే ఖర్చులు పోనూ రూ.400–500 మిగులుతాది. ఇసుక తోలుతుంటే రాత్రి ఒంటిగంటకు, రెండు గంటలకు ట్రాక్టర్లను ఎమ్మెల్యే మనుషులు బీజేపీ వాళ్లు రమాకాంత్, విజయ్, సాయన్న వచ్చారు. నెలకు రూ.10–15వేలు ఇవ్వాలంటున్నారు. టిప్పర్లు అయితే ట్రిప్పుకు రూ.1500 ఇవ్వాలి. లేదంటే పోలీసులకు ట్రాక్టర్ అప్పగిస్తున్నారు. రాత్రంతా స్టేషన్ వద్దే ఉన్నాం. చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటున్నారు. ఎక్కడ ఫ్రీ ఉంది చెప్పండి. ఇప్పుడు దీనికి ఏం చెబుతారు?’
– ఇటీవల చిన్నపెండేకల్ వాసి కృష్ణను వేధిస్తే మీడియాతో పంచుకున్న వేదన ఇది